Dad’s Little Friend Movie Review:నటీనటులు: రజత్ రాఘవ్, కాజల్ చౌదరీ, బేబీ పరిణీత రుద్రరాజు, హసిని సుధీర్ తదితరులు
దర్శకత్వం: శరత్
నిర్మాత: దూప దీపక్ (వెన్నెల సిల్వర్ స్క్రీన్)
ఆకాంక్ష (కాజల్ చౌదరీ) తన కూతురు పరిణీత (బేబీ పరిణీత రుద్రరాజు)తో ఒంటరిగా ఉంటుంది. తల్లి మరణం తర్వాత, అమ్మ జ్ఞాపకాలతోనే బతికే చిన్నారి పరి… స్ట్రింగ్ ఆర్ట్ వేస్తూ సొంతంగా ఖర్చులు చూసుకుంటూ ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎన్‌ఆర్‌ఐ రాహుల్ (రజత్ రాఘవ్) ఎంట్రీ ఇచ్చి, తానే పరి తండ్రిని అని చెబుతాడు. అసలు రాహుల్ ఎవరు? పరి అతన్ని ఎందుకు ఒప్పుకోదు? తల్లి డైరీ, గదిలోని రహస్యాల వెనుక దాగున్న ట్విస్ట్ ఏంటి? అన్నదే ఈ కథ.
చిన్నపిల్లల నేపథ్యంలో వచ్చే సినిమాలు అరుదే కానీ, ఇటీవల అలాంటి ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’లో తల్లి లేని లోటు, చిన్నారి ఒంటరితనం, స్ట్రింగ్ ఆర్ట్‌తో తన కాళ్లపై తాను నిలబడే ప్రయత్నం లాంటి అంశాలను దర్శకుడు శరత్ బాగానే మొదలుపెట్టారు. రాహుల్ వచ్చి ‘నేనే నీ నాన్న’ అనగానే కథలో కొంత ఆసక్తి మొదలవుతుంది; ఆ చిన్నారిని మెప్పించడానికి అతను చేసే ప్రయత్నాలు అక్కడక్కడా నవ్విస్తాయి.అయితే, ఎమోషన్‌ను బలంగా పండించే అవకాశం ఉన్నా, కొన్ని సన్నివేశాలను అనవసరంగా సాగదీసినట్లు అనిపిస్తుంది. కథనం ఇంకాస్త వేగంగా, పదునుగా సాగితే బాగుండేదనిపిస్తుంది. క్లైమాక్స్ ఎపిసోడ్, తల్లి డైరీ సీన్లు కొంత భావోద్వేగాన్ని పంచుతాయి.
also read:నాపై కేస్ పెడతామని బెదిరించారు..నిజాలు బయటపెట్టిన రోహిత్!
బేబీ పరిణీత నటన, తన అమ్మ జ్ఞాపకాలతో సాగే సన్నివేశాలు
రాహుల్ పాత్రను పరి కన్విన్స్ చేసే క్రమంలోని కొన్ని సరదా సన్నివేశాలు
క్లైమాక్స్ ఎమోషన్ మరియు ట్విస్ట్
మైనస్ పాయింట్లు:
అక్కడక్కడా సాగదీతగా అనిపించే సన్నివేశాలు
కథనంలో వేగం కొరవడటం
స్ట్రింగ్ ఆర్ట్‌లా దారాలతో అల్లిన ఎమోషన్ బాగానే ఉన్నా… మధ్యలో కాస్త సాగదీత తగ్గి, పేస్ పెంచితే ‘లిటిల్ ఫ్రెండ్’ ఇంకాస్త గట్టిగా పట్టుకునేదే.
Dad’s Little Friend Movie Review and Rating: : 2.5 / 5