Rukmini Vasanth (Image Credit: Instagram)
ప్రముఖ హీరోయిన్ రుక్మిణీ వసంత్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతోనే కాదు నటనతో కూడా ఉర్రూతలూగిస్తోంది.

Rukmini Vasanth (Image Credit: Instagram)
సప్త సాగరాలు దాచేయేల్లో అనే సినిమాతో కెమెరా ముందుకు వచ్చిన ఈమె ఆ తర్వాత అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను 2024లో పలకరించింది. ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందుకోలేదు.

Rukmini Vasanth (Image Credit: Instagram)
ఇక తర్వాత శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన మదరాసి సినిమాతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ తమిళ చిత్రం కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

Rukmini Vasanth (Image Credit: Instagram)
కానీ రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన కాంతార 2లో నటించి ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టేటస్ దక్కించుకుంది.

Rukmini Vasanth (Image Credit: Instagram)
ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న డ్రాగన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Rukmini Vasanth (Image Credit: Instagram)
ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న ఈమె తాజాగా ఆరెంజ్ కలర్ నెట్టెడ్ చీర కట్టుకొని తన అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం రుక్మిణి షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.