EPAPER

Russia-Ukraine war: మోడీ దెబ్బ.. వెనక్కి తగ్గిన పుతిన్.. యుద్దం ఆగినట్లేనా!

Russia-Ukraine war: మోడీ దెబ్బ.. వెనక్కి తగ్గిన పుతిన్.. యుద్దం ఆగినట్లేనా!

Russia-Ukraine war Latest update: ‘ప్రపంచ దేశాలన్నీ కళ్లు మూసుకున్నాయా..? రష్యా నియంతలా మారి, అమాయకులు ప్రాణాలు తీస్తుంటే ఎవ్వరూ పట్టించుకోరా..? ప్లీజ్.. మాకు సాయం చేయండి!’ గత రెండు సంవత్సరాలుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రపంచదేశాలకు చేస్తున్న విజ్ఞప్తి ఇది. కానీ, ఇటీవల, క్షేత్ర స్థాయిలో రియాలిటీ చాలా భిన్నంగా ఉంది. నిన్నటి వరకూ డిఫెన్స్‌లో ఉన్న ఉక్రెయిన్ కొన్ని వారాలుగా పూర్తి అటాక్ మోడ్‌లోకి వచ్చేసింది. ఒక వైపు శాంతి చర్చలు ప్రారంభించి, రష్యాని నిలువరించండని చెబుతూనే.. మరోవైపు, రష్యా ఆక్రమిత భూభాగంలో డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. తాజాగా సూపర్ పవర్‌ఫుల్, స్టోర్మ్ షాడో క్రూయిస్ మిస్సైల్‌ను రంగంలోకి దింపింది. ఇప్పుడు, ఉక్రెయిన్ ఆడుతున్న డబుల్ గేమ్‌ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకీ, యుద్ధ భూమిలో ఏం జరుగుతోంది..? మనసులో శాంతి.. చూపులో సమరానికి అర్థమేంటీ..?


ఉక్రెయిన్ రూటు మారింది. సమయం లేదనుకుందో.. శత్రువు శాంతించాడనుకుందో కానీ.. నిన్నటి వరకూ డిఫెన్స్‌లో ఉన్న ఉక్రెయిన్ ఇప్పుడు అటాక్ మోడ్‌లోకి వచ్చేసింది. గత కొన్ని వారాలుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో దూకుడు పెరిగింది. నాటో, అమెరికాలతో పాటు ప్రపంచదేశాలన్నింటినీ ఆదుకోమని కోరుతూనే.. పవర్ ఫుల్ ఆయుధాలను రంగంలోకి దించుతోంది ఉక్రెయిన్. ఓ వైపు శాంతి చర్చలంటూనే మరో వైపు యుద్ధాన్ని ముమ్మరం చేస్తోంది. అకస్మాత్తుగా మారుతున్న ఉక్రెయిన్ చర్యలకు రష్యా కూడా అయోమయంలో పడింది. గత కొంత కాలంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలనే ప్రయత్నాల్లో భారత్ ముందడుగు వేసింది. ప్రధాని మోడీ పీస్ మిషన్ మొదలు పెట్టిన కొన్ని రోజులకే ఉక్రెయిన్ దూకుడు పెంచింది. ఆక్రమిత రష్యాలోకి దూసుకెళుతోంది. ఈ మధ్య నిప్పులు చిమ్మే డ్రాగన్ డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్.. తాజాగా, లాంగ్ రేంజ్ స్టోర్మ్ షాడో క్రూయిస్ మిస్సైళ్లను సంధించడానికి రెడీ అయ్యింది. దీనితో, రష్యా కోపం నషాళానికి చేరుతోంది. ఉక్రెయిన్ డబుల్ గేమ్‌తో రష్యా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అని అంతర్జాతీయంగా ఆందోళనలు పెరుగుతున్నాయి.

