Lokesh Kanagaraj: మానగరం సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు లోకేష్ కనకరాజ్. సందీప్ కిషన్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. మొదటి సినిమాతోనే తన టెక్నికల్ బ్రిలియన్స్ అందరికీ చూపించాడు లోకేష్. ఆ సినిమా తర్వాత చేసిన ఖైదీ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఈ సినిమా సక్సెస్ అయిన వెంటనే స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా మాస్టర్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది.
ఆల్మోస్ట్ కమల్ హాసన్ పని అయిపోయింది అని కామెంట్స్ వస్తున్న తరుణంలో విక్రమ్ అనే ప్రాజెక్ట్ చేసి అద్భుతమైన సక్సెస్ అందించడు లోకేష్. ఆ సినిమా దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. లియో సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఇక రీసెంట్ గా రజనీకాంత్ హీరోగా చేసిన కూలీ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించలేదు.
మల్టీ స్టారర్ పోయింది
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు కమల్ హాసన్ హీరోలుగా ఒక సినిమా జరగబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు లోకేష్ చేతిలో నుంచి జారిపోయింది. వీరిద్దరితో సినిమా చేయడానికి స్టార్ హీరోలను సంప్రదించాడు లోకేష్. కానీ కూలి సినిమా ఊహించిన సక్సెస్ సాధించకపోవడంతో స్టార్ హీరోస్ ఈ ప్రాజెక్టును రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.
మరోవైపు ఇదే ప్రాజెక్ట్ నెల్సన్ చేస్తాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక లోకేష్ గురించి పలు రకాల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక లోకేష్ ట్విట్టర్లో కమల్ హాసన్ మరియు రజినీకాంత్ ను అన్ ఫాలో చేశాడు. వీళ్లను అన్ ఫాలో చేయడంతో వస్తున్న వార్తలకు కాస్త బలం చేకూరింది.
ఖైదీ తో కం బ్యాక్
లోకేష్ కనకరాజ్ వర్క్ గురించి మాట్లాడుకుంటే అందరికీ విపరీతంగా నచ్చే సినిమా ఖైదీ. ఒక రాత్రి ప్రయాణాన్ని అద్భుతంగా చూపించాడు. అయితే విక్రమ్ సినిమా వచ్చిన తర్వాత ఖైదీ వాల్యూ మరింత పెరిగింది. కేవలం హాలీవుడ్ లో మాత్రమే ఉండే సినీమాటిక్ యూనివర్స్ తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం చేశాడు లోకేష్.
ఇక ప్రస్తుతం కార్తీ హీరోగా ఖైదీ 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుతో లోకేష్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తాడు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే మళ్లీ స్టార్ హీరోలతో లోకేష్ సినిమా చేసే అవకాశం ఉంది. లోకేష్ ఆ స్టార్ హీరోలను అన్ ఫాలో చేయడం వెనక అసలైన కారణం ఏంటో మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం కూడా ఉంది.
Also Read: Rahul Ravindran : ప్రీ వెడ్డింగ్ షో సినిమాపై రాహుల్ రవీంద్రన్ రియాక్షన్ , ఇది నీ గ్రేట్నెస్ బాస్