Sobhita dhulipala (Image Credit: Instagram)
ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

Sobhita dhulipala (Image Credit: Instagram)
ఇక తాజాగా ఈమె నటిస్తున్న చిత్రం చీకటిలో.. సస్పెన్స్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ చిత్రం జనవరి 23 నుండి ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతుంది.

Sobhita dhulipala (Image Credit: Instagram)
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో శోభిత తనవంతు ప్రమోషన్స్ మొదలు పెట్టింది.

Sobhita dhulipala (Image Credit: Instagram)
ఈ సందర్భంగా శోభితా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. కింద క్యాప్షన్ గా .." మూవీ చీకటిలో.. ప్రమోషన్స్ వెలుగులో" అంటూ పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు నెటిజెన్స్ ను ఆకట్టుకుంటుంది.

Sobhita dhulipala (Image Credit: Instagram)
ఇకపోతే వైట్ అండ్ వైట్ డ్రెస్ ధరించిన ఈమె అందులో ప్రకృతిలో విహరిస్తూ ఫోటోలను షేర్ చేసింది.

Sobhita dhulipala (Image Credit: Instagram)
తాజాగా తన మూవీ ప్రమోషన్స్ లో భాగంగా శోభిత షేర్ చేసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.