మొన్నటి వరకూ అణ్వాయుధాలు ప్రయోగిస్తానని భయపెట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత్ ప్రమేయంతో ఈ మధ్యనే శాంతికి ఓకే చెప్పారు. ‘ఉక్రెయిన్‌ చర్చలు కోరుకుంటే, నేను కూడా సిద్ధమే’ అంటూ అందరికీ కాస్త ఊరటనిచ్చారు. అయితే, ఇదే తరుణంలో ఉక్రెయిన్ యుద్ధాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లింది. ఇటీవల పరిణామాల్లో.. ఉక్రెయిన్‌లో మౌళిక సదుపాయాల విధ్వంసమే లక్ష్యంగా పలు ప్రాంతాలపై పెద్ద ఎత్తున క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది రష్యా. దీనికి ముందు ఉక్రెయిన్ రష్యా ఆక్రమిత భూభాగంలో డ్రోన్లదాడి చేసింది. దీనితో, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం తీవ్రరూం దాల్చింది. అంతర్జాతీయంగా రష్యాపై వస్తున్న ఒత్తిడితో పుతిన్ వెనక్కు తగ్గుతారని అందరూ భావిస్తున్న తరుణంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. ఉక్రెయిన్‌-రష్యా పరస్పర దాడులు, ప్రతిదాడులు పెరుగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ సహా పలు నగరాలపై రష్యా సైన్యం భారీ ఎత్తున క్షిపణి, డ్రోన్లతో దాడులను తీవ్రతరం చేసింది. కస్క్‌ ప్రాంతంలో రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్‌ బలగాలు చొచ్చుకుపోయిన నేపథ్యంలో రష్యా నుంచి అంతకంటే ఎక్కువ ప్రతిస్పందన ఎదురయ్యింది. రష్యా కుర్స్క్ ప్రాంతంలోకి ఉక్రెయిన్ చొరబాట్లు ఉన్నప్పటికీ, రష్యన్ దళాలు చాలా వేగంగా పోక్రోవ్స్క్ నగరాన్ని చుట్టుముట్టాయి. దీనితో, రష్యాను అడ్డుకోవడానికి యురోపియన్ దేశాల నుండి మరింత సాయం కావాలని కోరారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.


ఇటీవల రష్యా.. ఉక్రెయిన్‌లోని నాటో ఆయుధాలను ధ్వంసం చేసిన తర్వాత యుద్ధ తీవ్రత మరింత పెరిగింది. ఉక్రెయిన్‌కు అందిస్తున్న ఆయుధాలు పూర్తిగా ఉపయోగించబడాలనీ.. రష్యా తమపై బాంబు దాడి చేస్తున్న ప్రదేశాల్లో వీటిని వాడటం కోసం ఉక్రెయిన్‌కు ఇచ్చిన ఆంక్షలను ఎత్తివేయాలని, లేకపోతే, ఈ ఆయుధాలు పనికిరానివిగా మారతాయనే నాటో వర్గాలు నిబంధనలను సడలించాయి. దీనితో, ఉక్రెయిన్‌లోని నాటో ఆయుధాలను డిఫెన్స్ కోసమే కాకుండా అటాక్ కోసం కూడా వాడే స్వేచ్ఛ దొరికింది. దీనితో ఉక్రెయిన్ యుద్ధ వ్యూహాన్ని మార్చింది. ఖర్కీవ్‌ ప్రాంతంలోని రష్యా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్‌ ఇటీవల డ్రోన్‌ దాడులకు పాల్పడింది. డ్రోన్లను థర్మైట్‌ బాంబులను అమర్చి జారవిడిచారు. చాలా తక్కువ ఎత్తులో నుంచి డ్రాగన్‌ డ్రోన్‌లు నిప్పుల వర్షం కురిపించాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా థర్మైట్‌ బాంబులు ఉండగా.. ఉక్రెయిన్ వీటిని వాడి రష్యాకు గట్టి షాకిచ్చింది. ఈ బాంబుల్లో ఉన్న అల్యూమినియం పౌడర్, ఐరన్ ఆక్సైడ్ మిశ్రమం చాలా ఎక్కువ ఉష్ణోగ్రతతో మండి పుట్టిస్తుంది. ఇందులో కరిగిన లోహం చాలా వేగంగా చెట్లు, గోడలు, లోహాలను కూడా కాల్చేస్తుంది. ఆర్మీ వాహనాలను, కవచాలను కూడా పనిరాకుండా చేస్తుంది. అలాంటి అత్యంత ప్రమాదకరమైన బాంబులను వినియోగించిన ఉక్రెయిన్ ఇప్పుడు మరో పవర్ ఫుల్ ఆయుధాన్ని రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తోంది.

