Rohit – Kohli: భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన 3 వన్డేల సిరీస్ లో సిడ్ని వేదికగా జరిగిన చివరి వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. దీంతో సిరీస్ ని 2-1 తేడాతో ముగించింది. ఈ చివరి వన్డేలో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు దుమ్మురేపారు. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు తమ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేశారు. ఇప్పటికే టెస్ట్, టి-20 ఫార్మాట్లకు గుడ్ బై పలికిన ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లు.. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. వీరిద్దరూ మరో రెండేళ్ల పాటు జట్టులో కొనసాగే అవకాశాలు ఉన్నప్పటికీ.. టీమిండియా మాత్రం ఇప్పట్లో వైట్ బాల్ సిరీస్ లు ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లదు.
Also Read: IPL 2026: కేకేఆర్ ప్లాన్ మాములుగా లేదు.. ముగ్గురు డేంజర్ ప్లేయర్లను దించుతున్నారుగా !
మళ్లీ భారత జట్టు 2028 లో మాత్రమే ఆస్ట్రేలియా టూర్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అప్పటికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వయసు 40 ఏళ్లు దాటుతుంది. ఈ క్రమంలో వారు భారత జట్టులో కొనసాగే అవకాశాలు ఉండవు. దీంతో సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డే నే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లకు ఆస్ట్రేలియా గడ్డపై చివరి మ్యాచ్ అయింది. ఈ చివరి వన్డేలో వీరిద్దరూ అసాధారణ ప్రదర్శన కనబరిచారు. రోహిత్ శర్మ తన 33వ సెంచరీ నమోదు చేసి 121 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మరోవైపు విరాట్ కోహ్లీ 74 పరుగులతో నాటౌట్ గా అదరగొట్టాడు. ఈ ఇన్నింగ్స్ తో తమపై వస్తున్న విమర్శకులకు బ్యాట్ తో సమాధానం ఇచ్చారు. వీరిద్దరూ కలిసి మూడవ వన్డేలో అజేయంగా 168 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
మూడవ వన్డే అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. “మళ్లీ ఆస్ట్రేలియాకు వస్తామో లేదో తెలియదు. కానీ ఇక్కడ ఆడిన ప్రతిక్షణం మాకు ఎంతో ఆనంద క్షణాలను అందించాయి. నేను ఆస్ట్రేలియాలో ఆడేందుకు ఎక్కువగా ఇష్టపడతాను. 2008 నుండి నాకు ఇక్కడ ఎన్నో మరపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడ ఆడిన ప్రతిక్షణాన్ని ఆస్వాదించాను. మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అని తెలిపాడు రోహిత్ శర్మ. ఇక ఇదే సందర్భంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ” ఆస్ట్రేలియాలో ఆడేందుకు మేము ఎంతగానో ఇష్టపడతాం. ఈ గడ్డపై మా నుంచి ఎన్నో అత్యుత్తమ ప్రదర్శనలు వచ్చాయి. ఇక్కడి అభిమానుల మద్దతు నిజంగా ఓ అద్భుతం. అందరికీ కృతజ్ఞతలు” అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.
ఇక ఈ చివరి వన్డే అనంతరం మళ్లీ ఆస్ట్రేలియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను చూడలేమని చాలామంది అభిమానులు, కామెంటేటర్లు కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో ఓ కామెంటేటర్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఆ కామెంటేటర్ బోరున ఏడ్చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ క్రీజ్ ని పంచుకోవడం ఇదే చివరిసారి కావచ్చు అని గ్రహించిన ఆ కామెంటేటర్ కన్నీళ్లను ఆపుకోవడానికి, భావోద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
An australian commentator was seen crying when Kohli and Rohit played their last game in Australia. 🥹💔
Cricket truly unites the people man 🤍 pic.twitter.com/R71605Vh8A
— ` (@45Fan_Prathmesh) October 26, 2025