E-Paper
Advertisement

రాజా శివాజీ రివ్యూ .. విజువల్స్ అద్భుతం.. కానీ

రాజా శివాజీ రివ్యూ .. విజువల్స్ అద్భుతం.. కానీ
Advertisement

Raja Shivaji Review: చత్రపతి శివాజీ … ఈ పేరు బాక్సాఫీస్ కి మాంచి సెల్లింగ్ ప్రాడక్ట్ అని స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఇక ఇదే శివాజీ పెద్ద కుమారుడు శంబాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ‘ఛావా’ దాదాపు 800 కోట్ల వసూళ్లు కొల్లగొట్టడంతో ఈ మరాఠ వీరుల సత్తా ఏంటో బాక్సాఫీస్ కి మరోసారి తెలిసొచ్చింది. దీంతో ఇదే బాటలో నడుస్తూ రితేష్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహిస్తూ నటించిన సినిమా ‘రాజా శివాజీ’. ఇక దీన్ని తన భార్య జెనీలియాతో కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించడం ఇక్కడ విశేషం. మరి ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొని ఎట్టకేలకి థియేటర్లలోకి వచ్చిన ‘రాజా శివాజీ’ ఆడియన్స్‌ని మెప్పించాడా లేదా చూద్దాం!

కథ

Advertisement

కథ విషయానికి వస్తే… ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో, ఎన్నో పుస్తకాల్లో శివాజీ గురించి తెలుసుకునే ఉన్నాం. అయితే ఇందులో 1629 (శివాజీ జననానికి ఏడాది ముందు) నుండి 1659 (అఫ్జల్ ఖాన్ మరణం) వరకు చూపించే ప్రయత్నం చేశాడు రితీష్.ఇందులో కేవలం ‘హిందవి స్వరాజ్యం’ కోసం మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించడం, ఆదిల్ షాహీలతో జరిపిన పోరాటం, అఫ్జల్ ఖాన్‌ను మట్టుబెట్టడం, గెరిల్లా యుద్ధ తంత్రాలతో శత్రువులను ముప్పుతిప్పలు పెట్టడం వంటి తెలిసిన అంశాలతోనే ఈ కథ సాగుతుంది.అయితే ఈ కథకి మించి ఇంకేమైనా, కొత్తగా ఏమైనా ఉంటుందేమో అని ఆశపడితే మాత్రం అది ప్రేక్షకుడి తప్పవుతుంది.

విశ్లేషణ

Advertisement

శివాజీగా రితేష్ దేశ్‌ముఖ్ బాగానే కష్టపడ్డాడు. అందులో నో డౌట్. ఆయన డైలాగ్ డెలివరీ బాగున్నప్పటికీ, కొన్ని సీన్లలో ఆ పాత్రకు ఉండాల్సిన గాంభీర్యం కంటే రితేష్ వ్యక్తిగత ఇమేజ్ ఎక్కువగా కనిపిస్తుంది.అఫ్జల్ ఖాన్‌గా సంజయ్ దత్ క్రూరత్వం సినిమాకు పెద్ద అసెట్. అభిషేక్ బచ్చన్ (సంభాజీగా), జెనీలియా (సాయిబాయిగా), భాగ్యశ్రీ (జిజాబాయిగా) తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఇక అన్నింటికన్నా సినిమాకి హైలెట్‌గా చెప్పుకోవాల్సింది సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్‌లా ఉందంటే ఆశ్చర్యం లేదు. ఇక అజయ్–అతుల్ సంగీతం కూడా పర్లేదనిపించే స్థాయిలోనే సాగుతుంది.కానీ, విద్యా బాలన్, అభిషేక్ బచ్చన్ వంటి స్టార్లను కేవలం పోస్టర్ల కోసం వాడుకున్నారా అన్నట్టుగా వారి పాత్రలకు అంత ఇంపార్టెన్స్ లేకపోవడం గమనార్హం.ఇక సంగీతం బాగున్నా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్లలో మరీ లౌడ్‌గా, చెవులకు ఇబ్బంది కలిగించేలా ఉంది. ఈ సినిమా డ్యూరేషన్ 3 గంటలకు పైగా ఉండటం అతిపెద్ద మైనస్. ఎడిటర్ ఊర్వశి సక్సేనాకు కత్తెర వేయడం మర్చిపోయారేమో కాబోలు.

ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో చాలా సీన్లు సాగిపోతూ ఆడియన్స్ పేషన్స్ కి పెద్ద టెస్ట్ పెడతాయి. ఇది మరాఠీ నేటివిటీతో తీసిన సినిమా అని క్లియర్‌గా తెలిసిపోతుంది. అందుకే తెలుగు డబ్బింగ్‌లో ఆ ఫీల్ మిస్ అయింది. కొన్ని డైలాగులైతే ఏకంగా మరాఠీలోనే ఉండటం వల్ల సామాన్య ప్రేక్షకుడికి అర్థం కావడం కష్టం.ఇక నటుడిగా డిస్టింక్షన్‌లో పాస్ అయిన రితేష్ దేశ్‌ముఖ్ దర్శకుడిగా మాత్రం తడబడ్డాడనే చెప్పాలి. ఒక భారీ హిస్టారికల్ సినిమాని నడిపించడంలో కావాల్సిన పట్టు ఆయనలో కనిపించదు.

ముఖ్యంగా ఎన్ని వార్ సీన్స్ ఉన్నా, ఎంత ఎలివేషన్ ఇచ్చినా వాటి మధ్య ఉండే ఎమోషన్ చాలా ఇంపార్టెంట్. రితీష్ సరిగ్గా ఇక్కడే ఫెయిల్ అయ్యాడు. యుద్ధ సన్నివేశాలపై పెట్టిన శ్రద్ధ, పాత్రల మధ్య ఉండాల్సిన ఎమోషనల్ బాండింగ్ పై పెట్టలేదు. దీనివల్ల శివాజీ మహారాజ్ కష్టాలు పడుతున్నప్పటికీ ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోతారు.

ప్లస్ పాయింట్స్

• రితేష్ దేశ్‌ముఖ్ నటన
• సినిమాటోగ్రఫీ
• ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్

• రితేష్ దేశ్‌ముఖ్ దర్శకత్వం
• 3 గంటల నిడివి
• ఎమోషన్ పండకపోవడం

చివరిగా

ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా రిచ్‌గా ఉన్నాయి. జెనీలియా ఖర్చు విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా కుమ్మరించింది. కానీ, ‘మేకింగ్ పై ఉన్న ఆ శ్రద్ధనే… మ్యాటర్ పై పెడితే మరింత బాగుండేది’.చివరిగా చెప్పాలంటే ‘రాజా శివాజీ’ కేవలం విజువల్స్ చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే బెస్ట్ ఆప్షన్. ఇక భారీ యాక్షన్ సీక్వెన్స్, శివాజీ హిస్టరీ అంటే ఇష్టపడేవారు కూడా ఓసారి చూసేయొచ్చు. ఎటొచ్చి సినిమా సరికొత్తగా, స్పీడ్‌గా పరిగెత్తాలి అనుకునేవారికి మాత్రం అస్సలు రుచించదు.

rajaa shivaji review and rating 2.25/5

also read :రెబలోడి ఫ్యాన్స్ కి పెద్ద షాక్ .. సీక్వెల్ లో ‘కల్కి’ ఉండడా?

Related News

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

The Odyssey Review: ‘ది ఒడిస్సీ’ రివ్యూ. థియేటర్లు బద్దలు.. ప్రపంచాన్నే ఊపేస్తోన్న నోలన్ మూవీ!

Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ.. కష్టం అఖిల్‌ది.. కన్ఫ్యూజన్ డైరెక్టర్‌ది !

I-Nobody Review :’ఐ నోబడీ’ మూవీ రివ్యూ..

రావు బహదూర్ రివ్యూ.. గెటప్ మార్చిన సత్యదేవ్ సక్సెస్ అయ్యారా?

బేబీ హీరో ‘ గుర్తుకొస్తున్నాయ్ ‘వెబ్ సిరీస్ రివ్యూ.. ఆ రేంజ్ సక్సెస్ లభించిందా?

Nagabandham Review: ‘నాగబంధం’ రివ్యూ.. గ్రాఫిక్స్ గిన్నెలో ఉడకని పప్పు !

Big Stories

Advertisement
×