BigTV English

Rukmini Vasanth: ఎన్టీఆర్- నీల్ సినిమాలో ఛాన్స్ పట్టేసిన బ్యూటీ.. ఎంత అందంగా ఉందిరా బాబు

Rukmini Vasanth: కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సప్త సాగరాలు దాటి  అనే సినిమాతో రుక్మిణి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.  సాధారణంగా తెలుగు ప్రేక్షకులు.. సినిమా ఏ భాషలో ఉన్నది అనేది పట్టించుకోరు. కథ నచ్చితే హిట్ చేసేయడమే.

అలా సప్త సాగరాలు దాటి డబ్బింగ్ సినిమాతో రుక్మిణి తెలుగువారికి పరిచయమైంది. న్యాచురల్ బ్యూటీగా  ఆ సినిమాలో కనిపించి తెలుగు కుర్రకారు గుండెల్లో గుడి కట్టేలా చేసుకుంది.

సాధారణంగా  అబ్బాయిలను గాడిద అని తిడితే  అసలు భరించరు. కానీ, ఈ చిన్నది ముద్దుగా గాడిద  అని తిట్టినా  అబ్బా ఎంత క్యూట్ గా ఉందిరా అని సిగ్గుపడిపోవడం మొదలుపెట్టారు.

సప్త సాగరాలు దాటి సినిమా  తరువాత రుక్మిణి తెలుగులో  మంచి సినిమాతో వస్తుందని ఫ్యాన్స్ అందరు ఎదురుచూస్తున్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ భామ భారీ ప్రాజెక్ట్ నే పట్టిందని టాక్ నడుస్తోంది.

దేవర తరువాత ఎన్టీఆర్.. ప్రశాంత్  నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమాలో రుక్మిణి హీరోయిన్  గా  ఎంపిక అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమాలను చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్న రుక్మిణి.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

తాజాగా రుక్మిణి చీరకట్టులో కనిపించి  కనువిందు చేసింది. ఆరెంజ్ కలర్ చీరపై గోల్డ్ కలర్ బ్లౌజ్.. కొప్పు నిండా పువ్వులు పెట్టుకొని అచ్చతెలుగు ఆడపడుచుల కనిపించింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోల కింద ఎన్టీఆర్ – నీల్ ప్రాజెక్ట్ లోకి స్వాగతం.. ఎన్టీఆర్ బ్యూటీ ఎంత అందంగా ఉందో అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో రుక్మిణి లైఫ్ ఎలా టర్న్ అవుతుందో చూడాలి.

Related News

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Big Stories

×