BigTV English
Advertisement

Chiranjeevi: చిరుతో సినిమా.. చెప్పాపెట్టకుండా పారిపోయిన వర్మ.. అసలేం జరిగింది..?

Chiranjeevi: చిరుతో సినిమా.. చెప్పాపెట్టకుండా పారిపోయిన వర్మ.. అసలేం జరిగింది..?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఎంతోమంది స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసిన విషయం తెల్సిందే. కుర్ర డైరెక్టర్స్ నుంచి సీనియర్ డైరెక్టర్స్ వరకు.. చిరుతో చేయని డైరెక్టర్ లేడు అంటే అతిశయోక్తి కాదు. స్టార్ డైరెక్టర్స్ అందరూ తన కెరీర్ లో ఒక్క సినిమా అయినా చిరుతో చేయాలనీ తాపత్రయపడుతూనే ఉంటారు.కానీ, చిరును డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినా కూడా  వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వదులుకున్నాడు అని చాలా తక్కువమందికి తెలుసు. ఇప్పుడు శివ రీ రిలీజ్ సమయంలో వర్మ .. చిరుకు క్షమాపణలు చెప్పడంతో ఈ న్యూస్ బయటకు వచ్చింది. అసలేం జరిగింది అంటే..


శివ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ మొదటిసినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత వర్మకు అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయట. అందులో చిరు సినిమా కూడా ఉంది. చిరంజీవి హీరోగా వర్మ దర్శకత్వంలో వినాలని ఉంది అనే సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మించాడు. ఇక ఈ చిత్రంలో చిరు సరసన టబు, ఊర్మిళ మండోద్కర్ నటించారు. దాదాపు 25 శాతం షూటింగ్ పూర్తయ్యింది.  సాంగ్స్ కూడా ఫినిష్ చేశారు. కానీ, మధ్యలో ఈ సినిమా ఆగిపోయింది.

ఇక ఈ సినిమా ఆగిపోవడానికి  చాలా కారణాలు చెప్పుకొస్తున్నారు. అందులో ఒకటి.. స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయాలనీ చిరు అడగ్గా వర్మ ససేమిరా అన్నాడని, తన సినిమాలో ఎలాంటి మార్పులు చేయడానికి తాను ఒప్పుకోను అని అన్నాడని, దీనివలన వారిద్దరి మధ్య విభేదాలు వచ్చి ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే ఇందులో నిజం లేదని, అసలు కారణం వేరే ఉందని ప్రస్తుతం టాక్ నడుస్తోంది.


అసలు విషయం ఏంటంటే.. వినాలని ఉంది అనే సినిమా చేస్తున్న సమయంలోనే వర్మకు బాలీవుడ్ నుంచి పెద్ద ఆఫర్ వచ్చిందంట. ఇక్కడ  ఆ విషయం చెప్పి వెళ్ళడానికి చిరు, అశ్వినీదత్ ఒప్పుకోరని తెలిసి.. ఎవరికీ చెప్పాపెట్టకుండా వర్మ ముంబై పారిపోయాడట. దానివల్లనే వినాలని ఉంది సినిమామధ్యలోనే ఆగిపోయిందని, అప్పటినుంచి వర్మకు చిరుకు మధ్య మాటలు లేవని సమాచారం.అందుకే వర్మ .. తన తప్పును కప్పి పుచ్చుకోవడానికి ప్రతిసారి మెగా ఫ్యామిలీపై నిందలు వేస్తూ ఉంటాడని టాక్. ఇక ఇప్పుడుచిరుకు క్షమాపణలు చెప్పింది కూడా సినిమా నుంచి వెళ్ళిపోయినందుకే కానీ, మెగా ఫ్యామిలీపై నిందలు వేసినందుకు కాదని కొందరు చెప్పుకొస్తున్నారు. అంత చేసినా కూడా చిరు అవేమి పట్టించుకోకుండా శివ గురించి, వర్మ గురించి చెప్పడం ఆయన గొప్ప మనసును బయటపెడుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

ENE2: ఈ నగరానికి ఏమైంది 2 నుంచి తప్పుకున్న సురేష్ ప్రొడక్షన్స్..?

Vijay Deverakonda: రష్మిక లక్ విజయ్ కి కలిసొచ్చేలా ఉందే.. అది కూడా జరిగితే తిరుగుండదు..

Sandeep Kishan : సందీప్‌తో విజయ్ కొడుకు కొత్త మూవీ… టైటిల్ పోస్టర్ వచ్చేసింది..

The Rajasaab: సంక్రాంతి అన్నారు.. సడీ లేదు.. చప్పుడు లేదు.. అసలు సినిమా వస్తుందా ?

RT76: భారీ ధరకు ఓటీటీ డీల్ పూర్తి చేసుకున్న రవితేజ మూవీ.. ఎన్ని కోట్లంటే..?

Imanvi : ప్రభాస్ కి స్పెషల్ థాంక్స్.. ఆ హీరోయిన్స్ జాబితాలో ఇమాన్వి!

SSMB 29 Update: జక్కన్న నుంచి మరో సర్ప్రైజ్… హీరోయిన్ ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది

Big Stories

×