E-Paper
Advertisement

అపార్ట్మెంట్లో ఉండే ప్రతీ ఒక్కరూ చూడాల్సిన సిరీస్… యూనిక్ కొరియన్ క్రైమ్ కామెడీ డ్రామా

అపార్ట్మెంట్లో ఉండే ప్రతీ ఒక్కరూ చూడాల్సిన సిరీస్… యూనిక్ కొరియన్ క్రైమ్ కామెడీ డ్రామా
Advertisement

Korean mystery series: సిటీలలో రోజురోజుకూ అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోతోంది. అయితే ఇలాంటి ప్లేస్ లో ఇల్లు ఉండడం అంటే సేఫ్ అండ్ సెక్యూర్ అని అనుకుంటున్నారు చాలామంది. కానీ అక్కడ కనిపించని కష్టాలు చాలానే ఉంటాయి. అలా కష్టాలు పడుతున్న వారి పాలిట ఓ విలన్ దేవుడైతే ఎలా ఉంటుందో తెలియాలంటే ‘ది అపార్ట్‌మెంట్ జాబ్’ (The Apartment Job) అనే ఈ సిరీస్ ను చూడాల్సిందే. డబ్బు కోసం దొంగగా వచ్చిన గ్యాంగ్‌స్టర్… అనుకోకుండా ఎలా హీరో అయ్యాడు ? ఈ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఒకప్పుడు పెద్ద అండర్‌వరల్డ్ గ్యాంగ్‌కు లీడర్‌ పార్క్ హే-గాంగ్. అతని జీవితంతోనే కథ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటాడు అతను. అలాంటి టైమ్ లో తన జీవితంలో తండ్రిలాంటి ఒక ముఖ్యమైన వ్యక్తిని కాపాడుకోవడానికి భారీ మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. ఈ క్రమంలో కొత్తగా నిర్మించిన ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ లో సుమారు 10 బిలియన్ వోన్ల ( అంటే 1000 కోట్ల కొరియన్ కరెన్సీ) భారీ రిపేర్/రిజర్వ్ ఫండ్ దాగి ఉన్నాయనే రహస్య సమాచారం అతనికి అందుతుంది.

Advertisement

ఎలాగైనా ఆ అపార్ట్‌మెంట్ నిధులను దొంగిలించాలని హే-గాంగ్ ఒక క్రేజీ ప్లాన్ వేస్తాడు. కానీ ఆ నిధులను దక్కించుకోవాలంటే దొంగతనం చేస్తే సరిపోదని గ్రహిస్తాడు. అందుకే ఆ అపార్ట్‌మెంట్ రెసిడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయడానికి నామినేషన్ వేస్తాడు. ఒక మాజీ గ్యాంగ్ లీడర్ సాధారణ కాలనీ ప్రెసిడెంట్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు గుల్ కామెడిగా ఉంటాయి. అతనొక్కడే కాదు… హే-గాంగ్‌కు హాన్ హా-నా అనే యంగ్ న్యాయవాది కూడా తోడవుతుంది.

వీళ్ళంతా కలిసి అపార్ట్‌మెంట్‌లోకి చొరబడి నిధులను దొంగిలించడానికి ప్లాన్ చేస్తారు. కానీ ఆ బిల్డింగ్‌లోని పవర్‌ఫుల్ ఫ్యామిలీ, ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ కలిసి చేస్తున్న భారీ అవినీతి స్కామ్ గురించి వీళ్ళకు తెలిసిపోతుంది. తాను దోచుకోవాలనుకున్న అపార్ట్‌మెంట్ ప్రజలే ఆ అవినీతి తిమింగలాల వల్ల దారుణంగా మోసపోతున్నారని హే-గాంగ్ కు అర్థం అవుతుంది. తన స్వార్థపూరిత దొంగతనాన్ని పక్కనపెట్టి, తోటి నివాసితుల తరఫున నిలబడి ఆ భారీ కార్పొరేట్ అవినీతిపై పోరాటం షురూ చేస్తాడు. మరి ఆ పోరాటం ఎలా సాగింది ? అసలు హీరో దొంగ పెళ్లి ఎందుకు చేసుకున్నాడు ? తనకు కావాల్సిన వ్యక్తిని హీరో కాపాడుకున్నాడా లేదా ? చివరికి ఏమైంది ? అన్నది కథ.

తెలుగులో స్ట్రీమింగ్ అవుతోందా ?

Advertisement

Netflixలో జూలై 11 నుండి స్ట్రీమింగ్ అవుతున్న కొరియన్ కామెడీ క్రైమ్ మిస్టరీ సిరీస్ ‘ది అపార్ట్‌మెంట్ జాబ్’. జో యాంగ్-వాన్ దర్శకత్వంలో JTBC నెట్‌వర్క్ నిర్మించింది. ఈ 12 ఎపిసోడ్ల సిరీస్‌లో జి సంగ్, యూన్-క్యుంగ్ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు డబ్బింగ్ ఇంకా అందుబాటులో లేదు.

Read Also: 40 రోజులు నలుగురు పిల్లలు మిస్సింగ్… అమెజాన్ అడవుల్లో అదిరిపోయే అడ్వెంచర్

Tags

Related News

వయసు 50 దాటినా యాక్షన్‌లో తగ్గేదేలే… పాత గూఢచారులు మళ్లీ రంగంలోకి… అదిరిపోయే కొరియన్ యాక్షన్ కామెడీ సిరీస్

కాబోయే భార్యకు కుక్కలంటే అలర్జీ… ప్రాణంగా పెంచుకున్న పెట్‌ను ఏం చేశాడంటే ? డాగ్ లవర్స్ డోంట్ మిస్

గ్రామంపై భారీ కొండచిలువ దాడి.. దాన్ని చంపేందుకు 3 రోజుల డెడ్‌లైన్… చైనీస్ మాన్‌స్టర్ థ్రిల్లర్ తెలుగులో

గతం మర్చిపోయిన సూపర్ హీరో… పట్టిస్తే భారీ నజరానా… ఈ సిరీస్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు

వందల అడుగుల ఎత్తులో ప్రాణాలతో పోరాటం… ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెడితే ఇదా బహుమతి ? ఈ సర్వైవల్ థ్రిల్లర్ నెక్స్ట్ లెవల్

ప్రాణంగా ప్రేమించిన వాడిని పొట్టన పెట్టుకునే వైరస్… కన్నీళ్ళు పెట్టించే ఎమోషనల్ లవ్ స్టోరీ

భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

Big Stories

Advertisement
×