DSP: మ్యూజిక్ డైరెక్టర్ డి.ఎస్.పి తన మ్యూజిక్ తో, పాటలతో ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అలాంటి డిఎస్పి.. ఒకప్పుడు ఏ సినిమాలో చూసినా ఈయన మ్యూజికే ఉండేది. అయితే ఇప్పుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు ఇండస్ట్రీకి వస్తున్న కొద్దీ ఈయన హవా కాస్త తగ్గిపోయినప్పటికీ.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్యూన్లు కడుతూ తన స్థానాన్ని ఇండస్ట్రీలో పదిలం చేసుకుంటున్నారు. అయితే అలాంటి దేవిశ్రీప్రసాద్ తాజాగా జగపతిబాబు (Jagapathi babu) హోస్ట్ గా చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో అయినటువంటి ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కి గెస్ట్ గా వచ్చారు. తాజాగా దేవి శ్రీ ప్రసాద్ గెస్ట్ గా వచ్చిన ఫస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు. అయితే ఈ ప్రోమోలో ఏముందంటే.. జగపతిబాబు టాక్ షోలోకి దేవిశ్రీప్రసాద్ ఎంట్రీ ఇవ్వడంతోనే హూ ఆర్ యూ అనే ఎంట్రీ సాంగ్ తో వచ్చారు.
ఆ తర్వాత జగపతిబాబు డీఎస్పీ ని పొగుడుతూ లెజెండ్ మూవీలో నువ్వు నాకు ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ మామూలుగా లేదు..ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నువ్వు నన్ను మామూలుగా లేపలేదు.. ఫిదా అయ్యాను.. అంటూ పొగిడారు. మీ నాన్నగారు రాసిన పాట ఏంటో తెలియదు కానీ నువ్వు గర్ల్ ఫ్రెండ్ కోసం రాసిన పాట మాత్రం బాగా తెలుసు అంటూ జగపతిబాబు దేవిశ్రీప్రసాద్ ని ఇరుకున పెట్టే కామెంట్స్ చేశారు. దానికి దేవి శ్రీ ప్రసాద్ ఏమీ తెలియనట్టుగా ఏం పాట అని అనడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలోని నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అనే పాట ప్లే అవుతుంది.. ఇక ఈ పాట ప్లే అవ్వడంతోనే అసలు ఈ పాట మైండ్ లోకి ఎలా వచ్చిందనే విషయాన్ని దేవిశ్రీప్రసాద్ వివరించి చెబుతారు. ఈ పాట ఏదో అనుకోకుండా వచ్చింది. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నది అని ఆ తర్వాత మరో అమ్మాయి అటు నుండి వెళ్తుంటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకుంటయే అని అనుకోకుండా ఈ పాట వచ్చింది. సరదాగా పవన్ కళ్యాణ్ గారిని పిలిచి ఈ పాట వినిపిద్దాం అనుకున్న సమయంలోనే వీడు ఆరడుగుల బుల్లెట్టు అనే పాట మైండ్ లోకి వచ్చింది అంటూ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా ముచ్చట్లు చెప్పారు.
ఆ తర్వాత జగపతిబాబు లవ్ స్టోరీ లోకి వస్తే అని అడగడంతోనే.. డీఎస్పి వెంటనే సార్ ఇది మీ ఇంటర్వ్యూ అనుకుంటున్నారేమో.. ఇది నా ఇంటర్వ్యూ అని కవర్ చేశారు. అంతేకాదు జగ్గు భాయ్ ని రొమాంటిక్ భాయ్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ తర్వాత జగపతిబాబు దేవిశ్రీప్రసాద్ ని మీరు ఫస్ట్ రాసిన పాట ఏంటి అది పాడితే బాగుంటుందని చెప్పడంతో లైవ్ లోనే దేవిశ్రీప్రసాద్ తన మొదటి పాటని పాడి చూపించారు.
ఈ పాటకి అక్కడున్న ప్రేక్షకులు అందరూ పూనకాలు వచ్చేటట్టుగా ఊగిపోయారు. దేవిశ్రీప్రసాద్ లైవ్ పెర్ఫార్మెన్స్ కి జగపతిబాబు సూపర్ అంటూ తెగ పొగిడేసారు.అలా లైవ్ లో ఉన్న వారందరినీ మెప్పించడంతోపాటు హోస్ట్ జగపతిబాబుని కూడా తన పాటతో మెప్పించారు. అక్కడితో ప్రోమో ముగిసింది. మరి ఈ టాక్ షోలో దేవిశ్రీప్రసాద్ నుండి జగపతిబాబు ఇంకా ఏ ఏ విషయాలు బయటకి లాగారు. ఆయన పర్సనల్ విషయాలు ఏవైనా బయట పెట్టారా తెలియాలంటే కచ్చితంగా ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవ్వడంతో నువ్వు మామూలు ముదురు కాదు భయ్యో ఏకంగా జగపతిబాబునే మెస్మరైజ్ చేశావుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.