దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్, మహారాష్ట్రతో పాటు బెంగాల్ లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా బెంగాల్ లో రైల్వే ట్రాక్స్ దెబ్బతిన్న కారణంగా భారతీయ రైల్వే పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను దారిమళ్లించారు. ఇంకొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. ఉత్తర బెంగాల్ లో, ముఖ్యంగా డార్జిలింగ్ కొండలలో కుండపోత వర్షాలు కురిశాయి. ఆకస్మిక వరదల కారణంగా 14 మంచి చనిపోయారు. ఉత్తర బెంగాల్ లో 12 గంటల్లో 300 మి.మీ కంటే ఎక్కువ ఆకస్మిక వర్షపాతం నమోదైంది. భూటాన్, సిక్కిం నుంచి సంకోష్ నది పొంగిపొర్లుతుంది. రెండు వంతెనలు కూలిపోయాయయి. పలు రహదారులు దెబ్బతిన్నాయి. డార్జిలింగ్, కాలింపాంగ్, జల్పైగురి, అలీపుర్దువార్ లో పంట పొలాలు మునిగిపోయాయి.
ఉత్తర బెంగాల్ లో భారీ వర్షాల కారణంగా రైళ్లు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఈ మేరకు పలు రైళ్లను రద్దు చేయడంతో మరికొన్ని రైళ్లను డైవర్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇంకొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసిటనల్ఉ ఈశాన్య సరిహద్దు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కపింజల్ కిషోర్ శర్మ వెల్లడించారు. “భారీ వర్షం కారణంగా అలీపుర్దువార్ డివిజన్ పరిధిలో రైల్వే పట్టాలపై నీరు ప్రవహిస్తోంది. పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని తాత్కాలికంగా రద్దు చేశాం. ఇంకొన్ని రైళ్లను దారిమళ్లించాలని నిర్ణయించాం” అని శర్మ వెల్లడించారు.
⦿ రైలు నంబర్ 19306 (కామాఖ్య – డాక్టర్ అంబేద్కర్ నగర్) ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 00234 (సైరాంగ్ – ఖగారియా) స్పెషల్
⦿ రైలు నంబర్ 15934 (అమృత్‌సర్ – న్యూ టిన్సుకియా) ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 15622 (ఆనంద్ విహార్ టెర్మినల్ – కామాఖ్య) ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 15622 (ఆనంద్ విహార్ టెర్మినల్ – కామాఖ్య) ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 2062 (ఆనంద్ విహార్ టెర్మినల్ – కామాఖ్య) ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 15484 (ఢిల్లీ – అలీపుర్దువార్ జంక్షన్) ఎక్స్ ప్రెస్
⦿ రైలు నెం. 13150 (అలీపుర్దువార్ జంక్షన్ – సిలిగురి జంక్షన్) ఎక్స్ ప్రెస్
⦿ రైలు నెం. 12506 (ఆనంద్ విహార్ టెర్మినల్ – కామాఖ్య) ఎక్స్ ప్రెస్
⦿ రైలు నెం. 13149 (సీల్దా – అలీపుర్దూర్ జం.) కాంచన్‌కన్య ఎక్స్ ప్రెస్
⦿ రైలు నెం. 15467 (సిలిగురి జం. – బమన్‌హాట్) ఇంటర్‌సిటీ ఎక్స్ ప్రెస్
⦿ రైలు నం. 75741 (సిలిగురి జం. – ధుబ్రి) ఇంటర్‌సిటీ ఎక్స్ ప్రెస్
⦿ రైలు నెం. 75725 (సిలిగురి జం. – న్యూ బొంగైగావ్) DMU
⦿ రైలు నం. 75713 (సిలిగురి Jn. – బమన్ హాట్) DMU
⦿ రైలు నెం. 15767 (సిలిగురి జం. – అలీపుర్‌దూర్ జం.) ఇంటర్‌సిటీ ఎక్స్ ప్రెస్
⦿ రైలు నెం. 15777 (న్యూ జల్పైగురి – అలీపుర్‌దువార్ జం.) టూరిస్ట్ ఎక్స్ ప్రెస్
⦿ రైలు నం. 15703 (కొత్తది జల్పైగురి – బొంగైగావ్) ఎక్స్ ప్రెస్
⦿ రైలు నెం. 15464 (సిలిగురి జంక్షన్ – బాలూర్‌ఘాట్) ఇంటర్‌సిటీ ఎక్స్ ప్రెస్
⦿ రైలు నెం. 55422 (బలూర్‌ఘాట్ – మాల్డా టౌన్) ప్యాసింజర్
⦿ రైలు నెం. 15768 (అలిపుర్‌దార్ జంక్షన్ – సిలిగురి జంక్షన్) ఇంటర్‌సిటీ ఎక్స్ ప్రెస్
⦿ రైలు నెం. 75741 (సిలిగురి జంక్షన్ – ధుబ్రి) DEMU
⦿ రైలు నెం. 75726 (న్యూ బొంగైగావ్ – సిలిగురి జంక్షన్) DEMU
Read Also: మ్యాజిక్ మేఘాలయా టూర్.. IRCTC అదిరిపోయే ప్యాకేజ్, అస్సలు మిస్ అవ్వద్దు!