Hyderabad News: వీకెండ్ వచ్చిందంటే చాలు సిటీ యువతకు పండగే. ఉద్యోగాలు, చదువులతో కుస్తీ పట్టినవాళ్లు.. రిలీఫ్ కోసం ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడం అప్పుడప్పుడు చూస్తుంటారు. ఈ క్రమంలో లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.
బీఎండబ్ల్యూ కారు బీభత్సం
వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అంటూ పదేపదే హెచ్చరిస్తున్నన్నారు ట్రాఫిక్ పోలీసులు. అంతేకాదు సిగ్నల్ వద్ద మైక్ ద్వారా చెప్పిస్తున్నారు. అయినా కొందరు యువకులు మొద్దు నిద్ర వీడడం లేదు. ఫలితంగా ప్రమాదాలకు చాలామంది గురవుతున్నారు. తాజాగా అలాంటి ఘటన హైదరాబాద్ సిటీలో నార్సింగ్ ఏరియాలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ సిటీలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతమైన నార్సింగి ఏరియాలో ఓ బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. మై హోమ్ అవతార్ సిగ్నల్ పాయింట్ వద్ద ఆగి ఉన్న రెండు కార్లు, ఒక బైక్‌ను అతివేగంగా వచ్చింది ఢీ కొట్టింది. టూ వీలర్‌పై ఉన్న ఓ మహిళ గాల్లోకి ఎగిరి కిందపడింది. ఈ ఘటనలో ఆ మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి.
హాలీవుడ్ మూవీ యాక్షన్ సీన్స్ తరహాలో
బీఎండబ్ల్యూ కారు ఢీకొని ఘటనలో ఆ టూ వీలర్, ఓ కారు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటన సమయంలో కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. స్నేహితులతో కలిసి అభిషేక్ అనే వ్యక్తి అతివేగంగా కారు నడపినట్లు సమాచారం. అభిషేక్ ను అదుపులోకి తీసుకున్నారు. కారు ఓనర్ నితిన్‌గా గుర్తించారు.
వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని విచారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. గాల్లోకి ఎగిరిపడిన మహిళ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ఆ దృశ్యాలు చూసిన నెటిజన్స్ షాకవుతున్నారు.
ALSO READ: మెయినాబాద్‌లో ట్రాప్ హౌస్ పార్టీ, బుక్కైన 50 మంది మైనర్లు
అంత వేగంగా కారు నడపడం అవసరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ సిటీలో ఈ తరహా ఘటనలు చాలానే జరుగుతున్నాయి. ఆ మధ్య కేబీఆర్ సమీపంలో ఇలాంటి ఘటన జరిగింది. వేకువజామున ఓ యువకుడు డివైడర్‌ని ఢీ కొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత నిందితుడిపై కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే.
హైదరాబాద్‌లో బీఎండబ్ల్యూ కారు బీభత్సం.. సీసీ ఫుటేజ్
మై హోమ్ అవతార్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న రెండు కార్లు, ఒక బైక్‌ను అతివేగంగా ఢీకొట్టిన బీఎండబ్ల్యూ కారు
బైక్‌పై ఉన్న మహిళకు తీవ్ర గాయాలు కాగా, పూర్తిగా దెబ్బతిన్న రెండు కార్లు
ప్రమాదం అనంతరం ఘటనాస్థలి నుంచి పరారైన బీఎండబ్ల్యూ కారు… pic.twitter.com/xZ3hfJHnk9
— BIG TV Breaking News (@bigtvtelugu) October 6, 2025