E-Paper
Advertisement

‘భోగి’ మూవీ రివ్యూ..శర్వా హిట్ కొట్టాడా?

‘భోగి’ మూవీ రివ్యూ..శర్వా హిట్ కొట్టాడా?
Advertisement

నటీనటులు: శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి..

దర్శకత్వం: సంపతి నంది

Advertisement

నిర్మాత : కేకే రాధామోహన్

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

Advertisement

Bhogi Movie Review : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం భోగి.. డైరెక్టర్ సంపూర్ణే దశకు పొంగి దొరికిన ఈ సినిమా భారీ అంచనాలతో ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది. ఎప్పుడు క్లాసులకు కనిపించే శర్వానంద్ ఈ సినిమాలో మాస్ అండ్ రస్టిక్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులందరికీ బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు వచ్చిన సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది..? సినిమాకు నెటిజన్లు ఎలాంటి రివ్యూ ఇచ్చారు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.. మరి ఈ సినిమా టాక్ ఎలా ఉందో ఇప్పుడు మనం ఒకసారి చూసేద్దాం..

సినిమా కథేంటంటే:

ఊరి పెద్ద కళ్లలోకి సూటిగా చూస్తేనే కంటిచూపు మటాష్ అయిపోతుందేమో అన్నంత బిల్డప్ ఉండే ఊరు… ఆ పెద్ద ముందు జనం గజగజ వణికిపోతుంటే, హీరో మాత్రం ‘నాకేం భయం లేదు రా బాబూ’ అంటూ రివెంజ్‌కి దిగుతాడు. ‘రంగస్థలం’ ఫార్ములాని పట్టుకొచ్చి, దానికి కాస్త ఎర్రటి రక్తం, అరుపుల మసాలా కలిపి ‘భోగి’ అంటూ మన నెత్తిన రుద్దారు సంపత్ నంది. మరి ఆ పల్లెటూరి పగ, రివెంజ్ డ్రామా చివరికి ఏ మలుపు తిరిగింది? చూసేవాళ్ల ఓపిక ఏ స్థాయికి చేరుకుంది? అనేది కథ.

సినిమా విశ్లేషణ:

పాత సినిమా కథని జిరాక్స్ తీసి, ఒరిజినల్ మ్యాజిక్‌లో కనీసం పది శాతం కూడా లేకుండా వదిలేస్తే ఎలా ఉంటుంది? అచ్చం అలానే ఉంది ఈ ‘భోగి’ వ్యవహారం. ఫస్టాఫ్‌లో ఏదో కథ నడుస్తోందిలే, సెకండాఫ్‌లో ఏదో మ్యాజిక్ చేస్తారేమో అని ఆశపడితే—సెకండాఫ్‌కు వచ్చేసరికి కథ అసలు ఎటు వెళ్తుందో దర్శకుడికే అర్థమైనట్లు లేదు.

రివెంజ్ సీన్లు చూస్తుంటే ఇది సినిమానా లేక నడిరోడ్డులో జరుగుతున్న కత్తియుద్ధమా అన్న డౌట్ వస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చెవుల్లో డీజే పెట్టినట్లు గింగిరాలు కొట్టిస్తుంటే, క్లైమాక్స్ మాత్రం ఏ ఆయువుపట్టు లేకుండా సాగదీతతో ప్రేక్షకుడి ప్రాణాలు తీసేలా సాగుతుంది. మట్టి వాసన, ఎమోషన్ పక్కన పెట్టి, రక్తం, హింసనే నమ్ముకుంటే థియేటర్లో జనం సీట్లో కుదురుగా కూర్చుంటారా? లేదంటే సినిమాను సెంటిమెంట్ సైల వల్ల పూర్తిగా చూస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్లస్ పాయింట్లు:

ఫస్టాఫ్‌లో కథకు కొంత డైరెక్షన్, పర్పస్ ఉన్నట్లు అనిపించడం

కొత్తగా ఆలోచించకుండా పాత టెంప్లేట్‌ను యథాతథంగా దించేసిన ధైర్యం

మైనస్ పాయింట్లు:

రంగస్థలం’ని గుర్తుచేస్తూనే, ఆ స్థాయి ఫీల్‌ను మిస్ చేసిన రొటీన్ కథనం

సెకండాఫ్‌లో పూర్తిగా దారి తప్పి, సహనాన్ని పరీక్షించే సాగదీత క్లైమాక్స్

చెవుల తమ్మెలు చింపేసే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అతిగా అనిపించే హింస, రక్తపాతం

చివరి ఆఖరి మాటగా :- 

‘భోగి’ రోజు పాత సామాన్లు కాల్చాలి కానీ, ఏకంగా పాత సినిమా కథనే కాల్చి బూడిద చేసి, ఆ పొగ థియేటర్లో ప్రేక్షకుల కళ్లలో కొట్టినట్లుంది! చూసేవాళ్ల ఓపికకు దండం.

Bhoghi Movie Rating : 1.5/ 5

Related News

‘ఓం’ మూవీ రివ్యూ.. ధనుష్, సాయి పల్లవి మెప్పించారా?

‘ఆకాశంలో ఒక తార’ సినిమా రివ్యూ..

ఆకాశంలో ఒక తార ట్విట్టర్ రివ్యూ.. దుల్కర్ హిట్ కొట్టాడా?

ఈ.ఎన్.ఈ రిపీట్’ మూవీ రివ్యూ.. తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ మళ్లీ మెప్పించారా?

ఈఎన్ఈ రిపీట్ మూవీ ట్విట్టర్ రివ్యూ..తరుణ్ భాస్కర్ హిట్ కొట్టాడా?

‘చంద్రయాన్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..

ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ‘మాయ లేడీ’ మూవీ..సినిమా ఎలా ఉందంటే?

Big Stories

Advertisement
×