Dance Dispute:సద్దుమణిగిందనుకున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ల పంచాయితీ మరింత ముదిరినట్టే కనిపిస్తుంది.నిన్నటికి నిన్న మా మధ్య ఎలాంటి గొడవ లేదు,అంతా టీ కప్పులోనే తుఫాను,త్వరలోనే సర్దుకుంటుంది అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు జానీ మాస్టర్ .దీంతో ఇరు వర్గాలమధ్య గొడవ సద్దుమనిగినట్టే కనిపించింది కూడా.కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తే వివాదం సద్దుమనగడం కాదు.మరింత ముదిరి డాన్సర్స్ అసోసియేషన్ రెండుగా చీలిపోయినట్టే కనిపిస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణం తెరవెనుక నడిచే రెమ్యూనరేషన్ల వ్యవహారమే అని ట్రేడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది.
బడా ప్రాజెక్టు షూటింగ్ పై ప్రభావం
నిర్మాతల నుంచి భారీగా వసూలు చేస్తున్న ఇన్చార్జీలు కష్టపడే డాన్సర్లకు మాత్రం తగ్గించి ఇస్తున్నారు అంటూ ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి ఇక ఈ వ్యవహారం ఇలాగే ముదిరితే రాబోయే బడా ప్రాజెక్టు షూటింగ్లపై దీని ప్రభావం పడుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ పెద్దలు.ఇక ఈ వివాదం ముదురుతుండటంతో మెగాస్టార్ చిరు రంగంలోకి దిగక తప్పలేదు.
also read :అయ్యగారి ఖాతాలో 100 కోట్ల సినిమా పడ్డట్టేనా ?
రెండు వర్గాల వాదనలను విన్న చిరు పంచాయతీని తెలుగు ఫిలిం ఫెడరేషన్ కి బదిలీ చేసినట్టు తెలుస్తుంది.ఇక రంగంలోకి దిగిన ఫెడరేషన్ ప్రతినిధులు రెండు వర్గాల ముఖ్యమైన నేతలతో చర్చలు జరుపుతున్నారు .రెమ్యూనరేషన్ వ్యవహారంలో ట్రాన్స్ఫరెన్సీ ఉండాలని ,డాన్సర్ల పొట్ట కొడితే చూస్తూ ఊరుకునేది లేదంటూ ఫెడరేషన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది.ఇక ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లుగా చలామవుతున్న ఈ ఇద్దరి మధ్య కేవలం రెమ్యూనరేషన్లు మాత్రమే కాకుండా యూనియన్ లో అగ్రస్థానం కోసం జరుగుతున్న ఆధిపత్య పోరని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి.
ఎప్పుడు గాడిలో పడుతుందో
ఇక ప్రస్తుతం చిరంజీవి జోక్యం చేసుకోవడంతో రెండు వర్గాలు కాస్త వెనక్కి తగినట్లే కనిపిస్తున్నా, లోపల మాత్రం రెండు వర్గాలు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుతున్నారట .మరోవైపు ఒకరి క్యాంపు లోని డాన్సర్లని మరో క్యాంప్ తాము చేసే పాటల్లోకి తీసుకోకుండా రూల్స్ పెట్టుకునే స్థాయికి పరిస్థితి వెళ్లిందని ఇన్సైడ్ టాక్ .ఇక ప్రస్తుతానికి తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులు రెండు గ్రూపులతో సమావేశం నిర్వహించి ఒక కామన్ ఫార్ములా సిద్ధం చేసే పనిలో పడ్డారని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్.
also read :స్పీడ్ పెంచుతున్న సుక్కు ..వచ్చే ఏడు దసరా బరిలో దిగనున్న చరణ్ ?
వాలకం చూస్తుంటే అటు శేఖర్ మాస్టర్,ఇటు జానీ మాస్టర్ పంతం చూస్తుంటే ఇష్యూ అంత తేలిగ్గా సద్దుమనిగి పోయేలా కనిపించడం లేదు .చూడాలి మరి టాలీవుడ్ పెద్దలు,ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులు కలిసి ఈ వివాదానికి ఎప్పుడు ఎలా ఎండ్ కార్డ్ వేస్తారో ..డాన్సర్స్ అసోసియేషన్ మునుపటిలా మళ్లీ ఎప్పుడు గాడిలో పడుతుందో కాలమే నిర్ణయించాలి!