Bhairavam Trailer : ఈమధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్షన్ సీక్వెన్స్ గా వస్తున్న సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. మొన్న నాని నటించిన హిట్ 3 ఏ రేంజ్ లో రెస్పాన్స్ అందుకుందో తెలిసిందే.. ఇప్పుడు అంతకుమించి అంటూ మరో ముగ్గురు హీరోలు భారీ యాక్షన్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు.. టాలీవుడ్ యంగ్ హీరోస్ అయినటువంటి మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం భైరవం.. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, టీజర్ మూవీపై భారీగా హైప్ పెంచేశాయి. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కో అప్డేట్ ని మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు.. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం..
ట్రైలర్ లో బ్లడ్ బాత్..
తమిళ ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన గరుడన్ మూవీకి రీమేక్ గా ఈ మూవీ రాబోతుంది. నారా రోహిత్ , మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్షన్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ‘పవిత్రాణాయ సాధూనాం.. వినాశాయ చదుష్కృతాం..’ అంటూ భగవద్గీత శ్లోకంతో మొదలైన ట్రైలర్ లోని డైలాగులు.. యాక్షన్స్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి సీను కూడా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు.. ముగ్గురు హీరోలు ఎవరికి వారే అన్నట్లు అదరగొట్టేసారు.. భారీ యాక్షన్ సీన్లు సినిమాకి హైలెట్ అవుతాయని ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది. మొత్తానికి ట్రైలర్ కు జనాల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.
Also Read :మా చెల్లెమ్మ జోలికి వస్తే బాగోదు.. మీమర్స్ పై రెచ్చిపోయిన సుమక్క..
స్టోరీ లైన్ ఇదేనా..?
ఒక గ్రామంలో అమ్మవారి ఆలయానికి సంబంధించి నగలు, మాన్యాన్ని కాపాడేందుకు గ్రామానికి చెందిన యువకులు ఏం చేశారో అనే దాని బ్యాక్ డ్రాప్‌గా ఈ మూవీ తెరకెక్కినట్లు తాజాగా విడుదలైన ట్రైలర్ ను చూస్తే స్పష్టం అవుతుంది. సినిమాలో మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్షన్ ఎలివేషన్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి. చనిపోయిన వాళ్లను తగలెట్టడం మన ఆచారం, వాళ్లతో పాటు మన భవిష్యత్తును తగలెట్టేసుకోవడం మూర్ఖత్వం.. ఎదుటోడు మన మీద కన్నేసే లోపే మనం వాడి మీద మన్నేసెయ్యాలి.. అంటూ మంచు మనోజ్ చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.. పవర్ ఫుల్ డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. మరి సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి… ఈ మూవీ పై మనోజు ఆశలు పెట్టుకున్నాడు. కనుక హిట్ అయితే అతని లైఫ్ కం బ్యాక్ అయినట్లే.. ఇక అతని అదృష్టం ఎలా ఉందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది..