Nanna Kutty Movie Review: నటీనటులు: విజయ్ ఆంటోనీ, ప్రీతి అస్రాని, బేబీ లిథన్య, భగవతి పెరుమాళ్, లిజ్జీ ఆంటోనీ తదితరులు
దర్శకత్వం: ము. మారన్
సంగీతం & ఎడిటింగ్: విజయ్ ఆంటోనీ
నిర్మాతలు: ఫాతిమా విజయ్ ఆంటోనీ, విజయ్ ఆంటోనీ
వైజాగ్‌కు చెందిన సూర్య (విజయ్ ఆంటోనీ) కొన్ని గొడవల కారణంగా ఊటీకి వెళ్లి చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు. అక్కడ దివ్య (బేబీ లిథన్య) అనే చిన్నారిని ఎంతో ప్రేమగా, ఒంటరిగానే పెంచుతుంటాడు. దివ్య స్కూల్ టీచర్ అనిత (ప్రీతి అస్రాని) సూర్య మంచితనం చూసి అతన్ని ఇష్టపడుతుంది. ఈ క్రమంలో అసలు దివ్య ఎవరు? సూర్య ఆమెను ఎందుకు పెంచుతున్నాడు? అనే విషయంలో ఊహించని నిజాలు బయటపడతాయి. ఆ నిజాలు ఏంటి? తర్వాత ఏం జరిగింది? అనేదే ఈ చిత్ర కథాంశం.
విజయ్ ఆంటోనీ సినిమా అనగానే ఎమోషన్‌కు పెద్దపీట ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. ‘నాన్న కుట్టి’లో కూడా తండ్రీకూతుళ్ల తరహా అనుబంధాన్ని ఎంచుకున్నప్పటికీ, దాన్ని ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు తడబడ్డారు. ఇంటర్వెల్ వరకు కథనం చాలా రొటీన్‌గా, ఎక్కడా ఆకట్టుకోకుండా సాగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే ఒక ట్విస్ట్ కాస్త పర్వాలేదనిపించినా, ఆ తర్వాత మళ్లీ కథనం నీరసించిపోతుంది.సహజమైన భావోద్వేగాల కంటే అతి డ్రామా ఎక్కువైపోవడంతో, సన్నివేశాలు వెండితెర సినిమా కంటే టీవీ సీరియల్‌ను గుర్తుకు తెస్తాయి. ముఖ్యంగా సినిమాలో పదేపదే వినిపించే ‘నాన్న కుట్టి’ అనే డైలాగ్ ఒకానొక దశలో ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. విజయ్ ఆంటోనీ, బేబీ లిథన్య, ప్రీతి అస్రాని తమ పాత్రల మేరకు బాగానే నటించినా, నిస్సారమైన కథనం మరియు సాగదీత ఎడిటింగ్ సినిమాను కిందకు లాగేశాయి.
విజయ్ ఆంటోనీ, బేబీ లిథన్యల నటన మరియు క్లైమాక్స్‌లోని కొన్ని ఎమోషనల్ సీన్స్
ప్రీతి అస్రాని పాత్ర మరియు అక్కడక్కడా పండిన కొద్దిపాటి కామెడీ
also read: బేబీ దర్శక నిర్మాతలకు బిగ్ షాక్..హైకోర్టు నోటీసులు!
టీవీ సీరియల్‌ను తలపించే అతి డ్రామా, నిస్సారమైన కథనం
విపరీతంగా సాగదీసిన సన్నివేశాలు, పదేపదే రిపీట్ అయ్యే ‘నాన్న కుట్టి’ డైలాగ్ చిరాకు పెట్టడం
బలహీనమైన ఎడిటింగ్ మరియు ఆకట్టుకోని తెలుగు డబ్బింగ్
ఎమోషన్ పేరుతో టీవీ సీరియల్ స్థాయి డ్రామాను సాగదీసి, పదేపదే ‘నాన్న కుట్టి’ అంటూ థియేటర్లో ప్రేక్షకుల ఓపికకు పెద్ద పరీక్ష పెట్టారు