E-Paper
Advertisement

వాచ్‌లోనే గూగుల్ మ్యాప్స్, వాట్సాప్.. Fire-Boltt Oracle 4G స్మార్ట్‌వాచ్ ఫుల్ రివ్యూ!

వాచ్‌లోనే గూగుల్ మ్యాప్స్, వాట్సాప్.. Fire-Boltt Oracle 4G స్మార్ట్‌వాచ్ ఫుల్ రివ్యూ!
Advertisement

Fire-Boltt Oracle: స్మార్ట్‌వాచ్ అంటే కేవలం టైమ్ చూసుకోవడానికో లేదా నోటిఫికేషన్స్ చెక్ చేయడానికో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మార్కెట్లోకి వచ్చిన Fire-Boltt Oracle స్మార్ట్‌వాచ్ కాదు.. అచ్చంగా మీ చేతికి తగిలించుకునే ఒక మినీ స్మార్ట్‌ఫోన్ . కేవలం రూ. 2,999 ఆఫర్ ధరలోనే 4G LTE సిమ్ కార్డ్ సపోర్ట్, గూగుల్ ప్లే స్టోర్, వైఫై, జీపీఎస్ వంటి అల్ట్రా-మోడ్రన్ ఫీచర్లతో లభిస్తున్న ఈ డివైజ్ ఇప్పుడు టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. మరి దీని అసలు ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా?

వాచ్‌లోనే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ :

ఈ స్మార్ట్‌వాచ్ ప్రత్యేకత ఏంటంటే.. ఇది సాధారణ ఫిట్‌నెస్ బ్యాండ్‌లా కాకుండా ప్రాపర్ Android OSపై రన్ అవుతుంది. దీని వల్ల మీరు గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి మీకు నచ్చిన అప్లికేషన్స్‌ను డైరెక్ట్‌గా వాచ్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే.. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్, జోమాటో లేదా క్యాబ్ బుకింగ్ యాప్స్.. ఇలా వేటినైనా నేరుగా మీ చేతిపైనే రన్ చేయొచ్చు.

డైరెక్ట్ 4G LTE సిమ్ సపోర్ట్ , వైఫై :

Advertisement

ఈ వాచ్‌లో నానో సిమ్ వేసుకునే అవకాశం ఉంది. దీని వల్ల మీ స్మార్ట్‌ఫోన్ ఇంట్లో మర్చిపోయినా సరే.. ఈ వాచ్ ద్వారానే డైరెక్ట్ కాల్స్ మాట్లాడవచ్చు, ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఇందులో ఇన్‌బిల్ట్ వైఫై కూడా ఉండటం వల్ల ఇంట్లోని రౌటర్‌కు కనెక్ట్ చేసి హై-స్పీడ్ డౌన్‌లోడ్స్ చేసుకోవచ్చు.

అదిరిపోయే లార్జ్ డిస్‌ప్లే & డిజైన్ :

ఈ స్మార్ట్‌వాచ్ 1.96-ఇంచ్ పవర్‌ఫుల్ IPS HD స్క్రీన్‌తో వస్తుంది. దీని 600 నిట్స్ బ్రైట్‌నెస్ వల్ల ఎండలో బయట తిరుగుతున్నప్పుడు కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. రౌండ్ క్రౌన్ బటన్, మెటాలిక్ ఫినిషింగ్ లుక్ , డ్యూరబుల్ సిలికాన్ స్ట్రాప్స్ దీనికి ఒక ప్రీమియం లగ్జరీ వాచ్ లుక్‌ను తీసుకువస్తాయి.

పవర్‌ఫుల్ ప్రాసెసర్ & బ్యాటరీ ప్యాక్:

Advertisement

ఒక ఫోన్‌కు ఉండేలాగే ఇందులో క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2GB RAM, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. దీని వల్ల వాచ్ హ్యాంగ్ అవ్వకుండా స్మూత్‌గా రన్ అవుతుంది. ఇందులో.. అమర్చిన భారీ 700 mAh బ్యాటరీ నార్మల్ యూసేజ్ మీద మంచి బ్యాకప్ ఇస్తుంది. అయితే సిమ్ , వైఫై కంటిన్యూగా వాడితే మాత్రం రోజు చివర్లో ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

హెల్త్ ట్రాకర్స్, జీపీఎస్ సపోర్ట్:

ఇందులో రియల్-టైమ్ హార్ట్ రేట్ మానిటర్, స్టెప్ కౌంటర్, మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఇందులో ఇన్‌బిల్ట్ జీపీఎస్ ఉంది. మీరు రన్నింగ్ వెళ్లినప్పుడు లేదా కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు మొబైల్ లేకుండానే.. గూగుల్ మ్యాప్స్ ద్వారా దారి తెలుసుకోవచ్చు.

కేవలం రూ. 2,999 బడ్జెట్‌లో ఒక పూర్తి స్థాయి స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను వాచ్ రూపంలో అనుభవించాలనుకుంటే.. Fire-Boltt Oracle ను మించిన బెస్ట్ ఆప్షన్ మార్కెట్లో లేదు. బడ్జెట్ ధరలో ఒక క్రేజీ గ్యాడ్జెట్ కొనాలనుకునే.. కాలేజీ స్టూడెంట్స్, టెక్ లవర్స్‌కి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

Related News

రూ. 5వేలలోపు బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఈ క్రేజీ ల్యాప్‌టాప్ చూస్తే..మ్యాక్‌బుక్‌ను కూడా పక్కన పెట్టేస్తారు!

రూ. 2,799 కే అదిరిపోయే డిస్కో స్పీకర్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

సముద్రపు సొరచేపలు.. టెక్నాలజీకి గొప్ప వరం.. ఈ ఆవిష్కరణలు చూస్తే మైండ్ బ్లాకే!

Whatsappలో కొత్త ఫీచర్.. ఇక మీ భార్య చేతిలో తన్నులు తినక్కర్లేదు!

తక్కువ బడ్జెట్‌లో ఇయర్ బడ్స్..ఆఫర్ ఉన్నప్పుడే కొనేయండి

ఈ ఇయర్‌బడ్స్.. చూస్తే ఫిదా అయిపోతారంతే !

Big Stories

Advertisement
×