Bigg Boss 9 Telugu: తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఆసక్తి కనబరుస్తున్నా టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9 4 వారం ఇటీవలే పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన బిగ్ బాస్ 9 తెలుగు 15 మంది కంటెస్టెంట్స్‌తో లాంచ్ కాగా వారిలో ఇప్పటికీ ముగ్గురు ఎలిమిట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేసారు.. ఇక నాలుగో వారంకి మాస్క్ మాన్ హరీష్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాడు. కామన్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన ఈయన తన ఆటిట్యూడ్ తో బాగానే మూడు వారాలు రాణించాడు. నాలుగో వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఈయన నాలుగు వారాలకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. మరి ఆయన ఎన్ని లక్షలు తీసుకున్నాడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
కామన్ మాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మాస్క్ మాన్ హరీష్ హరిత దాదాపు హౌస్ లో తన ఆట తీరుతో నాలుగు వారాలు రాణించాడు. ఈయనకున్న యాటిట్యూడ్ వల్ల మొదటి వారమే హౌస్ లోంచి బయటకు వస్తారని అందరూ అనుకున్నారు. కానీ నాలుగు వారాల వరకు హౌస్ లో రాణించాడు. నాలుగో వారం హౌస్ నుంచి బయటికి వచ్చేసాడు. సెలబ్రిటీలకు రెమ్యూనరేషన్ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే.. అయితే ఈసారి బిగ్ బాస్ లో కామనర్స్ కు కూడా ఎక్కువగానే పారితోషికం అందినట్లు తెలుస్తుంది. గత వారం హౌస్ నుంచి బయటకు వచ్చిన మాస్క్ మ్యాన్ వారానికి రూ. 60 వేల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం.. నాలుగు వారాల పాటు హౌజ్‌లో ఉన్న హరీష్ 28 రోజుల్లో రూ. 2 లక్షల 40 వేల వరకు డబ్బు సంపాదించినట్లు తెలుస్తోంది..
Also Read : అవని పై అక్షయ్ సీరియస్.. పల్లవి, చక్రధర్ ప్లాన్ సక్సెస్.. పల్లవి ఇరుక్కుంటుందా..?
బిగ్ బాస్ సీజన్ 9 లో ఇప్పటివరకు నాలుగు వారాలు పూర్తయ్యాయి.. మొదటివారం శ్రేష్ట వర్మ హౌస్ నుంచి బయటకు వెళ్ళింది. ఈమె సెలబ్రిటీ కావడంతో బాగానే రెమ్యూనరేషన్ ని అందుకుంది. సెకండ్ వీక్ మనీష్ మర్యాద, మూడో వారం ప్రియా శెట్టి వరుసగా ఎలిమినేట్ అయ్యారు. దాంతో 12 మంది హౌస్ లో ఉన్నారు. ప్రియా ఎలిమినేట్ కాకముందే రాయల్ కార్డ్ ఎంట్రీగా దివ్య నిఖితా ఎంట్రీ ఇచ్చింది.. ఇక నాలుగో వారం హౌస్ నుంచి మాస్క్ మాన్ అలియాస్ హరీష్ హరిత ఎలిమినేట్ అయ్యారు. మరి ఈ వారం నామినేషన్స్ ఇవాల్టి నుంచి మొదలు కాబోతున్నాయి.. చూస్తుంటే అందరూ టఫ్ కంటెస్టెంట్లు కావడంతో ఈవారం వాడీ వేడిగా నామినేషన్స్ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఈ వారం ఎవరు బయటకు వెళ్తారో చూడాలి.. ఇప్పటికే సంజన రెండుసార్లు నామినేషన్ కి సెలెక్ట్ అయ్యి జస్ట్ మిస్ అయ్యి హౌస్ లో కొనసాగుతుంది. మరి ఈ వారం ఈమె వెళ్తుందా? ఇక వేరొకరు వెళ్తారా అన్నది తెలియాలంటే ఈవారం బిగ్బాస్ ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..