Muneeba Run-Out: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య నిన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఏకంగా 88 పరుగుల తేడాతో పాకిస్తాన్ జట్టును చిత్తు చేసింది ఈ టీమిండియా. అయితే ఈ మ్యాచ్ గురించి పక్కకు పెడితే, చేజింగ్ సమయంలో పాకిస్తాన్ ప్లేయర్ మునిబా అవుట్ అయిన తీరుపై ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆమె వివాదాస్పద రన్ అవుట్ అయ్యారు. దీప్తి శర్మ చాలా తెలివిగా త్రో కొట్టడంతో, పాకిస్తాన్ ఓపెనర్ మునీబా అలీ ( Muneeba Ali ) పెవిలియన్ కు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆమె పెవిలియన్ కు వెళ్ళకముందే రంగంలోకి దిగిన పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా ( Fatima Sana ) అంపైరితో వాగ్వాదం కూడా పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య నిన్న జరిగిన మహిళల మ్యాచ్ లో పాకిస్తాన్ ఓపెనర్ మునీబా అలీ రనౌట్ వివాదంగా మారింది. ఈ మ్యాచ్ లో క్రాంతి బౌలింగ్ చేస్తున్న సమయంలో మునీబా అలీ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించారు. కానీ షాట్ ఆడే సమయంలో ఆమె టెంప్ట్ అయిపోయారు. దీంతో బంతి మిస్ అయింది. బ్యాటర్ మునీబా అలీ కాలుకు బంతి తాకి వెళ్ళింది. అదే సమయంలో మునీబా అలీ క్రీజు నుంచి బయటకు వెళ్ళింది. ఇది గమనించిన ఫీల్డర్ దీప్తి నేరుగా వికెట్లను గిరాటేసింది. మొదట నాటౌట్ గా ప్రకటించిన అంపైర్, రీప్లేలో మాత్రం మునీబా అలీ రన్ అవుట్ అంటూ వెల్లడించారు. దీంతో ఈ రన్ అవుట్ పై వివాదం రాజుకుంది.
ఔట్ అని ప్రకటించడంతో మునీబా అలీ పెవీలియన్ కు వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో బౌండరీ గేటు దగ్గరకు పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా వచ్చి రిఫరీతో గొడవ పెట్టుకున్నారు. అసలు అది ఎలా అవుట్ అవుతుంది? మేము రన్ కు ప్రయత్నించలేదు, కానీ రన్ అవుట్ అని ఇచ్చేశారు అని నిలదీసింది పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా. అయితే ఆ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు క్లియర్ గా రూల్స్ తెలియజేశారు రిఫరీలు. దీంతో వివాదం సద్దుమరిగింది. ఐసీసీ రూల్స్ ప్రకారం బంతి కీపర్ లేదా బౌలర్ ఎండులో ఉన్నప్పుడే, అనుమతితో బ్యాటర్ క్రీజు వీడాల్సి ఉంటుంది. అలా కాకుండా క్రీజు వదిలితే, మునీబా అలీకి జరిగిన సంఘటనే బ్యాటర్లందరికి ఎదురవుతుంది.
మ్యాచ్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ పేసర్ డయానా బేగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునీబా రనౌట్ కాదని మీరు అంటున్నారు? అసలు దీనిపై మీరెలా రియాక్ట్ అవుతారని ఓ రిపోర్టర్, డయానాను అడిగారు. అయితే దీనిపై పాకిస్తాన్ పేసర్ డయానా బేగ్ క్లారిటీ ఇచ్చారు. ఆ వివాదం గ్రౌండ్ లోనే సెటిల్ అయిపోయింది. ఇప్పుడు మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. అనవసర వివాదాలు మనకు అవసరం లేదు అని ఆమె క్లారిటీ ఇచ్చారు. దీంతో వివాదం అక్కడితో ముగిసింది.
An interpretation of 30.1.2 is why Muneeba Ali was given OUT. Her bat wasn't considered grounded as she wasn't running or diving towards her ground and beyond. https://t.co/Brr5r6mCrk pic.twitter.com/rmmgU4DsAN
— Vinayakk (@vinayakkm) October 5, 2025