E-Paper
Advertisement

ఈ క్రేజీ ల్యాప్‌టాప్ చూస్తే..మ్యాక్‌బుక్‌ను కూడా పక్కన పెట్టేస్తారు!

ఈ క్రేజీ ల్యాప్‌టాప్ చూస్తే..మ్యాక్‌బుక్‌ను కూడా పక్కన పెట్టేస్తారు!
Advertisement

HP OmniBook X 14 : చాలా కాలంగా విండోస్ ల్యాప్‌టాప్స్ అంటే బ్యాటరీ త్వరగా అయిపోతుందని, హీట్ అయిపోతాయని చాలామంది మ్యాక్‌బుక్ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తూ మార్కెట్లోకి దూసుకొచ్చింది HP OmniBook X 14. సరికొత్త స్నాప్‌డ్రాగన్ X ఎలైట్ ప్రాసెసర్ , పవర్‌ఫుల్ ఏఐ ఫీచర్లతో వచ్చిన ఈ ల్యాప్‌టాప్ ధర ప్రస్తుతం మార్కెట్లో దాదాపు రూ. 1,09,999 గా ఉంది. ప్రీమియం లుక్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్‌తో వచ్చిన ఈ ల్యాప్‌టాప్ నిజంగానే మిమ్మల్ని మ్యాక్‌బుక్ నుంచి విండోస్ వైపు తిప్పుకుంటుందా? దీని ఫీచర్ల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం

HP OmniBook X 14 పూర్తి రివ్యూ:

ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్‌కు పోటీగా ఒక మంచి ప్రీమియం విండోస్ ల్యాప్‌టాప్ కావాలని.. ఎదురుచూసే వాళ్లకు హెచ్‌పీ ఒక అదిరిపోయే ఆప్షన్ ఇచ్చింది. అదే హెచ్‌పీ ఓమ్నీబుక్ ఎక్స్ 14 . కేవలం పేరు మార్చడమే కాదు, దీని లోపల ఉన్న టెక్నాలజీని కూడా పూర్తిగా మార్చేసింది హెచ్‌పీ. ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకతలేంటంటే..

స్నాప్‌డ్రాగన్ ‘ఎక్స్ ఎలైట్’ పవర్:

Advertisement

సాధారణంగా విండోస్ ల్యాప్‌టాప్‌లలో ఇంటెల్ లేదా ఏఎండి ప్రాసెసర్లు చూస్తుంటాం. కానీ ఈ ఓమ్నీబుక్‌లో సరికొత్త ఆర్మ్-బేస్డ్ ప్రాసెసర్‌ను వాడారు. దీని వల్ల ల్యాప్‌టాప్ స్పీడ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. మీరు ఎన్ని హెవీ సాఫ్ట్‌వేర్లు రన్ చేసినా, ఒకేసారి 20-30 క్రోమ్ ట్యాబ్‌లు ఓపెన్ చేసినా ఎక్కడా ల్యాగ్ అనేది కనిపించదు. ఈ విషయంలో ఇది ఆపిల్ M3 చిప్‌సెట్‌కు గట్టి పోటీ ఇస్తుంది.

నిద్రపోని బ్యాటరీ లైఫ్ :

విండోస్ ల్యాప్‌టాప్‌ల ప్రధాన శాపం బ్యాటరీ లైఫ్. కానీ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ పుణ్యమా అని ఈ ల్యాప్‌టాప్ బ్యాటరీ బ్యాకప్ విషయంలో.. అద్భుతాలు సృష్టిస్తోంది. హెచ్‌పీ చెప్తున్న దాని ప్రకారం ఇది ఒక్క సారి ఛార్జ్ చేస్తే ఏకంగా 26 గంటల వరకు నాన్‌స్టాప్ వీడియో ప్లేబ్యాక్ ఇస్తుంది. అంటే నార్మల్ ఆఫీస్ యూసేజ్‌లో ఈ ల్యాప్‌టాప్‌ను చార్జర్ లేకుండానే రెండు రోజుల పాటు హ్యాపీగా వాడుకోవచ్చు.

ఏఐ ఫీచర్లు :

Advertisement

ఇది ఒక నెక్స్ట్ జనరేషన్ ‘Copilot+ PC’.అంటే ఇందులో మైక్రోసాఫ్ట్ కంపెనీకి చెందిన ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఇన్‌బిల్ట్‌గా వస్తాయి. మీరు ఆన్‌లైన్ మీటింగ్స్‌లో ఉన్నప్పుడు మీ బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేయడం, వాయిస్‌ను క్లియర్ చేయడం మాత్రమే కాకుండా, ‘రికాల్’, రియల్-టైమ్ లైవ్ క్యాప్షన్స్ వంటి ఫీచర్లు మీ పనిని చాలా తేలిక చేస్తాయి. దీనిలోని పవర్‌ఫుల్ NPU ఏఐ టాస్క్‌లను క్షణాల్లో పూర్తి చేస్తుంది.

ప్రీమియం లుక్ ,డిస్‌ప్లే క్వాలిటీ :

చూడటానికి ఈ ల్యాప్‌టాప్ చాలా స్లిమ్‌గా, కేవలం 1.34 కేజీల బరువుతో అల్ట్రా-పోర్టబుల్‌గా ఉంటుంది. దీని అల్ట్రా-థిన్ అల్యూమినియం బాడీ చేతిలో పట్టుకుంటే చాలా లగ్జరీ ఫీల్ ఇస్తుంది. ఇక 14-ఇంచుల 2.2K డిస్‌ప్లే క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. దీని కలర్ ప్రొడక్షన్ చాలా బాగుంటుంది కాబట్టి ఫోటో, వీడియో ఎడిటర్లకు ఇది చక్కగా సరిపోతుంది.

Tags

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×