Shoaib Akhtar: ప్రస్తుత పరిస్థితులలో పాకిస్తాన్ పురుషుల జట్టు పరిస్థితి అత్యంత దారుణంగా తయారైన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో కూడా టీమిండియాలో చిత్తుగా ఓడిపోయింది పాకిస్తాన్. అయితే ఇలాంటి నేపథ్యంలో పురుషుల పాకిస్తాన్ జట్టును ఉద్దేశించి ఆ దేశానికి సంబంధించిన మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మా మహిళల పాకిస్తాన్ జట్టు చేతిలో కూడా పురుషుల జట్టు దారుణంగా ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయని సొంత క్రికెట్ జట్టు పైన హాట్ కామెంట్స్ చేశారు. ఏ ఒక్కడు సరిగ్గా ఆడడం లేదని, టీమిండియా చేతిలో వరుసగా మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయారని మండిపడ్డాడు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ పురుషుల జట్టును కాపాడడం ఎవరి వల్ల కాదని తేల్చి చెప్పారు షోయబ్ అక్తర్. దీంతో ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
2025 సంవత్సరం పాకిస్తాన్ జట్టుకు ఏమాత్రం కలిసి రాలేదని తెలుస్తోంది. పాకిస్తాన్ మొన్న ఇండియా చేతిలో యుద్ధం ఓడిపోవడం కాకుండా, ఐసీసీ టోర్నమెంటులో కూడా భారత చేతిలో ఓడిపోతోంది. గడిచిన 21 రోజుల్లోనే ఏకంగా నాలుగు ఓటములు చవిచూసింది పాకిస్తాన్. ఇందులో పురుషుల పాకిస్తాన్ జట్టు ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో వరుసగా మూడు మ్యాచ్ లలో టీమిండియా చేతిలో ఓడిపోయింది. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ గ్రూప్ స్టేజ్ లో 7 వికెట్లతో టీమిండియా గెలిచింది. అనంతరం సూపర్ ఫోర్ లో కూడా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. అప్పుడు కూడా ఆరు వికెట్ల తేడాతో ఇండియానే గెలిచింది. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో కూడా టీమిండియా చేతిలో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయింది. ఇటు నిన్న మహిళల వన్డే వరల్డ్ కప్ లో కూడా టీమిండియా చేతిలో 88 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఓడిపోయింది. ఇలా వరుసగా 21 రోజుల్లోనే నాలుగు ఓటమిలో చవిచూసింది పాకిస్తాన్.
పాకిస్తాన్ పురుషుల జట్టు వరుసగా వైఫల్యాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాళ్లను దారుణంగా ఇన్సల్ట్ చేశాడు ఆ జట్టుకు సంబంధించిన మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. మా పురుషుల పాకిస్తాన్ జట్టు అత్యంత కఠినమైన పరిస్థితిలో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇలాగే పరిస్థితి కొనసాగితే, ఆ జట్టును కాపాడేవాడు ఉండబోడని వెల్లడించారు. ప్రస్తుతమైతే పురుషుల జట్టు మహిళల పాకిస్తాన్ జట్టు చేతిలో ఓడిపోవడం పక్క అంటూ బాంబు పేల్చారు.
Shoaib Akhtar 😂😂#INDvPAK #INDvsPAK #INDWvPAKW #INDWvsPAKW #WomensWorldCup #WomensWorldCup2025 #CWC2025 #CWC25 pic.twitter.com/Ni4vt5OXxB
— Saabir Zafar (@Saabir_Saabu01) October 5, 2025