Chiranjeevi Deep Fake Video :గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు డీప్ ఫేక్ వీడియోలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రష్మిక (Rashmika) ను మొదలుకొని ఎంతోమంది హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. అయితే ఇప్పుడు చిరంజీవిని కూడా వదలలేదు అని చెప్పవచ్చు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి (Chiranjeevi) పేరు ప్రతిష్టలను దెబ్బతీసేలా తయారు చేసిన డీప్ ఫేక్ వీడియోలు, మార్పు చేసిన ఫోటోలు సినీ పరిశ్రమలో అలజడి సృష్టిస్తున్నాయి.
ముఖ్యంగా టీఆర్పీ లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తూ పలు సోషల్ మీడియా పేజీలలో వెబ్సైట్లలో వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చిరంజీవి.. ఇటీవల నగర సీపీ వీసీ సజ్జనార్ కు అధికారికంగా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే . అంతేకాదు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును కూడా ఆయన ఆశ్రయించారు. ముఖ్యంగా తన పేరును దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిరంజీవి కోరగా ఈ విషయంపై వీసీ సత్యనారాయణ స్పందించారు.
వీసీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. “చిరంజీవి డీప్ ఫేక్ కేసులో విచారణ చేస్తున్నాము.. అశ్లీలంగా మార్ఫింగ్ చేసిన కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాము. మూలాల్లోకి వెళ్లి నిందితులను అరెస్టు చేస్తాము. ఇలాంటి డీప్ ఫేక్ సెలబ్రిటీలు కేసులు పెరిగే అవకాశం ఉంది. అందుకే దీనిపై ప్రత్యేకమైన టీంని కూడా ఏర్పాటు చేసి విచారిస్తాము. ఇదే సమయంలో చాదర్ఘాట్ కాల్పుల కేసులో కూడా పురోగతి కనిపిస్తోంది. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తాం” అంటూ సజ్జనార్ మీడియాతో చెప్పుకొచ్చారు.
అంతేకాదు ఈ విషయంపై కోర్టు కూడా స్పందిస్తూ…” టిఆర్పి లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము.. డిజిటల్ వేదికలపై మెగాస్టార్, చిరు, అన్నయ్య పేర్లతో ఏఐ మార్ఫింగ్ చేయడం పై కూడా ఆంక్షలు విధించారు. అంతేకాదు ఇప్పటివరకు చిరంజీవి పేరును, ఫోటోలను దుర్వినియోగం చేసిన 30 మందికి లీగల్ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే ఇప్పటివరకు డీప్ ఫేక్ టెక్నాలజీ వల్ల తమ ప్రతిష్ట దెబ్బతింటుందని.. తమ పేరు ప్రఖ్యాతలకు భంగం వాటిల్లుతోందని పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అందులో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, రజనీకాంత్, నాగార్జున, మోహన్ బాబు, రష్మిక, అభిషేక్ బచ్చన్ , అనిల్ కపూర్కరణ్ జోహార్ ఇలా ఎంతోమంది తారలు ఉన్నారు.
ALSO READ: Actor Death: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… అనుమానాస్పద స్థితిలో నటుడు మృతి!