I Hate Marriage Review:నటీనటులు: సుగి విజయ్, జుప్సీ భద్ర, హారిక రాజేందర్, సాహితి కృష్ణ, డాక్టర్ పృథ్వీరాజ్, రవివర్మ అడ్డూరి తదితరులు
దర్శకత్వం: పరమేశ్ రేణుకుంట్ల
నిర్మాతలు: దయానంద్ మాడమ్, కార్తీక్ వెంపటి (ఆర్య సినిమా)
సంగీతం & నేపథ్య సంగీతం: వరికుప్పల యాదగిరి, ప్రవీణ్ ఇమ్మడి
ఎడిటింగ్: ఆవుల వెంకటేష్
దర్శకుడు కావాలనే లక్ష్యంతో, పెళ్లి బంధాలకు దూరంగా ఉండే కుర్రాడు రామ్ (సుగి విజయ్). తన వ్యక్తిత్వం నచ్చి, కండీషన్స్‌తో రిలేషన్‌లో ఉండాలనుకునే యువతి జాహ్నవి (జుప్సీ భద్ర). వీరిద్దరి ప్రయాణాన్ని రామ్ ఒక సినిమా కథగా మలచడం, ఆ తర్వాత ఇద్దరి మధ్య చిగురించే ప్రేమ చుట్టూ కథ సాగుతుంది. నేటి యువత ఆలోచనలు, మారుతున్న సంబంధాలు, తల్లిదండ్రుల బాధ్యత లాంటి అంశాలను కలుపుకుంటూ ఈ ప్రేమకథ ఎలాంటి మలుపులు తీసుకుంది? చివరికి రామ్, జాహ్నవి ఏమయ్యారు? అనేదే ఈ చిత్ర కథాంశం.
సాధారణ రొటీన్ ప్రేమకథలకు భిన్నంగా, నేటి తరం యువత ఆలోచనలు, పెళ్లిపై మారుతున్న అభిప్రాయాలను ఓపెన్‌గా, ధైర్యంగా చర్చించే ప్రయత్నం చేశారు దర్శకుడు పరమేశ్ రేణుకుంట్ల. సిటీ లైఫ్, హాస్టల్ వాతావరణం, లక్ష్యాలపై నిలబడే అమ్మాయిల మనస్తత్వం, అలాగే కూతురి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పడే ఆరాటం లాంటి అంశాలను నిజాయితీగా చూపించారు. సుగి విజయ్, జుప్సీ భద్ర తమ పాత్రల్లో సహజంగా ఒదిగిపోయి కథకు బలాన్నిచ్చారు. వరికుప్పల యాదగిరి అందించిన సంగీతం, ఆవుల వెంకటేష్ షార్ప్ ఎడిటింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కథనం అక్కడక్కడా కాస్త నెమ్మదించినట్లు అనిపించినా, ఎంచుకున్న బోల్డ్ పాయింట్, క్లైమాక్స్ ఇచ్చే సందేశం యూత్‌కు కనెక్ట్ అవుతాయి.
also read:‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ మూవీ రివ్యూ.. మెప్పించిందా?
నేటి యువత ట్రెండ్, పెళ్లి-బంధాలపై బోల్డ్‌గా, నిజాయితీగా చర్చించిన కథాంశం
జుప్సీ భద్ర, సుగి విజయ్ సహజమైన నటన
ఆవుల వెంకటేష్ షార్ప్ ఎడిటింగ్ మరియు వరికుప్పల యాదగిరి పాటలు
ఆలోచింపజేసే క్లైమాక్స్ మరియు సందేశం
అక్కడక్కడా కాస్త నెమ్మదించిన కథనం
మేకింగ్ క్వాలిటీ, విజువల్స్ ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేది
పెళ్లి, ప్రేమపై నేటి తరం మనసులోని మాటను దాపరికం లేకుండా చెప్పిన బోల్డ్ అండ్ యూత్‌ఫుల్ ప్రయత్నమే ఈ ‘ఐ హేట్ మ్యారేజ్’
I Hate Marriage Review and Rating: 2.5 / 5