Ap Govt: ఇల్లు లేనివారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పేసింది. ఇంటి కోసం దరఖాస్తు చేసుకునేవారికి గడువు ముగిసిపోయింది. దాన్ని మరో 20 రోజులపాటు పొడిగించింది. ఏ మాత్రం ఆలస్య చేయకుండా ఇల్లు లేనివారు వెంటనే దరఖాస్తు చేయండి. ఇంకెందుకు ఆలస్యం. అసలు వివరాలేంటి? ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్తే..
గడువు పొడిగింపు.. ఇంకెందుకు ఆలస్యం
కేంద్ర పథకాలపై ఫోకస్ చేసింది ఏపీ ప్రభుత్వం. వాటిని 100 శాతం అమలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రస్తుతం 500కి పైగా పథకాలను అమలు చేస్తోంది కేంద్రప్రభుత్వం. వాటిలో కీలకమైనది ప్రధానమంత్రి ఆవాస్ యోజన-PMAY. సొంత ఇల్లు లేని పేదవారికి కేంద్రం-ఏపీ ప్రభుత్వం కలిసి శాశ్వత గృహాలను అందిస్తున్నాయి. గత బుధవారం(నవంబర్ 5)తో గడువు ముగిసింది.
అదే సమయంలో గడువు పెంచాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. దీంతో ఇళ్ల దరఖాస్తుల గడువును నవంబర్-30 వరకు పెంచింది.ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుంది. నవంబర్ చివరి లోపు దరఖాస్తు చేసుకున్నవారికి మార్చి చివరిలోపు అనుమతులు, ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడం జరుగుతాయి. ఆ లెక్కన కేవలం 20 రోజులు మాత్రమే సమయం ఉంది.
ఇల్లు లేనివారికి సువర్ణ అవకాశం
ఈలోపు దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఉచిత ఇల్లు సొంతం చేసుకోవచ్చు. పట్టణాలు-మున్సిపాలిటీల్లో ఉన్నవారికి దాదాపు రూ.2.89 లక్షల వరకు నిధులు ఇస్తారు. అదే గ్రామాల్లో ఉండేవారు ఇల్లు నిర్మించుకోవాలంటే దాదాపు లక్షన్నర వరకు రానుంది. ఎవరైతే ఇల్లు నిర్మించుకోవాలి భావిస్తారో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వారికే మనీ అందజేస్తారు.
దరఖాస్తుదారులు నేరుగా సచివాలయానికి సంప్రదించాలి. ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ని కలిసి PMAY కింద ఇల్లు కావాలని చెబితే చాలు. సంబంధిత అధికారి PMAY వెబ్ పోర్టల్ లేకుంటే యాప్‌కు సంబంధించి అన్ని వివరాలు ఇస్తారు. నమోదు ఎలా చేయాలి? ఏయే అర్హతలు ఉండాలి? ఎలాంటి పత్రాలు అప్‌లోడ్ చెయ్యాలి?
ALSO READ: పెరుగుతున్న చలి తీవ్రత.. వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు
ఏపీలోని గ్రామాల్లో ఇళ్లు నిర్మించుకోడానికి దాదాపు 300 మంది వరకు రెడీగా ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వారంతా వెళ్లి దరఖాస్తు చేసుకునే అవకాశం లభించింది. ఇల్లు నిర్మించుకునేవారికి సొంత స్థలం ఉండాల్సిందే. దానికి సంబంధించిన పత్రాలను సమీపంలోని సచివాలయానికి తీసుకెళ్లాలి. ఆ స్థలంలో నిలబడిన ఫొటో ఉండాలి. ఒకవేళ ఆ స్థలంలో పాడైపోయిన గుడిసె ఉంటే దాని ముందు ఫొటో తీసుకోవాలి.
ఇక దరఖాస్తు ఫారంలో మొబైల్ నంబర్, ఆధార్ ఐడీ, బ్యాంక్ అకౌంట్ వివరాలు కచ్చితంగా ఇవ్వాలి. అలాగే ఉపాధి హామీ జాబ్ కార్డు నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది. అంతా ఓకే అయిన తర్వాత రిఫరెన్స్ నంబర్ ఇస్తారు. కొన్నిరోజుల తర్వాత అప్లికేషన్ ఓకే అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే అయిన తర్వాత అధికారులను సంప్రదించాలి. నిధులు ఎప్పుడు అకౌంట్లలో జమ అవుతుందో తెలుసుకొని నిర్మాణ చేపట్టవచ్చు.