OTT Movie : లవ్ స్టోరీలు లేకుండా సినిమాలను ఊహించుకోలేము. ప్రతి సినిమాలో ఏదో ఒక లవ్ కాన్సెప్ట్ ఉంటుంది. దీనికి అంతగా ప్రధాన్యత ఇస్తుంటారు దర్శకులు. ఈ నేపథ్యంలో ఒక తమిళ ఇంటెన్స్ రొమాన్స్ స్టోరీని ఆడియన్స్ బాగానే ఆదరించారు. ఈ కథలో హీరోకి కోపం ఎక్కువగా ఉండటంతో అసలు సమస్య మొదలవుతుంది. దీని వల్ల అతని ప్రేమ కూడా సమస్యల్లో చిక్కుకుంటుంది. చివరికి ఇతని ప్రేమకథ ఏమవుతుందనేదే ఈ స్టోరీ. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘ఇస్పాడే రాజవుం ఇధయ రానియం’ 2019లో విడుదలైన తమిళ రొమాంటిక్ డ్రామా మూవీ. రంజిత్ జెయకొడి దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో గౌతమ్ (హరీష్ కల్యాణ్), తారా (శిల్పా మంజునాథ్) ప్రధాన పాత్రల్లో నటించారు. 2019 మార్చి 15,న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. 2 గంటల 23 నిమిషాల నిడివితో, IMDbలో 6.4/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం జియో హాట్ స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌లో ఉంది.
గౌతమ్ అనే యువకుడు, అతని చిన్నప్పటి నుంచి కోపం వల్ల జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటాడు. కానీ అతనికి ఎంత కోపం ఉంటుందో, ప్రేమలో పడితే ఎంత ఇంటెన్స్‌గా ఉంటాడో కూడా చూపిస్తాడు. మరో వైపు తారా ఒక ప్రాక్టికల్ అమ్మాయి, జీవితంలో సెటిల్ అవ్వాలని కోరుకుంటుంది. ఇప్పుడ వీళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. గౌతమ్ తారాను చాలా డీప్‌గా లవ్ చేస్తాడు, కానీ అతని కోపం వల్ల చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి. తారా గౌతమ్ కోపానికి బాధపడుతుంది, కానీ అతన్ని వదులుకోలేక పోతుంది. వాళ్ల ప్రేమ చాలా ఇంటెన్స్, ఎమోషనల్‌గా సాగుతుంది.
రాను రాను గౌతమ్ కోపం కారణంగా, వాళ్ల మధ్య గొడవలు పెరుగుతాయి. తారా గౌతమ్ మారాలని, అతని అంగర్ మేనేజ్ చేయాలని అడుగుతుంది. గౌతమ్ ట్రై చేస్తాడు, కానీ అతని కోపం కంట్రోల్ అవ్వదు. వాళ్లు ఒకరినొకరు లవ్ చేస్తూ, సమస్యలు ఫేస్ చేస్తారు. గౌతమ్ తారా కోసం మారాలని ప్రయత్నించినా, కాలం వాళ్లను పరీక్ష పెడుతుంది. గౌతమ్ అంగర్ వల్ల మరిన్ని గొడవలు వస్తాయి. ఇక తారా గౌతమ్‌ను వదులుకోవాలా, అతన్ని మార్చాలా అనే గందరగోళంలో పడుతుంది. చివరికి గౌతమ్ మారతాడా ? తారా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ? వీళ్ళ లవ్ స్టోరీకి శుభం కార్డ్ పడుతుందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : దెయ్యంతో పాస్టర్ దిక్కుమాలిన పని… చేతబడి చేస్తూ అమ్మాయితో ఘోరంగా… ఇంత కరువులో ఉన్నాడేంటి మావా ?