Bhimavaram Crime: హత్యల వెనుక రకరకాల కారణాలు ఉంటాయి. కొందరికి ఫ్యామిలీ సమస్యలు.. మరికొందరు ఆస్తుల తగాదాలు వంటి ఉంటాయి. తల్లి, తమ్ముడ్ని.. సొంత అన్న దారుణం చంపేశాడు. సంచలనం రేపిన ఈ ఘటన ఉమ్మడి పశ్చిమగోదావరి పట్టణంలో చోటు చేసుకుంది. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
తల్లి-తమ్ముడ్ని చంపిన పెద్ద కొడుకు
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం ఈ ఘటన జరిగింది. సుంకర పద్దయ్య వీధిలో మహాలక్ష్మి ఫ్యామిలీ ఉంటోంది. ఆమెకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు శ్రీనివాసరావు కాగా, మరొకడి పేరు రవితేజ. కారణాలు ఏంటో తెలీదుగానీ శ్రీనివాసరావుకు మతి స్థిమితం సరిగా ఉండదు. దీంతో బయటకు వెళ్లలేక ఇంట్లో ఉంటున్నాడు. మరి తల్లి, సోదరుడి ఎలాంటి విభేదాలు వచ్చాయో తెలీదు.
సోమవారం తెల్లవారుజామున అందరూ నిద్రిస్తున్న సమయంలో తల్లి-తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు శ్రీనివాసరావు. కొడుకు నుంచి తప్పించుకునే క్రమంలో గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి చంపేశాడు. కన్నతల్లి, సోదరుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఓ గంట తర్వాత శ్రీనివాసరావు తాను చేసిన పని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
మతి స్థిమితం వల్లే ఇదంతా జరిగింది?
నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.అతడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. శ్రీనివాసరావు చేసిన పనికి ఇరుగుపొరుగు వారు హడలిపోతున్నారు. అతగాడ్ని ఇక్కడ ఉంచవద్దని, తమ ప్రాణాలకు ముప్పు ఉందని చెబుతున్నారు. నిందితుడ్ని ఆసుపత్రికి తరలించాలని పోలీసులను కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సివుంది.
ALSO READ: వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ. 80 లక్షల వరకు