Intinti Ramayanam Today Episode October 6th : నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి అక్షయ్ భరత్ ని ఎంతగా కొడుతున్నా సరే నిజం చెప్పద్దని చెప్తుంది. చక్రధర్ చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భరత్ ఆ విషయాన్ని నిజం చెప్పడు. మా తమ్ముడిని దొంగ అంటే నేను అసలు ఒప్పుకోను అని అవని అంటుంది. నా తమ్ముడు డబ్బులు తీసాడని ఏంటి సాక్ష్యం అని అవని అంటుంది. ఇలాంటి బికారి గాడికి నా చెల్లెల్ని ఇవ్వద్దన్న సరే నువ్వు ఇచ్చావు రూపాయి కూడా గతి లేని వీడికి 50 లక్షలు ఎలా వచ్చాయి వీడే దొంగతనం చేసి ఉంటాడు అని అక్షయ్ అంటాడు. రాజేంద్రప్రసాద్ పార్వతి కూడా అవని నీకు ఏదో ఒక జాబ్ చూపిస్తానన్నా కూడా వద్దని అన్నావు. ఒకవేళ డబ్బులు కావాలని అడిగితే అక్షయ్ లాగే నీకు కూడా డబ్బులు ఇచ్చి ఏదో ఒకటి పెట్టించే వాళ్ళం కదా అని అంటారు.. అవనిని అందరు అంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని, రాజేంద్ర ప్రసాద్, పార్వతి మాట్లాడుకోవడం విన్న అక్షయ్ ఈ డబ్బులు గురించి తేలాలంటే కచ్చితంగా పోలీసులు రావాల్సిందే అని అక్షయ్ అంటాడు. కానీ అవని పోలీసులను పిలిపిస్తే ప్రణతి జీవితం ఏమవుతుందో తెలుసా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది. నిజంగానే ఆ డబ్బులు భరత్ తీశాడా లేదా ఎవరైనా భరత్ ని ఇరికించాడా అని ఆలోచిస్తారు. అక్షయ మాత్రం కచ్చితంగా నేను పోలీసులను పిలుచుకొని వస్తాను అసలు దొంగ ఎవరో వాళ్ళే తేలుస్తారు అని అంటాడు.
రాజేంద్రప్రసాద్ పోలీసులను ఏమీ వద్దు కానీ మనమే మరోసారి భరత్ ని అడుగుదాము అని అంటాడు. పోలీసులను తీసుకొని వస్తే వాడి జీవితం ఏమవుతుంది అని అవని అంటుంది. డబ్బులను తీసుకొని దాచుకోవడం మాత్రం బాగుంది అని మీ తమ్ముడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అని అక్షయ్ అంటాడు. ఇక అవని మరోసారి భరత్ ని పిలిచి ఆ డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పురా అని బ్రతిమలాడుతుంది.
వాళ్ళ ప్లాను గ్రాండ్ సక్సెస్ అయినన్నీ తన తండ్రితో పంచుకొని ఇద్దరు సంతోషంగా ఉంటారు. నీ కళ్ళల్లో ఈ సంతోషిని చూడడానికి నేను ఏమైనా చేస్తాను తల్లి అని చక్రధర్ అంటాడు. థాంక్యూ డాడీ అని పల్లవి అంటుంది. మనము ఇక్కడే ఉంటే ఇంట్లో ఏం జరుగుతుందో తెలియలేదు కదా అక్కడే ఉండాలి నేను వెళ్తున్నాను డాడ్ అని పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రణతి బాధపడుతూ ఉంటుంది. పెళ్ళాన్ని అయినా నాకు కూడా నువ్వు ఈ నిజం చెప్పట్లేదంటే అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని అడుగుతుంది.
ఆ డబ్బులు నావే నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చాను బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యాక నేను కచ్చితంగా నీకే ఆ విషయాన్ని ముందు చెప్తాను అని ప్రణతి తో భరత్ అంటారు. అయితే అక్షయ్ ఆ డబ్బులు భరత్ తీశాడని బాధపడుతూ ఉంటాడు. రాజేంద్రప్రసాద్ ఇంకా డబ్బులు గురించి ఆలోచిస్తున్నావారా అని అంటాడు. మీరు ఆగండి నాన్న ఈ విషయం నేను ఎలాగైనా తేల్చుకుంటాను అని అక్షయ్ అంటాడు. అక్షయ్ భరత్ ని పిలుస్తాడు. ఆ డబ్బులు నీకు ఎవరు ఇచ్చారు చెప్పు అని అనుకుంటాగా అందరూ అడుగుతున్న సరే భరత్ మాత్రం చెప్పడు..
