Imanvi : రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas ) ప్రస్తుతం వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. తన సినిమాలతో భారీ క్రేజ్ దక్కించుకోవడమే కాకుండా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల జాబితాలో ఒకరిగా నిలిచారు. ఇకపోతే ప్రభాస్ తో ఎవరైనా నటిస్తున్నారు అంటే వారందరికీ కచ్చితంగా తన ఇంటి భోజనాన్ని రుచి చూపిస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే తన సినిమాలో నటించే ప్రతి హీరోయిన్ కి కూడా ప్రభాస్ తన ఇంటి భోజనాన్ని రుచి చూపిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్ లు ప్రభాస్ పంపించిన భోజనాన్ని ఫోటోలు వీడియోల రూపంలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ హీరోయిన్స్ జాబితాలోకి ప్రభాస్ కొత్త సినిమా హీరోయిన్ ఇమాన్వీ (Imanvi ) కూడా చేరిపోయింది. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ఫౌజీ (Fauji ) అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఆగస్టు 14వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది.
also read:Bigg Boss : బిగ్ బాస్ ఫైనల్ విజేత ఆమె.. ప్రైజ్ మనీ భారీగా కట్.. ఎందుకంటే?
ఈ నేపథ్యంలోనే ఇమాన్వీ కోసం ప్రభాస్ తన ఇంట్లో ప్రత్యేకంగా వండించిన భోజనాన్ని ఆమె కోసం పంపించారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ఇంటి నుంచి వచ్చిన భోజనాన్ని షూటింగ్ బ్రేక్ టైం లో రుచి చూసింది ఇమాన్వి. ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది కూడా.. రుచికరమైన భోజనాన్ని రుచి చూపించిన ప్రభాస్ కి ధన్యవాదాలు. కడుపుతో పాటు మనసు కూడా నిండిపోయింది. అంటూ ఇమాన్వి క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రభాస్ పై మళ్లీ ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు. ప్రభాస్ నిజంగా రాజు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ ఇంటి భోజనాన్ని రుచిచూసిన హీరోయిన్స్ లో ఇమాన్వి కూడా చేరిపోయింది.
ఇకపోతే ప్రభాస్ ఇంటి భోజనాన్ని రుచి చూసిన హీరోయిన్స్ జాబితాలో శృతిహాసన్ , దిశాపటానీ, దీపికా పదుకొనే, కృతి సనన్ తోపాటు జగపతిబాబు ఇలా ఎంతోమంది ప్రభాస్ ఇంటి భోజనాన్ని రుచి చూసారు.
ప్రభాస్ నటించిన చిత్రాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవబోతోంది. మరొకవైపు ఫౌజీ విడుదలకు సిద్ధం చేస్తున్నరు. వీటితోపాటు కల్కి 2, సలార్ వంటి చిత్రాలను కూడా చేస్తున్నారు. ప్రభాస్ వీటి తర్వాత మరో కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.
Heart and stomach so so full ❤️
Thank you #Prabhas garu .. pic.twitter.com/7oepJ5RVkf
— Imanvi (@imanviactress) November 9, 2025