E-Paper
Advertisement

AP-Telangana: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త.. అసెంబ్లీ సీట్లు పెంపు, అధికార పార్టీల్లో ఒకటే సందడి

AP-Telangana: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త.. అసెంబ్లీ సీట్లు పెంపు, అధికార పార్టీల్లో ఒకటే సందడి
Advertisement

AP-Telangana: ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలకు తీపి కబురు చెప్పేసింది కేంద్రం. ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. 2029 ఎన్నికల నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఇరు రాష్ట్రాల అధికార పార్టీలో ఒకటే సందడి నెలకొంది.

దేశవ్యాప్తంగా లోక్‌సభ- రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు పెంపు

Advertisement

సోమవారం సాయంత్రం ఢిల్లీలో ఎన్డీయే సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎన్డీయే పార్టీలు హాజరయ్యాయి. కేంద్రమంత్రులు అమిత్‌షా, కిరణ్‌ రిజిజు, అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ల నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఈ క్రమంలో అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు పెంపు విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్రం డిసైడ్ అయ్యింది.

అంతేకాదు ఈ బిల్లు రానున్న పార్లమెంటు సమావేశాల్లో పెట్టడానికి తెరవెనుక పావులు కదుపుతోంది ఎన్డీయే సర్కార్. ఆ లెక్కన పార్లమెంటు స్థానాలు 543 నుంచి 816కి చేరుతాయని తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న 4,123 ఉన్న అసెంబ్లీ స్థానాలు ఇకపై 6,185 సీట్లు కానున్నాయి. ఏపీ పునర్విభన చట్టంలో నియోజకవర్గాల పెంపును ప్రధానంగా ప్రస్తావించింది కేంద్రం.

Advertisement

ఏపీలో 263 సీట్లు, తెలంగాణలో 179 స్థానాలు పెంపు

ఈ లెక్కన తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కు చేరుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో 175 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా, అవి 263 స్థానాలకు చేరనున్నాయి.  ఆ లెక్కన ఇరు రాష్ట్రాల్లో 50 శాతంపైగానే సీట్లు పెరిగాయి.  అంతేకాదు లోక్‌సభ స్థానాలు ఏపీలో 25 నుంచి 38 పెరగనున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 17 ఎంపీలు 26 కి చేరనున్నాయి.  ఆ లెక్కల ప్రకారం ఏపీలో 13, తెలంగాణలో 9 ఎంపీ సీట్లు పెరగనున్నాయి.

2011, 2027 జనాభా లెక్కన ఆధారంగా తీసుకుంటారా అనేదానిపై చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా జనగణన వచ్చే ఏడాది మార్చి ఒకటి నాటికి పూర్తి చేయనుంది. వాటి లెక్కలను ప్రకటించిన తర్వాత వెంటనే నియోజకవర్గాల పునర్విభజన చేపటవచ్చని కొందరు అధికారులు చెబుతున్నారు. దీనిపై అన్ని పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఎన్డీయే నిమగ్నమైంది.

ALSO READ: అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. హెచ్ఓడీ టవర్‌లో ఘటన, విచారణకు ఆదేశం

2027 జనగణన ఆధారంగా సీట్ల పెంపునకు అనుమతిస్తే ఉత్తర-దక్షిణ భారతదేశాల మధ్య తేడా వచ్చే అవకాశం ఉంది. దీనిపై ఆది నుంచి దక్షిణాది రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు 50 శాతం పెంచాలని ఆలోచన చేసింది. దీనివల్ల రాష్ట్రాలకు ఎలాంటి సమస్య ఉందని ఎన్డీయే ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే ప్రతిపాదనపై కాంగ్రెస్ సహా మిత్రపక్షాలు ఏమంటాయో చూడాలి.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×