BigTV English
Advertisement

Bigg Boss 8 Telugu: ఆదిత్య ఓం పిచ్చి పని, అందరికీ బిగ్ బాస్ వార్నింగ్.. మొత్తానికి తప్పులు ఒప్పుకున్న విష్ణుప్రియా

Bigg Boss 8 Telugu: ఆదిత్య ఓం పిచ్చి పని, అందరికీ బిగ్ బాస్ వార్నింగ్.. మొత్తానికి తప్పులు ఒప్పుకున్న విష్ణుప్రియా

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8లో అయిదోవారం నామినేషన్స్‌లో ఎవరు ఎవరిని నామినేట్ చేయాలి అనే విషయాలను ముందే చర్చించుకున్నారు. కానీ గత వారం రోజుల నుండే ఈవారం నామినేషన్స్‌లో మణికంఠ పక్కా ఉంటాడు అనే ఫీలింగ్ ప్రేక్షకులకు వచ్చేసింది. తన ఆట బాగానే ఉందే అని ప్రేక్షకులు అనుకునేలోపే తాజాగా సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్‌లో మాటలు మార్చడం వల్ల ఆడియన్స్‌లో మాత్రమే కాదు.. కంటెస్టెంట్స్ దృష్టిలో కూడా తను టార్గెట్ అయ్యాడు. అంతే కాకుండా తన తర్వాత నైనికా, విష్ణుప్రియాకు నామినేషన్స్‌లో ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఆదిత్య ఓం చేసిన పనికి తనతో పాటు అందరూ బిగ్ బాస్ దగ్గర నుండి వార్నింగ్ తీసుకోవాల్సి వచ్చింది.


యాక్టివ్ లేదు

బిగ్ బాస్ 8లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్‌లో ఎక్కువగా ఎంటర్‌టైన్మెంట్ అందించేది విష్ణుప్రియానే అని చాలామంది ప్రేక్షకుల అభిప్రాయం. కానీ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కు మాత్రం తనపై వేరే అభిప్రాయం ఉంది. అనవసరంగా మాటలు అనేస్తుందని, మర్యాదగా మాట్లాడదు అని, నోటిదూల ఎక్కువ అని.. ఇలా విష్ణుప్రియా గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు హౌస్‌మేట్స్. అదే విషయంపై ఈవారం నామినేట్ చేశారు కూడా. పైగా టాస్కుల విషయంలో కూడా తను యాక్టివ్ లేదని, చీఫ్ అవ్వడంలో తను ఇంట్రెస్ట్ చూపించలేదనే పాయింట్‌‌ను కూడా నామినేషన్స్‌లో పెట్టారు. అందులో దాదాపు అన్నింటికీ విష్ణుప్రియా ఒప్పుకుంది.


Also Read: డబుల్ ఎలిమినేషన్.. మిడ్ వీక్ లో ఈ కంటెస్టెంట్ అవుట్?

నీకే నోటిదూల

తనను నామినేట్ చేసిన ఎవ్వరితోనూ విష్ణుప్రియా పెద్దగా వాదించలేదు. కానీ నిఖిల్‌తో మాత్రమే సీరియస్‌గా మాట్లాడింది. ‘‘నీకు, సోనియాకు తప్పా నా మాటలు ఎవ్వరికీ ఇబ్బంది కలిగించలేదు. నీకే చాలా నోటిదూల. నువ్వు నన్ను అంటున్నావా’’ అంటూ రివర్స్ అయ్యింది. ఇక నైనికాకు కూడా నామినేషన్స్‌లో చాలానే ఓట్లు పడ్డాయి. తను ముందు ఉన్నట్టుగా ఇప్పుడు లేదని, ఆటల విషయంలో యాక్టివ్‌గా ఉండడం లేదని, ఎక్కువగా ఆలోచిస్తుందని, ఇతర అమ్మాయిల మాటలపై ప్రభావితం అవుతుందని.. ఇలాంటి కారణాలు చెప్పి నైనికాను నామినేట్ చేశారు. తనను తాను సమర్ధించుకోవాలని చూసినా కూడా నైనికా వీక్ అయ్యిందనే విషయం ప్రేక్షకులు సైతం గ్రహించారు.

కోపం వచ్చింది

సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్‌లో మణికంఠ ఆడకుండా ఉండడానికి త్యాగం చేసి, తర్వాత తానే టీమ్ సభ్యులు అంతా కలిసి తనను తప్పించారని చెప్పి మాటలు మార్చాడు. ఇదే కారణం చెప్పి తనను కంటెస్టెంట్స్ నామినేట్ చేశారు. ఇక ఆదిత్య ఓంను కూడా ప్రేరణ, యష్మీ నామినేట్ చేశారు. ప్రేరణ నామినేట్ చేస్తున్నప్పుడు ఆదిత్యకు కాన్ఫిడెన్స్ లేదని కారణం చెప్పింది. దీంతో ఆదిత్యకు కోపం వచ్చి మంటల్లో కాలిపోతున్న తన ఫోటోను చేతితో తీసి కింద పడేశాడు. వెంటనే బిగ్ బాస్ నుండి వార్నింగ్ వచ్చింది. ఆదిత్య ఓం మాత్రమే కాదు.. ఇంకెప్పుడూ హౌస్‌మేట్స్ ఇలాంటివి చేయకూడదని హెచ్చరించారు బిగ్ బాస్.

Related News

Bigg Boss 9 : పాపం భరణికి ఈ పరిస్థితి వస్తుంది అనుకోలేదు, తనను చూసి నేర్చుకోవాల్సింది ఇదే

Bigg Boss 9 Telugu: టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరో చెప్పిన ఇమ్మానుయేల్ బ్రదర్.. చాలా బాధగా ఉందంటూ!

Bigg Boss 9 Telugu Day 63 : దివ్యకు నాగార్జున మాస్ వార్నింగ్… వీడియోలతో బండారం బట్టబయలు… తనూజా చేతుల్లో ఎలిమినేషన్

Bigg Boss 9 Promo: రీతూ చౌదరి టాలెంట్ అదుర్స్.. అంతమాట అన్నారేంటి సార్!

Bigg Boss 9 Telugu : సింగర్ రామ్ రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించడంటే..?

Bigg Boss 9 : ఎంత నటిస్తావమ్మా? అప్పుడు పురుగుల చూసావు ఇప్పుడు ఉన్నాను అంటున్నావ్

Bigg Boss 9: అది సుమన్ శెట్టి అంటే, అందుకే ఇంత మంది ఇష్టపడుతున్నారు

Bigg Boss 9: మరోసారి తన సెల్ఫిష్ బిహేవర్ బయట పెట్టిన ఇమ్మానియేల్

Big Stories

×