Also Read: అమెరికాకు పుతిన్ ఫుల్ గా వార్నింగ్ ఇచ్చిపారేశారు

రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోవడమే లక్ష్యంగా లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణులను ఉపయోగించి ఉక్రెయిన్ తన యుద్ధ వ్యూహాన్ని మార్చాలని అనుకుంటోంది. నిజానికి, ఉక్రెయిన్ ఇప్పటి వరకూ తన సొంత భూభాగంలో రష్యా దాడుల్ని ఎదుర్కోడానికే స్టోర్మ్ షాడో క్షిపణులను ఉపయోగించింది. అయితే, తాజా పరిణామాల్లో రష్యా భూభాగాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉక్రెయిన్ ఈ క్రూయిజ్ క్షిపణిని ఉపయోగించాలని అనుకుంటోంది. దీనికి, NATOలో కీలక సభ్య దేశమైన యునైటెడ్ కింగ్‌డమ్ కూడా అనుమతి ఇచ్చినట్లు ఇటీవలి నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటివరకు, రష్యన్ భూభాగంలోని లక్ష్యాలపై అధునాతన పాశ్చాత్య ఆయుధాలను ఉపయోగించడంపై పరిమితి, యూకే జారీ చేసినఈ అనుమతులతో మారే అవకాశం ఉంది. అయితే, ఇది యుద్ధంలో రష్యా రెడ్‌ లైన్‌ను దాటడానికి ఇది కారణం కావచ్చనే అభిప్రాయాలను పెంచుతోంది. ఇటీవల NATO, దాని మిత్రదేశాలు.. రష్యా చర్యల వల్ల ఉక్రెయిన్ వార్ వ్యూహంలో మార్పు వస్తుందని ఊహించారు. ఉక్రెయిన్‌లో పశ్చిమ దేశాల సహకారం యుద్ధాన్ని తీవ్రతరం చేయొచ్చనే సూచనలు వచ్చాయి. ఇందులో భాగంగా, రష్యా తన అణు సిద్ధాంతాన్ని సవరించాల్సిన అవసరం ఉందని కూడా ఒత్తిడి పెంచారు.

ఇక ఈ స్టోర్మ్ షాడో ఆయుధం నిఘాకు అంత తేలికగా అందేది కాదు. ఇది లో-అబ్జర్వ్‌బుల్, లాంగ్-రేంజ్ ఎయిర్-లాంచ్డ్ క్రూయిజ్ మిస్సైల్. ఇది యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఆయుధం. దాదాపు 250 కి.మీ. దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగల సత్తా ఉన్నా ఆయుధం. ఇది ఇప్పటికే ఉక్రేనియన్ యుద్ధ విమానంలో సెటప్ చేశారు. దీనితో పాటు, ఉక్రెయిన్, సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్నప్పుడు సేకరించిన రష్యా నిర్మించిన Su-24 బాంబులను కూడా ఉక్రెయిన్ దాడులకు సిద్ధం చేసింది. ఇక, 1994లో మాత్రా, బ్రిటిష్ ఏరోస్పేస్‌ అభివృద్ధి చేసిన స్టోర్మ్ షాడో క్షిపణిని ఇప్పుడు MBDA సిస్టమ్స్ తయారు చేసింది. ఉక్రెయిన్ రష్యాపై చేయాలనుకునే దాడుల్లో ఇది బలమైన ప్రభావాన్ని చూపగలదు. 500 కిలోల పేలోడ్ సామర్థ్యంతో పరిమితికి మించిన పరిధిని ఛేదిస్తుంది. నిజానికి, ఇది MTCR నిబంధనలను ఉల్లంఘిస్తుంది. అయినప్పటికీ, ఉక్రెయిన్ రష్యాపై దీన్ని ప్రయోగించడానికి సిద్ధపడింది.

