Karimnagar News: కిటికీ వివాదానికి నిండు ప్రాణం బలితీసుకున్న ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అధికారుల పేర్లు, పక్కింటి వారు వేధింపుల కారణంగా అత్మహత్య చేసుకుంటున్నట్లు.. సూసైడ్ నోట్‌లో రాసి మరీ ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ పట్టణంలోని రాఘవేంద్ర నగర్‌కి చెందిన వడ్లకొండ లక్ష్మీరాజం అనే వ్యక్తి.. పురుగుల మందు త్రాగి అత్మహత్య చేసుకున్నాడు. తాను మృతిచెందడానికి అధికారులు, పక్కింటివారి వేధింపులే కారణమని సూసైడ్ నోట్‌లో తెలిపాడు. అధికారులు నిబంధనల పేరిటా ఇంటి కిటికీలు పదేపదే తొలగించడం.. తనని మానసికంగా వేధింపులకి గురిచేసిందని, ఈ అవమానం తట్టుకోలేక అత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు.
వడ్లకొండ లక్ష్మీరాజంకి పక్కింటివారితో గత మూడు సంవత్సరాలుగా వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. లక్ష్మీరాజం సెట్ బ్యాక్ నిబంధనలు ఉల్లంగించారని, 2023 లో కరీంనగర్ టౌన్ ప్లానింగ్ అధికారులు మొదటిసారి ఇంటి కిటికీలు తొలగించారు. అయితే తాను ఇంటి లోపలి వైపే కిటికీలు ఏర్పరుచుకున్నాడు. కానీ మరొసారి పక్కింటివారి ఫిర్యాదు మేరకి తొలగించారు. అతను నిబంధనల మేరకే ఇళ్ళు నిర్మించుకొని సెట్ బ్యాక్ ప్రకారం కిటికీలు నిర్మించుకోగా.. అయనా కూడా కిటికీలు తొలగించారని, తాను ఫిర్యాదు చేస్తే మాత్రం అధికారులు పట్టించుకోలేదని తెలిపాడు.
Also Read: మొంథా తుఫాన్.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
న్యాయం కొసం పోలీసు స్టేషన్‌కి వెళ్ళిన, టౌన్ ప్లానింగ్ అదికారుల వద్దకి వెళ్ళిన న్యాయం చెయకపోగా పక్కింటి వారితో మాట్లాడుకోవాలని సూచించారు. అయితే పక్కింటివారు వేధింపులు ఎక్కువ కావడం, ఇష్టం వచ్చినట్లు తరుచూ తిట్టడంతో ఇది అవమానంగా భావించిన లక్ష్మీరాజం.. పురుగుల మందు త్రాగి అత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు పక్కింటి వారు, టౌన్ ఫ్లానింగ్ అధికారుల వేధింపులే కారణమని తన సూసైడ్ నోట్‌లో తెలిపాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తమకు న్యాయం చేయాలని, తన భర్తకు చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని లక్ష్మీ రాజం భార్య డిమాండ్ చేసింది.