కర్పూరం బిళ్ళలతో హారతి ఇచ్చాకే ఆ పూజ పూర్తయినట్టు. ఇంట్లో ఇలా కర్పూరం వెలిగించడం వల్ల వాస్తు శాస్త్రం ప్రకారం ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కర్పూరం ప్రతిరోజూ ఇంట్లో వెలిగించాల్సిందే. దీనివల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అయితే వైద్య శాస్త్రం కూడా కర్పూరం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వివరిస్తోంది. ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ ఇచ్చాము.
వాస్తు దోషాలు
ఇంట్లో రోజూ కర్పూరం వెలిగించడం వల్ల అదే వాస్తు దోషాలను తొలగిస్తుంది. వాస్తు దోషాలు తొలగిపోతే ఆ ఇల్లు ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. అదృష్టం పెరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు కర్పూరం వెలిగించడం మంచిది.
సానుకూల శక్తి
ప్రతిరోజు కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం వల్ల మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడం వల్ల కుటుంబ సభ్యుల జీవితాలు కూడా మెరుగుపడతాయి. అందరూ ఆనందంగా సంతోషంగా జీవిస్తారు.
ఆర్థికంగా కలిసొస్తుంది
కర్పూరం ఎంతో శక్తివంతమైనది. దీని సువాసన ఇంట్లోని ప్రతి మూలకు వ్యాపిస్తుంది. దీన్ని ప్రతిరోజు వెలిగించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంట్లో సంపద పెరుగుతుంది. కాబట్టి కర్పూరం బిల్లలతో ప్రతిరోజూ హారతి ఇచ్చేందుకు ప్రయత్నించండి. ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తూ ఉండండి.
దిష్టి తగలకుండా
కొందరి చూపు చెడు ప్రభావాలను చూపిస్తుంది. చెడు కన్ను నుండి మీ ఇంటిని, ఇంట్లోని సభ్యులను కాపాడుకోవాలంటే కర్పూరమే ప్రభావవంతమైన పరిహారం. హారతి కర్పూరం వెలిగించాక లవంగాలను అందులో వేసి కాల్చడం వల్ల ఆసక్తి మరింతగా పెరుగుతుంది. మీ ఇంటికి ఉన్న దిష్టిని మీ ఇంట్లో వారిపై పడిన చెడు కన్నును ఇది తొలగిస్తుంది. ఇంట్లోని ప్రతికూల శక్తి బయటకు పోతుంది. మీ ఇంటిని శుభ్రపరిచేందుకు ఇలా ప్రతిరోజు ఇంట్లో కర్పూరాన్ని వెలిగించేందుకు ప్రయత్నించండి.
గ్రహాలపై ప్రభావం
కొన్ని గ్రహాలు చెడు స్థితిలో ఉండడం వల్ల కొంతమంది ఇబ్బందులు గురవుతారు. అలాంటివారు ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల ఇబ్బందులను తగ్గించుకోవచ్చు. గృహప్రభావాలు జీవితంలో అనేక సవాళ్లు విసురుతాయి. ఇంట్లో రోజు కర్పూరం వెలిగించడం వల్ల దానికి పరిహారం చేసినట్టు అవుతుంది. పరిస్థితి ప్రశాంతంగా మారుతుంది.