Drone Show
తెలంగాణ సచివాలయం ఆవరణ మరోసారి చరిత్ర సృష్టించింది. మిస్ వరల్డ్ 2025 అందాల పోటీకి హాజరైన కంటెస్టెంట్లకు రాష్ట్ర ప్రభుత్వ విజయాలు, పథకాల అమలును చూపించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన డ్రోన్ షో అక్కడి వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చింది.
Drone Show
తెలంగాణ అభివృద్ధి గాధలను ఆకాశంలో చిత్రాలుగా చూపించే ఈ లైటింగ్ షో అందరికీ కన్నుల పండువగా మారింది. ఈ ప్రత్యేక షోకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. వారు మిస్ వరల్డ్ బృందానికి రాష్ట్ర ప్రగతిని, పర్యాటక ప్రాధాన్యతలను వివరించారు.
Drone Show
వందలాది డ్రోన్లు సమన్వయంతో గాలిలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, రాష్ట్ర గుర్తింపులను ఆవిష్కరించాయి.
Drone Show
కళాత్మకంగా అమలైన డ్రోన్ లైటింగ్ ద్వారా సన్నబియ్యం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ, తెలంగాణ రైజింగ్, మహిళలకు ఫ్రీ బస్సు, రూ. 500 గ్యాస్ సిలిండర్, ఇందిరా మహిళా శక్తి, ప్రతిబింబం ఆకాశంలో కనబడింది.
Drone Show
ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వ ప్రజా ప్రయోజన కార్యక్రమాలు, అభివృద్ధి మార్గాన్ని ప్రపంచానికి చేరవేయాలనే సంకల్పం స్పష్టమైంది. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ వేదికపై పటిష్టం చేయడంలో ఇది కీలక ఘట్టంగా నిలిచే అవకాశం ఉంది.
Drone Show
ఈ షోను చూసిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తెలంగాణ సంస్కృతి, పథకాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టెక్నాలజీని ఉపయోగించి ఒక రాష్ట్ర అభివృద్ధిని ఇలా చూపించడంపై ప్రశంసలు కురిపించారు.
Drone Show
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధిని ప్రపంచానికి తెలియజేయాలన్న మా సంకల్పంలో ఇది ఒక అద్భుతమైన స్టెప్. డ్రోన్ షో ద్వారా ప్రజా పాలన అందరికీ దర్శనమవుతోందని పేర్కొన్నారు.