Mount Everest: ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంపై మంచు తుపాను బీభత్సం సృష్టించింది. వేల అడుగుల ఎత్తులో పర్వతారోహకులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. శుక్రవారం నుంచి టిబెట్‌లో ఎవరెస్ట్ శిఖరం తూర్పు వైపు దట్టంగా మంచు కురుస్తోంది. ఆదివారం నాటికి తీవ్రరూపం దాల్చి మంచు తుపానుగా మారింది.
ఎవరెస్టుపై ప్రకృతి కన్నెర్ర
దాదాపు 1000 మంది తమతమ క్యాంప్‌ల వద్ద చిక్కుకు పోయారు. ఇప్పటివరకు 350 మందిని రక్షించారు. సమీపంలోని క్యుడాంగ్ టౌన్‌కు తరలించారు. ఎవరెస్ట్‌పైకి వెళ్లే మార్గాల్లో మంచు చరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా రహదారులు మూసుకు పోయాయి. వాటిని తొలగించేందుకు వందలాది మంది స్థానికులు-సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి.
చిక్కుకుపోయిన వ్యక్తులు 16 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నట్లు చైనా వార్తా ఏజెన్సీ తెలిపింది. అక్కడ తీవ్రమైన చలి, తక్కువ ఆక్సిజన్ ఉంటుందని వెల్లడించింది. ఇలాంటి సమయంలో మంచు తుపాను పర్వతారోహకులకు ఇబ్బందులు తప్పవని తెలిపింది.
చిక్కుకున్న 1000 మంది పర్వాతారోహకులు
ఎవరెస్ట్ శిఖరం వెళ్లేదారిలో కాంగ్‌షంగ్ ముఖానికి దారితీసే మారుమూల ప్రాంతం కర్మ లోయ. అది 13,800 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడ వాతావరణం ఊహించని విధంగా ఉంటుందని అంతర్జాతీయ వార్తా ఏజెన్సీలు చెబుతున్నాయి. తడిగా, చల్లగా మారిందని దీని కారణంగా పర్వతారోహకులకు తీవ్రమైన ప్రమాదంగా మారిందని తెలిపాయి.
ఈ సీజన్‌లో ఎవరెస్టు వెళ్లేవారి సంఖ్య అమాంతంగా రెట్టింపు అయ్యింది. చైనాలో ఎనిమిది రోజుల జాతీయ సెలవు దినం కావడంతో సందర్శకుల సంఖ్య అమాంతంగా పెరిగింది. ఈ సీజన్‌లో ఏటా వందలాది మంది ట్రెక్కర్లు ఎవరెస్ట్ శిఖరం సందర్శించేందుకు వెళ్తారు. అక్టోబర్ నెల ఎవరెస్టు సాహస యాత్ర మంచి సీజన్ కూడా.
ALSO READ: రెండువారాల్లో గ్రోకీపీడియా, మస్క్ సంచలన ప్రకటన
ఈ సమయంలో ప్రతీ ఏటా వేలాది మంది టూరిస్టులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్, పరిసర ప్రాంతాలను సందర్శిస్తారు. చాలా మంది పర్యాటకులు ప్రస్తుత పరిస్థితులను భయంకరమైన రాత్రిగా అభివర్ణించారు. కుడాంగ్ ప్రాంతానికి చేరుకున్న పర్వాతారోహకులు-టూరిస్టులు చేరుకున్న తర్వాత గ్రామస్తులు వారికి ఆహారం అందించారు.
తుఫాను నుండి బయటపడినందుకు ఉపశమనం కలిగించారని స్కై న్యూస్ తెలిపింది. శనివారం చివరి నుండి ఎవరెస్ట్‌కి వెళ్లేవారికి కోసం సీనిక్ ప్రాంతంతో టిక్కెట్ల అమ్మకాలు, ప్రవేశాన్ని నిలిపివేసినట్లు స్థానిక టింగ్రి కౌంటీ టూరిజం కంపెనీ ప్రతినిధి తెలిపారు.
నేపాల్‌లో కొన్నిరోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా కొండ చరియలు విరిగిపడటం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటివల్ల కనీసం 47 మంది మరణించారు. ప్రధాన రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. డజన్ల కొద్దీ ప్రజలు ఇప్పటికీ కనిపించడం లేదు.