BigTV English

Amazon Great Indian Festival Sale 2024: అమెజాన్ న్యూ సేల్.. వీటిపై 80 శాతం వరకు డిస్కౌంట్, దంచుడే దంచుడు!

Amazon Great Indian Festival Sale 2024: అమెజాన్ న్యూ సేల్.. వీటిపై 80 శాతం వరకు డిస్కౌంట్, దంచుడే దంచుడు!

Amazon Great Indian Festival Sale 2024: ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈ – కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్‌ తాజాగా అదిరిపోయే సేల్‌ను ప్రకటించింది. త్వరలో రాబోతున్న దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలను దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన సేల్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024’ను అఫీషియల్‌గా ప్రారంభించింది. ఈ సేల్‌ ద్వారా కస్టమర్లు అనేక ఆఫర్లు పొందవచ్చని కంపెనీ తెలిపింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ వస్తువులపై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లు లభించనున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ సేల్ కింద ఎలక్ట్రానిక్స్ నుండి హోమ్‌కి సంబంధించిన వస్తువుల వరకు వినియోగదారులకు బంపర్ డిస్కౌంట్లు అందించబడతాయని పేర్కొంది. కాబట్టి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అనేది ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2024 సేల్‌తో సమానంగా ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అంటే సెప్టెంబర్ 27 నుంచి ఇది వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అదే సమయంలో ప్లస్ సభ్యుల కోసం సెప్టెంబర్ 26న ప్రత్యక్ష ప్రసారం అవుతుందని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అమెజాన్‌ ఇంకా వెల్లడించలేదు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్ల విషయానికొస్తే.. ఈ సేల్ సమయంలో ఎంపిక చేసిన వస్తువులపై 80% వరకు తగ్గింపు లభిస్తుంది.

ఇందులో ఎలక్ట్రానిక్స్, హోమ్ ప్రొడెక్ట్స్, కిరాణా, బుక్స్, డిజిటల్ ప్రొడెక్ట్స్ వంటివి కొనుక్కోవచ్చు. అంతేకాకుండా వీటిని డిస్కౌంట్‌లతో పాటు, బ్యాంకుల నుండి ప్రత్యేక ఆఫర్‌ల ద్వారా మరింత ఆదా చేసుకోవచ్చు. ఈ సేల్ పండుగ షాపింగ్‌ను సద్వినియోగం చేసుకోవడానికి సరైన అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈ సేల్ కింద SBI క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు 10% తక్షణ తగ్గింపును పొందుతారు. వినియోగదారులు నో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ డీల్, అమెజాన్ పే లేటర్ ఆప్షన్ వంటి ఇతర ఆకర్షణీయమైన ఆఫర్‌ల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.


Also Read: ఫ్లిప్‌కార్ట్ న్యూ సేల్.. వీటిపై 50-80 శాతం తగ్గింపు, కొత్త డేట్ ఇదే!

దీని ద్వారా వినియోగదారులు మరింత ఆదా చేసుకోవచ్చు. ఇక ఏ ఏ ప్రొడక్టులపై ఎంతెంత శాతం తగ్గింపు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ టీవీల వంటి గాడ్జెట్‌లపై గరిష్టంగా 50% తగ్గింపు పొందవచ్చు. అదే సమయంలో Galaxy S23 Ultra 5G, Galaxy M35 5G, Galaxy M15 5G సహా మరెన్నో ఫోన్లపై ఈ సేల్ పెద్ద తగ్గింపులను అందజేస్తుంది. అలాగే వివిధ రకాల హోమ్ గాడ్జెట్‌లపై గరిష్టంగా 70% తగ్గింపు పొందుతారు. Amazon Alexa, Fire TV Stickని తక్కువ ధరలకు కొనుక్కోవచ్చు.

మరీ ముఖ్యంగా ఇటీవల విడుదల చేసిన ఐఫోన్ 16, మునుపటి మోడళ్ల ధరలు సేల్ సమయంలో తగ్గించబడతాయి. గెలాక్సీ జెడ్ ఫ్లిప్, ఇతర ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు కూడా భారీ తగ్గింపులను పొందవచ్చని భావిస్తున్నారు. ఇక హోమ్ ప్రొడక్టులపై దాదాపు 75% వరకు తగ్గింపు పొందవచ్చు. కిచెన్ అండ్ అవుట్ డోర్ వస్తువులపై 50% వరకు తగ్గింపు లభిస్తుంది. అదే సమయంలో బొమ్మలపై 70% వరకు తగ్గింపును ప్రకటించింది. ఇంకా ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ వస్తువులపై 80% వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేగాక 60% వరకు తగ్గింపుతో బుక్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఐటెమ్స్‌ను కొనుగోలు చేసే అవకాశాన్ని పొందవచ్చు.

Related News

7000mAh Budget Phones: రూ 20000 లోపు ధరలో 7000mAh బ్యాటరీ ఫోన్లు.. మిడ్ రేంజ్‌లో బెస్ట్ ఇవే..

Galaxy S25 FE vs iPhone 16e: రెండు బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల మధ్య గట్టి పోటీ.. విన్నర్ ఎవరు?

Moto Book 60 Pro: మోటోరోలా కొత్త ల్యాప్‌టాప్.. ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్‌తో లాంచ్

iPhone 15 Pro Max: ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఫై భారీ తగ్గింపు.. ఏకంగా ₹45,000 డిస్కౌంట్

WhatsApp Tricks: వాట్సప్‌లో కొత్త ఫీచర్స్.. తెలుసుకోకపోతే చాలా మిస్సవుతారు !

Huawei Mate XTs: 10.2 అంగుళాల భారీ స్క్రీన్‌.. అద్భుత కెమెరాలతో ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ లాంచ్

Big Stories

×