Hyderabad: తెలంగాణలో పలువురు సీనియర్ ఐపీఎస్‌లకు స్థానం చలనం కలిగింది. కొంతమంది ప్రాధాన్యత ఉన్నవాటిలో పోస్టింగ్ లభించగా, మరి కొందరు అంత ప్రాధాన్యం లేని శాఖలు ఇచ్చారని అనుకుంటున్నారు. ఈ క్రమంలో సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్‌పై హాట్ కామెంట్స్ చేశారు మాజీ ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావు. దీంతో ఉన్నట్లుండి అసలు ఏం జరిగిందంటూ చర్చించుకోవడం మొదలైంది.
సీనియర్ ఐపీఎస్ సజ్జనార్ గురించి చెప్పాల్సిన పని లేదు. తనకు ఏ శాఖ ఇచ్చినా అందులో లీలమైపోతారు. గతంలో రకరకాల వాటిలో బాధ్యతలు చేపట్టారు సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత ఆయన్ని ఆర్టీసీ నుంచి హైదరాబాద్ సిటీ పోలీసుకమిషనర్‌గా ప్రమోషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఆ తర్వాత ఆయన వ్యవహారశైలిపై రకరకాల వార్తలు వచ్చాయి. పెద్దగా అవేమీ ప్రభుత్వం పట్టించుకోలేదు. గురువారం జరిగిన బదిలీల్లో సజ్జనార్ పేరు ఉండడంతో ఆయన వ్యతిరేక వర్గీయులు హ్యాపీగా ఫీలయ్యారు.