వార్ ఫ్లైట్ నుండి ప్రయోగించే ఈ స్టోర్మ్ షోడో క్షిపణి, ధ్వని వేగానికి దాదాపు సమానమైన వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులోని అధిక పేలుడు వార్‌హెడ్‌ తీవ్రమైన నష్టాన్ని కలుగుజేస్తుంది. యుద్ధంలో రష్యా ఉపయోగించే బలమైన బంకర్‌లు, ఆయుధగారాల్లోకి చొచ్చుకుపోవడానికి తుఫాను కంటే వేగంగా ఈ షాడో మిస్సైల్ వెళుతుంది. అందుకే, ఉక్రెయిన్ దీన్ని కీలక ఆయుధంగా పరిగణిస్తుంది. అయితే, ఒక్క స్టోర్మ్ షాడో ధర దాదాపు ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు ఉంటుంది. కాబట్టి, ఈ ఆయుధాన్ని ఉక్రెయిన్ చాలా పొదుపుగా వాడాల్సి ఉంటుంది. శత్రువుల వాయు రక్షణను అయోమయానికి గురిచేయడానికి, నిర్వీర్యం చేయడానికి ప్రయోగించే తక్కువ ఖర్చు డ్రోన్‌లతో పాటు స్టోర్మ్ షోడో రష్యాలోని కీలక స్థావరాలపై దాడి చేయడానికి ఉపయోగిస్తారు. అయితే, ఇది మొత్తం రష్యా నౌకాదళానికి పెద్ద ప్రమాదంగానే చెప్పాల్సి ఉంటుంది. ఇంత ప్రమాదకరమైన ఆయుధం కాబట్టే కొన్నాళ్లుగా దీన్ని వినియోగించడానికి ఉక్రెయిన్ తీవ్రంగా లాబీయింగ్ చేస్తోంది. ముఖ్యంగా, ఇటీవల ఉక్రేనియన్ ఫ్రంట్-లైన్ ప్రయత్నాలను అడ్డుకున్న రష్యాన్ గ్లైడ్ బాంబు దాడులను ఎదుర్కోవడంలో భాగంగా వీటిని రష్యాన్ ఎయిర్‌ఫీల్డ్‌లను లక్ష్యంగా చేసుకోడానికి ఉపయోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related News

Harish Rao: నెంబర్ 2 నేనే..!

Vijayasai Reddy EVM: ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి విజయ్‌సాయిరెడ్డి ట్వీట్.. 2019లో టాంపరింగ్ సాధ్యం కాదని చెప్పిన జగన్!

CID Takes TDP Attack Case: సిఐడీ చేతికి టీడీపీ ఆఫీసుపై దాడుల కేసులు.. విచారణ వేగవంతం

PAC Chairman Arikepudi: పీఏసీ చైర్మన్ పదవిపై హరీష్ రావు రాజకీయాలు.. గట్టి కౌంటర్ కౌంటర్ ఇచ్చిన మంత్రి శ్రీధర్‌బాబు

Hindupuram Municipality Politics: బాలయ్య Vs జగన్.. ప్రతిష్టాత్మకంగా మారిన హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ పదవి పోరు

Nellore Nominated Posts: నెల్లూరు జిల్లాల్లో నామినేటెడ్ పోస్టుల టెన్షన్.. సెకండ్ లిస్టుపై కూటమి నేతల చూపులు.

Air India Flight Tricky Situation: 2 గంటలకు గాల్లోనే విమానం.. ఎయిర్ ఇండియా తిరుచురాపల్లీ-షార్జా ఫ్లైట్‌లో ఏం జరిగింది?

Big Stories

×