ఆ డబ్బు నీకు ఎవరు ఇచ్చారో చెప్పకపోతే కచ్చితంగా నువ్వే దొంగతనం చేసావని అనుకోవాల్సి వస్తుంది. నువ్వు ఆ డబ్బులు ఎవరిచ్చారు రహస్యంగా ఉంచాలనుకుంటున్నావు నిజంగానే నిన్ను అనుమానించాల్సి వస్తుంది అని భరత్ ని అందరు అడుగుతారు. ఆ డబ్బులు నాకు ఎవరు ఇచ్చింది చెప్పకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నేను చెప్పగలిగేది ఒకే ఒక్క మాట దయచేసి ఇది నమ్మండి అది నా డబ్బు అని భరత్ అంటాడు. నువ్వు నిజం చెప్పవని నాకు అర్థం అయిపోయింది పోలీసులే నీ చేత నిజం చెప్పిస్తారు అని అంటాడు అక్షయ్.
అవని ఆగండి నేను అడుగుతాను అని అంటుంది. ఆ డబ్బులు నీకు ఎవరు ఇచ్చారు నిజం చెప్పరా నీ కాళ్లు పట్టుకుంటాను అని భరత్ ని అవని బ్రతిమలాడుతూ అడుగుతుంది. ప్రణతి ఆ డబ్బులు ఇవ్వచ్చారో ఇప్పటికైనా చెప్పు భరత్ ఇంత మంది అడుగుతున్నారు కదా నువ్వెందుకు ఇలా మొండికేస్తున్నావు అని అంటుంది. నువ్వు చెప్పకపోతే నేను అందరూ దొంగని అంటారు ఇప్పటికైనా చెప్పు భరత్ అని ప్రణతి బ్రతిమలాడుతుంది. నువ్వు నిజం చెప్తావా నన్ను ఏదైనా చేసుకొని చచ్చిపొమ్మంటావా అని ప్రణతి భరత్ నీ అడుగుతుంది.
ప్రణతి కోసం నిజం చెప్తానని భరత్ అంటాడు. ఆ డబ్బులు నాకు ఇచ్చింది ఎవరంటే అని భరత్ అంటాడు. ఇప్పుడే ఒక వ్యక్తి భరత్ అంటూ లోపలికి వస్తాడు. భరత్ ఎక్కడ నిజం చెప్తాడని పల్లవి టెన్షన్ పడిపోతుంది. నువ్వు నాకు తెలియకపోయినా ఈ ఫ్యామిలీ మంచిదని నమ్మి నీకు 50 లక్షలు ఇచ్చాను. నా ఎంక్వయిరీ లో నీకు ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేదని తెలిసింది అని ఆ వ్యక్తి అంటాడు. ఇదిగో నువ్వు సంతకాలు చేసిన పేపర్స్.. నాకు నా డబ్బులు నాకు ఇచ్చేసేయ్ అని ఆ వ్యక్తి అంటాడు. ఆ మాట వినగానే భరత్ షాక్ అవుతాడు.
Also Read : శ్రీవల్లితో డ్యాన్స్ చేయించిన ప్రేమ.. ధీరజ్ కు ప్రేమ షాక్.. భాగ్యం మరో ప్లాన్..
డబ్బులు మర్యాదగా ఇవ్వకపోతే మా పద్ధతిలో మేము వసూలు చేస్తామని ఆ వ్యక్తి బెదిరిస్తాడు. ఒక నిమిషం అని భరత్ లోపలికి వెళ్లి ఆ డబ్బులు తీసుకొచ్చి అతనికి ఇస్తాడు. భరత్ నేను దొంగతనం చేశాను అని అన్నారు. బావగారు డబ్బులు నేనే కాజేసానని అందరు నన్ను దొంగ అన్నారు. ఈ సంతకాలు చేసి ఆ డబ్బులు తీసుకున్నానన్న విషయం మీకు ఇప్పటికైనా అర్థమైందా అని భరత్ అంటాడు. కమల్ అవని కోసం ఇల్లంతా వెతికాను అని అంటాడు. ఎందుకు వదిన నువ్వు ఆలోచిస్తున్నావు అని అంటాడు. భరత్ వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చాడని తెలిసిపోయింది కదా అని అవని అంటుంది.. రేపటి ఎపిసోడ్లో అవనిని రాజేశ్వరి ఇంటికి పిలుస్తుంది. చక్రధర్ అప్పుడే ఇంటికి వస్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..