E-Paper
Advertisement

Medaram Jatara 2026: మేడారం వెళ్లలేకపోతున్నారా? ప్రసాదం ఇంటికే.. టీజీఎస్ఆర్టీసీ సరికొత్త సేవలు!

Medaram Jatara 2026: మేడారం వెళ్లలేకపోతున్నారా? ప్రసాదం ఇంటికే.. టీజీఎస్ఆర్టీసీ సరికొత్త సేవలు!
Advertisement

Medaram Jatara 2026: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర జనవరి 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) వినూత్న సేవలను అందుబాటులోకి తెచ్చింది.

సుదూర ప్రాంతాల నుండి జాతరకు రాలేని భక్తుల కోసం కేవలం ₹299కే అమ్మవారి ప్రసాదాన్ని నేరుగా ఇంటికే డెలివరీ చేసే సదుపాయాన్ని కల్పించింది. ఈ ప్రసాదం కిట్‌లో పవిత్రమైన బంగారం (బెల్లం), అమ్మవార్ల ఫోటో, పసుపు, కుంకుమ ఉంటాయి. ఆసక్తి గల భక్తులు సంస్థ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్ల ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. భక్తులకు ఏవైనా సందేహాలు ఉంటే 040-69440069 లేదా 040-23450033 కాల్ సెంటర్ నంబర్లను సంప్రదించి సమాచారం పొందవచ్చు.

Advertisement

మ‌రోవైపు రవాణా పరంగా ఎక్కడా అంతరాయం కలగకుండా టీజీఎస్ఆర్టీసీ సుమారు 6,000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మహిళా భక్తుల కోసం మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం మేడారం వెళ్లే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో వర్తిస్తుంది. అయితే, ప్రత్యేక బస్సుల నిర్వహణ దృష్ట్యా ఇతర ప్రయాణికులకు సాధారణ ఛార్జీపై 50 శాతం అదనపు ఛార్జీ వసూలు చేయనున్నారు. ఈ ప్రత్యేక బస్సు సేవలు జనవరి 25న ప్రారంభమై ఫిబ్రవరి 1 వరకు భక్తులకు అందుబాటులో ఉంటాయి.

జాతర ప్రధాన ఘట్టాలు జనవరి 28న దేవతల గద్దెలకు రాకతో మొదలై, జనవరి 29న సమ్మక్క తల్లి రాకతో పతాక స్థాయికి చేరుకుంటాయి. జనవరి 30న భక్తుల మొక్కుల అనంతరం, జనవరి 31న దేవతల వనప్రవేశంతో ఈ మహా వేడుక ముగుస్తుంది. ఈ ఏర్పాట్ల ద్వారా భక్తులు సురక్షితంగా ప్రయాణించడంతో పాటు, ఇంట్లోనే ఉండి అమ్మవార్ల ఆశీస్సులు పొందే అవకాశం కలుగుతోంది.

Advertisement

మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం TGSRTC భారీ ఏర్పాట్లు చేస్తోందని సంస్థ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు. ఈ మహా జాతరలో భక్తులకు రవాణా ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన భరోసా ఇచ్చారు.

జాతర రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రాంతాల నుండి మేడారానికి మ‌రో 4,000 పైగా ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఈ జాతర బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

Read Also: మేడారం జాతరకు వెళ్తున్నారా? లగేజీ సర్దుకునే ముందు ఈ జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందే!

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×