DNK Movie Review and Rating:నటీనటులు: మౌళి తనుజ్ ప్రశాంత్, సుస్మితా శెట్టి, ఆలీ, రఘు బాబు, బాబ్లూ తదితరులు
దర్శకత్వం: శ్రీను కంబాల
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై రవిశంకర్
మ్యూజిక్: సింజిత్ ఎర్రమిల్లి
సినిమాటోగ్రఫీ: సూర్య బాలాజీ
ఎడిటర్: శ్రీధర్ సోంపల్లి
ఆర్ట్ డైరెక్టర్: నాగేంద్ర గవ్వల
సౌండ్ డిజైనర్: మధు, ప్రభు సిఎస్
కాస్ట్యూమ్: మజీ డేరంగుల
90′ స్ బయోపిక్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్ లో శివాజీ తనయుడిగా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న మౌళి.. ఆ తర్వాత లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతేకాదు ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మౌళి.. తాజాగా ‘దొంగ నా కొడుకు’ అనే వినూత్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా స్టోరీ ఏంటి? ఇది ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? మౌళి తన నటనతో ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటున్నారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈశ్వర్ (మౌళి) తన మామతో కలిసి అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. లోన్ యాప్ లో అప్పులు చేసి క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడి పీకల్లోతు అప్పుల్లో మునిగిపోతాడు. సంపన్న కుటుంబానికి చెందిన దీపూ(సుస్మిత శెట్టి) తో ప్రేమలో పడతాడు. బెట్టింగ్లకు డబ్బు అవసరమైన ప్రతిసారి తన లవర్ దీపు బంగారు ఆభరణాలను వాడుకుంటూ ఉంటాడు. అలా ఆమెకు రూ.10లక్షలు అప్పుపడతాడు. ఇలాంటి పనుల వల్ల తల్లిదండ్రులు (అలీ, రజిత) కి తలనొప్పి తెస్తుంటాడు. అయితే అప్పులు తీర్చడానికి జ్యూవెలరీ షాప్ లో భారీ దొంగతనానికి ప్లాన్ చేస్తాడు.
కానీ ఊహించిన విధంగా ఒక బ్యాగ్ నిండా బంగారు ఆభరణాలు దొరుకుతాయి . వాటిని అమ్మడానికి ఈశ్వర్ పడే అవస్థలు.. మరోవైపు బంగారం కోసం పోలీసుల వేట సాగుతూ ఉంటుంది. ఇక తన మామతో కలిసి ఈశ్వర్ చేసిన అల్లరి పనులు ఏంటి? లోన్ యాప్ నిర్వహకుల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? గొప్పింటి అమ్మాయి దీపుతో ప్రేమ వ్యవహారం ఎలా కుదిరింది? దీపు తల్లిదండ్రులకు తన కూతురు , ఈశ్వర్ వ్యవహారం తెలిసిన తర్వాత ఏం జరిగింద గోల్డ్ బ్యాగు దొరికిన తర్వాత ఈశ్వర్ కి ఎదురైనా కష్టాలేంటి? వాటి నుండి ఎలా తప్పించుకున్నాడు? చివరికి ఈశ్వర్ ప్రేమ వ్యవహారం, బెట్టింగ్ అలవాట్లకు ముగింపు ఏంటి ? అనేది ఈ సినిమా కథ.
క్రైమ్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో మౌళి తన కామెడీ టైమింగ్‌తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసినప్పటికీ, ఓవరాల్‌గా సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. కథనంలో లోపాలు, బలవంతంగా ఇరికించినట్లు ఉండే జోకులు, స్క్రీన్ ప్లేలో వేగం లేకపోవడం సినిమాను దెబ్బతీశాయి. ఫస్ట్ హాఫ్ ఆశించిన స్థాయిలో ఎంటర్‌టైన్ చేయకపోగా, సెకండాఫ్‌లో కొన్ని సరదా సన్నివేశాలు ఉన్నప్పటికీ కథనం నిలకడగా సాగలేదు. ముగింపు, క్లైమాక్స్ కూడా ఎలాంటి బలమైన ప్రభావాన్ని చూపలేకపోయాయి.
also read:ఏపీ ప్రభుత్వంతో చేతులు కలిపిన మంచు మనోజ్ దంపతులు!
ప్లస్ పాయింట్లు :
మౌళి కామెడీ టైమింగ్, బాబ్లూ సపోర్టింగ్ యాక్ట్
సింజిత్ ఎర్రమిల్లి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
బలహీనమైన కథా కథనాలు, రొటీన్ ట్రీట్‌మెంట్
ఆకట్టుకోని ప్రథమార్థం, నెమ్మదించిన స్క్రీన్ ప్లే
బలవంతపు కామెడీ అలాగే ప్రభావం చూపని క్లైమాక్స్
రచనపరమైన లోపాలు, నిరాశపరిచే కథనం కారణంగా ఈ ‘డి.ఎన్.కె’ ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. దూరంగా ఉండటం మంచిది.
DNK Movie Review and Rating : 1.5 / 5