
Shruthi Haasan ( Source / Instagram )
తమిళ స్టార్ నటుడు కమల్ హాసన్ నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది శృతి హాసన్. పాప్ సింగర్, మ్యూజిక్ కంపోజర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది శృతి హాసన్... ఆ తర్వాత హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసింది.

Shruthi Haasan ( Source / Instagram )
ఈ బ్యూటీ 'అనగనగా ఒక ధీరుడు' అనే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈమె మొదటి సినిమాతోనే విజయాన్ని అందుకుంది. కానీ ఆ తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

Shruthi Haasan ( Source / Instagram )
'గబ్బర్ సింగ్' సినిమాతో మరో విజయాన్ని అందుకోవడంతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఒక్కసారి లక్కీ హీరోయిన్ అయ్యింది.. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోని స్టార్ హీరోల సరసన నటిస్తూ నెంబర్ వన్ హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

Shruthi Haasan ( Source / Instagram )
ఆమె మైఖేల్ కోర్సలేతో పీకల్లోతు ప్రేమలో పడింది. ఇక వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని అన్నిచోట్లా కెమెరా కంటికి కనిపించారు. ఈ జంట పెళ్లి చేసుకుంటుందని అనుకున్నారు. కానీ బ్రేకప్ చెప్పేసారు. ప్రస్తుతం సోలో గానే ఉంటుంది.

Shruthi Haasan ( Source / Instagram )
లవ్ బ్రేకప్ అయిన తర్వాత ఈమె వరుస షోలలో పాల్గొంటుంది.. ఈమధ్య పలు ఈవెంట్లలో కూడా కనిపిస్తుంది. కేవలం సింగర్ గా కూడా సినిమాలకు పాటలను పాడుతుంది. ఇప్పుడు చెప్పాలంటే ఫుల్ బిజీగా ఉంది..

Shruthi Haasan ( Source / Instagram )
సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతిపోగొతుంది.. తాజాగా ఫ్రెండ్స్ తో నైట్ టైం బీచ్ లో చిల్ అవుతూ కనిపించింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి.. ఓ లుక్ వేసుకోండి..