Nindu Noorella Saavasam Serial Today Episode: రామ్మూర్తి ఇంటికి వెళ్లిన మిస్సమ్మ ఆరు తన అక్క గురించి అడుగుతుంది రామ్మూర్తిని మౌనంగా ఉంటే మీకు దండం పెడతాను నాన్న ఒక్కసారి అక్క గురించి చెప్పండి కనీసం అక్క ఎలా ఉంటుందో చెప్పు నాన్న.. నేను అక్కను చూడాలి నాన్న తనతో మాట్లాడాలి ఎన్నో విషయాలు ఎప్పటి నుంచో చూడాలి అనిపిస్తుంది అంటూ ఎమోషనల్ అవుతూ గోడకు రామ్మూర్తి తగిలించిన ఫోటో చూస్తుంది. ఫోటో చూసిన మిస్సమ్మ షాక్ అవుతుంది. మిస్సమ్మ ఫోటో చూడటం చూసిన రామ్మూర్తి షాక్ అవుతాడు.
వెంటనే మిస్సమ్మ షాకింగ్ గా నాన్న ఆరు ఫోటోను చూపిస్తూ.. అక్కనా..? అంటూ ఫోటో తీసుకుని చూస్తూ.. అక్కా అంటూ ఎమోషనల్ అవుతుంది. ఫోటోను గుండెలకు హత్తుకుని ఏడుస్తుంది. ఇంతలో అక్కడికి అమర్ వచ్చి చూస్తాడు. మరోవైపు గార్డెన్‌లో ఉన్న ఆరుకు ఏమో అయినట్టు అనిపిస్తుంది. అది గమనించిన గుప్త ఏమిటి బాలిక ఒళ్లు జలదరించినట్టు ఉన్నదా..? అని అడుగుతాడు. ఆరు అవును గుప్త గారు ఎందుకు అలా అని అడుగుతుంది. ఎందులకు అనగా.. నీ సహోదరికి నిజం తెలిసింది. అని చెప్పగానే ఆరు ఏ నిజం అని అడుగుతుంది. నీవే తన సహోదరివి అని అంటూ గుప్త చెప్పగానే.. ఆరు షాక్ అవుతుంది. ఇంకోవైపు అమర్ ఇంట్లోకి వెళ్లగానే.. మిస్సమ్మ ఫోటో చూపిస్తూ.. మ అక్కండి.. నా తోడబుట్టిన సొంత అక్క అని చెప్తుంది.
ఇంతలో రామ్మూర్తి అల్లుడి గారికి తెలుసమ్మా అంటాడు. మరోవైపు ఆరు బాధగా నిజం తెలిసిందా..? అని అడుగుతుంది. దీంతో గుప్త నీవు మా లోకమునకు వచ్చు సమయం ఆసనం అయినది కదా బాలిక ఆ లోపుగా అన్ని నిజములు తెలియవలెను కదా..? అంటాడు. ఇంకోవైపు మిస్సమ్మ ఏడుస్తూ అంటే మీకు నిజం తెలిసినా ఇన్నాళ్లు నా దగ్గర దాచారా..? అని అడుగుతుంది. దీంతో రామ్మూర్తి నిజం తెలిస్తే నువ్వు బాధపడతావని అల్లుడుగారు నీకు నిజం చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నారమ్మా అంటాడు. ఇంకోవైపు ఆరు బాధగా ఇప్పుడు నా చెల్లెలు పరిస్థితి ఏంటి గుప్తగారు.. ఇప్పుడు తను ఎంత బాధపడుతుందో.. అంటూ ఆరు బాధపడుతుంది. మరి శోకము తప్పదు కదా బాలిక అంటాడు గుప్త. ఇంకోవైపు అమర్ వార్డెన్ గారి దగ్గరకు వెళ్లి ఎంక్వైరీ చేశావని తెలియగానే.. ఇక్కడికి వచ్చుంటావని ఊహించాను అంటాడు అమర్. నాతో మా అక్క గురించి ఎందుకు చెప్పలేదండి అంటూ మిస్సమ్మ ఏడుస్తుంది. ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం పద అంటూ అమర్ చెప్పగానే.. మిస్సమ్మ ఏడుస్తూనే ఉంటుంది. మరోవైపు ఆరు కూడా ఏడుస్తుంది.
