
Rukmini Vasanth (Image Credit: Instagram)(1)
ప్రముఖ కన్నడ నటి రుక్మిణి వసంత్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సప్తసాగరాలు దాచేయెల్లో సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. తెలుగులో మాత్రం నిఖిల్ హీరోగా నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

Rukmini Vasanth (Image Credit: Instagram)
ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కానీ ప్రశాంత్ నీళ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమాలో ఈమె హీరోయిన్గా నటిస్తోంది అని అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది.

Rukmini Vasanth (Image Credit: Instagram)
దీనికి తోడు తమిళంలో మదరాసి సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచినా ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.

Rukmini Vasanth (Image Credit: Instagram)
పాన్ ఇండియా స్థాయి గుర్తింపు లభించింది మాత్రం కాంతారా చాప్టర్ వన్ అనే చెప్పాలి. ఇందులో విలన్ పాత్ర పోషించి అందరి దృష్టిని అనూహ్యంగా ఆకట్టుకుంది.

Rukmini Vasanth (Image Credit: Instagram)
ఇక ఇప్పుడు యశ్ టాక్సిక్ తో పాటూ పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా మారిన ఈమె తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా తొలిసారి హాట్ ప్రదర్శన చేస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఏకంగా బ్లౌజ్ లేకుండా శారీ కట్టుకొని తన అందాలతో మెస్మరైజ్ చేసింది రుక్మిణి వసంత్.

Rukmini Vasanth (Image Credit: Instagram)
తాజాగా రుక్మిణి వసంత్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అమ్మడి అందానికి కుర్ర కారు సైతం ఫిదా అవుతున్నారు.