BigTV English
Advertisement

The Rajasaab: సంక్రాంతి అన్నారు.. సడీ లేదు.. చప్పుడు లేదు.. అసలు సినిమా వస్తుందా ?

The Rajasaab: సంక్రాంతి అన్నారు.. సడీ లేదు.. చప్పుడు లేదు.. అసలు సినిమా వస్తుందా ?

The Rajasaab: టాలీవుడ్ లో అతి పెద్ద పండగ సంక్రాంతి. ఈ పండగ కోసం తెలుగువారు అందరూ ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. అలాగే ఈ పండగ కోసమే సినీ అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. పెద్ద పెద్ద సినిమాలు పోటీలకు వచ్చేది సంక్రాంతికే. ఈసారి సంక్రాంతి నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా అరడజను సినిమాలు పొంగల్ రేసులోకి దిగుతున్నాయి. అందులో ఒకటి ది రాజాసాబ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజాసాబ్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు.


ఈ ఏడాది మిరాయ్ తో మంచి హిట్ అందుకొని కొత్త జోష్ తో ఉరకలు వేస్తున్న ఈ బ్యానర్..  మిగిలిన ఆశలన్నీ రాజాసాబ్ పైనే పెట్టుకున్నాయి. అంచనాలకు తగ్గట్టే ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను బాగానే మెప్పించింది. అయితే రెండు నెలల్లో రిలీజ్ పెట్టుకొని ఇప్పటివరకు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు మేకర్స్. ఇంకోపక్క సంక్రాంతి రేసులో పోటీపడుతున్న మిగిలిన సినిమాలు అన్ని ప్రమోషన్స్ మొదలుపెట్టేశాయి. ఇప్పటికే మన శంకర వరప్రసాద్ గారు.. మీసాల పిల్లా అంటూ వచ్చి ఇండస్ట్రీని షేక్ చేశారు.

అంతేనా జన నాయగన్ నుంచి కూడా తలపతి కచేరి అంటూ మొదటి సాంగ్ ను రిలీజ్ చేశారు. అంతెందుకు.. మార్చిలో వచ్చే పెద్దినే మొదటి సాంగ్ ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ ను షురూ చేసింది. కానీ, పండగకు వస్తున్న రాజుగారు మాత్రం ఇప్పటివరకు మ్యూజికల్ ప్రమోషన్ ఊసే ఎత్తడం లేదు. అసలు ఈసారి అయినా రాజాసాబ్ రిలీజ్ అవుతుందా అనే అనుమానాలు మరోసారి తలెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న అనుమానాలు అవసరం లేదు.. కచ్చితంగా సంక్రాంతికి రాజాసాబ్ వస్తుంది అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కానీ, ఏం ప్రయోజనం ఇప్పటివరకు ప్రమోషన్స్ షురూ చేయకపోతే సినిమాపై ఉన్న అంచనాలు నీరుగారిపోతున్నాయని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.


ప్రభాస్ సినిమాలకు ప్రమోషన్స్ ఏంటి.. అవసరం లేదు అనుకుంటే పొరపాటే. పోటీ లేకుండా డార్లింగ్ ఒక్కడే వస్తే అలా అనుకున్నా పర్లేదు. కానీ, సంక్రాంతి పోటీ మాములుగా లేదు. ఇక్కడ కనుక ప్రమోషన్స్ లేవు అంటే రాజాసాబ్ చాలా నష్టపోవాల్సి వస్తుంది అనేది కొందరి మాట. థమన్ ప్రస్తుతం ఈ సినిమాకు ఫ్రెష్ ట్యూన్స్ అందించే పనిలో ఉన్నాడట.ఇకనైనా మించిపోయింది లేదు. సినిమా రిలీజ్ అయ్యేవరకు రాజాసాబ్ పాటలు, మాటలు వినిపించేలా చేయగలిగితేనే సక్సెస్ ను అందుకోవడానికి ఛాన్స్ లు ఉంటాయి. మరి ఇకనైనా రాజుగారు చప్పుడు చేస్తారేమో చూడాలి.

Related News

Manchu lakshmi : మా నాన్న నన్ను చీట్ చేశారు.. మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్..పచ్చి నిజాలు..?

Roshan Meka: మోహన్ లాల్ సినిమా నుంచి తప్పుకొని శ్రీకాంత్ కొడుకు తప్పు చేశాడా.. ?

ENE2: ఈ నగరానికి ఏమైంది 2 నుంచి తప్పుకున్న సురేష్ ప్రొడక్షన్స్..?

Vijay Deverakonda: రష్మిక లక్ విజయ్ కి కలిసొచ్చేలా ఉందే.. అది కూడా జరిగితే తిరుగుండదు..

Sandeep Kishan : సందీప్‌తో విజయ్ కొడుకు కొత్త మూవీ… టైటిల్ పోస్టర్ వచ్చేసింది..

RT76: భారీ ధరకు ఓటీటీ డీల్ పూర్తి చేసుకున్న రవితేజ మూవీ.. ఎన్ని కోట్లంటే..?

Chiranjeevi: చిరుతో సినిమా.. చెప్పాపెట్టకుండా పారిపోయిన వర్మ.. అసలేం జరిగింది..?

Big Stories

×