రాత్రి అయ్యాక కూడా అమర్, మిస్సమ్మ ఇంటికి రాకపోవడంతో అంజు ఆలోచిస్తుంది. డాడీ మిస్సమ్మ ఇంకా ఎందుకు ఇంటికి రాలేదు అని అనుకుంటుండగా పై నుంచి మనోహరి వస్తుంది. ఆంటీకి తెలుసేమో కనుక్కుంటాను అనుకుని మనోహరి దగ్గరకు వెళ్లి ఆంటీ డాడీ మిస్సమ్మ ఎక్కడికి వెళ్లారు..? ఎప్పుడు వస్తారు..? అని అడుగుతుంది. నాకు తెలియదు అని చెప్తుంది మనోహరి. దీంతో అంజు అదేంటి ఆంటీ మీకు తెలియకుండా వెళ్తారా..? అంటుంది. దీంతో మనోహరి కోపంగా వాళ్లేమైనా నాకు చెప్పి వెళ్తారా..? అయినా అన్ని సార్లు నన్ను ఆంటీ ఆంటీ అని పిలవకు నాకు వయసైపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది అనగానే.. పోనీ అమ్మా అని పిలవనా..? అని అంజు అనగానే.. మనోహరి షాకింగ్ గా అమ్మనా..? అని అడుగుతుంది. అవును మీరు నాకు బ్లడ్ ఇచ్చి కాపాడారు కదా నాకు రీ బర్తు ఇచ్చారు అంటే మీరు నాకు అమ్మే కదా అంటుంది.
దీంతో నేను నీకు పునర్జన్మను ఇచ్చాను అంతకు ముందు ఒక బిడ్డకు జన్మనిచ్చాను. అది ఇప్పుడు ఎక్కడుందో ఎలా తెలియదు.. అని మనసులో అనుకుంటూ తన గతం గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంది మనోహరి. దీంతో అంజు ఆంటీ… అంటూ గట్టిగా పిలుస్తుంది. దీంతో మను కోపంగా ఏంటి..? ఆంటీ అని పిలవొద్దని ఎన్ని సార్లు చెప్పాలి నీకు అంటుంది. దీంతో అంజు అంటీ అంటే ఫీలవుతున్నారు అమ్మా అని పిలుస్తానంటే ఆలోచిస్తున్నారు మను అని పిలవనా..? అనగానే.. మనునా..? అని మనోహరి అడగ్గానే.. అవును మా అమ్మ మిమ్మల్ని అలాగే పిలిచేది అంట కదా అనగానే.. వద్దు అంటుంది మనోహరి. ఎందుకు నేను అలా పిలిస్తే మీకు మా అమ్మ గుర్తుకు వస్తుందా..? అని అడగ్గానే మనోహరి కోపంగా నాకు కాస్త హెడేక్ గా ఉంది. నన్ను విసిగించకు అనగానే సరే అంటూ అంజు వెళ్లిపోతుంది.
మరోవైపు రామ్మూర్తి ఇంటి బయట నిలబడిన మిస్సమ్మతో ఆరు వచ్చి మాట్లాడుతుంది. రామ్మూర్తి బయటకు వచ్చి చూసి మిస్సమ్మ మాట్లాడటం గమనించి ఆరు వచ్చిందా అన్నట్టు సైగ చేస్తాడు. అవును అన్నట్టు మిస్సమ్మ తలూపుతుంది. దీంతో రామ్మూర్తి ఎమోషనల్ గా దగ్గరకు రాగానే.. ఆరు రామ్మూర్తిని హగ్ చేసుకుంటుంది. రామ్మూర్తి తన్మయత్వంతో పులకించిపోతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.