Kalki 2: కల్కి 2898AD (Kalki 2898AD).. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో.. దీపికా పదుకొనే (Deepika padukone), దిశా పటాని (Disha Patani) హీరోయిన్ లుగా.. రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన చిత్రం ఇది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ (Ashwini Dutt) భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వసూలు చేసి, అటు హీరోకి ఇటు నిర్మాతకు లాభాల వర్షం కురిపించింది. రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad), అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), కమలహాసన్(Kamal Hassan)లాంటి భారీ తారాగణం ఇందులో భాగమయ్యారు. పైగా ఈ సినిమాలో బుజ్జి వెహికల్.. దానికి మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) వాయిస్ ఓవర్ రెండూ కూడా బాగా కలిసి వచ్చాయి అని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా ఈ సినిమా క్లైమాక్స్ లో.. సీక్వెల్ కి అద్భుతమైన లీడ్ ఇచ్చి అంచనాలు పెంచేశారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. దీంతో దీన్ని ఎలా మొదలు పెడతారు? ఏ విధంగా ముగింపు పలుకుతారు ? అని తెలుసుకోవడానికి ఆడియన్స్ కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఈ సీక్వెల్ పై ఊహించని క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా కల్కి 2898AD సినిమాను కర్ణుడి పాత్ర పై ముగించారు దర్శకుడు నాగ్ అశ్విన్. రాబోతున్న సీక్వెల్ లో కూడా కర్ణుడి పాత్ర ప్రాముఖ్యంగానే ఉంటుందని.. అందుకే ఈ సీక్వెల్ కి ‘కర్ణ 3102 బీసీ’ అని అనుకుంటున్నట్లు సమాచారం.
మొదట కల్కి 2898ఏడి సినిమాలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ మహాభారతంలోని కర్ణుడే ఇక్కడ బైరవగా జన్మించినట్లు చూపించారు. రెండవ భాగంలో కర్ణుడి పాత్ర ఏంటి? అనేది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారిన అంశం. ఇందులో సుప్రీమ్ యాస్కిన్ అత్యంత శక్తివంతుడిగా మారాడు. అటు కర్ణుడు , అశ్వత్థామ ఏకం అయ్యారు. కాబట్టి యుద్ధం అనివార్యం.. మరి అది ఎలా ఉంటుందో? నాగ్ అశ్విన్ దానిని ఎలా తీస్తారో ? అనేది తెలియాల్సి ఉంది
ఇదిలా ఉండగా కల్కి 2898ఏడి సినిమాలో సుమతీ పాత్రలో దీపికా పదుకొనే చాలా అద్భుతంగా నటించింది . సీక్వెల్లో కూడా ఈమె నటిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆమె పాత్రను సినిమా నుండి తొలగిస్తున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది కూడా.. దీనికి కారణం ఈమె అత్యధిక రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడమే కాకుండా పనిగంటలను కేవలం ఏడు గంటలకు మాత్రమే తగ్గించమని కోరడంతోనే.. ఇది వర్కౌట్ కాదని నిర్మాతలు ఈమెను సినిమా నుంచి తప్పించారు.
దీపికా పదుకొనేను సినిమా నుండి తప్పించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయడంతో.. అప్పటినుంచి ఈ పాత్రలో ఎవరు నటిస్తారు? అంటూ పలువురు హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే అనుష్క, నయనతార, అలియా భట్, కీర్తి సురేష్ పేర్లు వినిపించగా.. ఇప్పుడు కాంతార చాప్టర్ వన్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న రుక్మిణి వసంత్ కి కూడా అవకాశం వరించనుంది అని ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎవరిని తీసుకోబోతున్నారో తెలియాలి అంటే చిత్ర బృందం స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే.
ALSO READ : Bigg Boss 9 Promo: ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న తనూజ.. అసలు ఊహించలేదుగా?