Maganti Gopinath: మాగంటి గోపీనాథ్ మరణంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే విచారణ ప్రారంభిస్తామని అన్నారు. మాదాపూర్ పీఎస్ లో కానీ.. డీజీపీకి కానీ ఫిర్యాదు చేయాలని సీఎం తెలిపారు. ఆరోపణలు ఒక్కటే చేస్తే సరిపోదని అన్నారు. మాగంటి తల్లి.. కేటీఆర్ పై ఆరోపణలు చేసినట్టు తనకు తెలిసిందని అన్నారు. ఒక మరణాన్ని వివాదాస్పదం చేసి.. రాజకీయ లబ్ధి పొందాలని తాను అనుకోనని చెప్పుకొచ్చారు. బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే విచారణ ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అంతకు ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ మాగంటి గోపీనాథ్ మరణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌లో మాగంటి గోపినాథ్ గొడవ మొదలైందన్నారు. కుమారుడి మరణం మిస్టరీ అని సొంత తల్లి చెబుతోందని గుర్తుచేశారు. ఆసుపత్రిలో ఉన్న కొడుకుని చూడనివ్వలేదంటే.. మాగంటి తల్లి ఎంత నరకయాతన అనుభవించి ఉంటోందో అర్థం చేసుకోవాలన్నారు. తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనకుండా ఎవరైనా కొడుకుని అడ్డుకుంటారా అంటూ బీఆర్ఎస్ నేతల తీరుపై బండి సంజయ్ మండిపడ్డారు. మాగంటి మరణంపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
ALSO READ: Jubilee Hills: మాగంటి డెత్ మిస్టరీ.. జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ చీప్ పాలిటిక్స్.. మరీ ఇంత దిగజారాలా..?
మాగంటి కుటుంబంలో నెలకొన్న ఈ తీవ్రమైన వివాదం, కుమారుడి మిస్టరీ మరణం ఆరోపణలు, అలాగే తండ్రి అంత్యక్రియల్లో కుమారుడిని అడ్డుకోవడం వంటి అంశాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. అందుకే.. ఈ వ్యవహారం వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీయడానికి ప్రభుత్వం తక్షణమే విచారణకు ఆదేశించాలని బండి సంజయ్ చెప్పారు. ఈ కుటుంబ కలహాన్ని బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తోందని..తక్షణం జోక్యం చేసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మరింత వేడిని రాజేసిందని చెప్పవచ్చు.
ALSO READ: Jubilee Hills By Elections: మాగంటి తల్లి ఆరోపణలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: మంత్రి సీతక్క