iPhone 15, iPhone 15 Plus, iPhone 14, iPhone 14 Plus price cut: ప్రముఖ అమెరికన్ బ్రాండ్ యాపిల్ ఐఫోన్‌లకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. ధర అధికంగా ఉన్నా కొనేందుకు వెనకాడటం లేదు. సామాన్యులు కూడా ఐఫోన్‌ను వివిధ మార్గాల్లో కొనేస్తున్నారు. అందువల్లనే ఈ యాపిల్ ఐఫోన్లకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే యాపిల్ కంపెనీ తన లైనప్‌లో 15 సిరీస్‌లను విజయవంతంగా లాంచ్ చేసి అద్భుతమైన రెస్పాన్స్‌ను సంపాదించింది. రీసెంట్‌గా మరో అడుగు ముందుకేసింది. ఇందులో భాగంగానే తన లైనప్‌లో తర్వాత సిరీస్‌ను లాంచ్ చేసింది. ఐఫోన్ 16 సిరీస్‌ను దేశీయ మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
దీంతో దీని ముందు సిరీస్‌లు భారీగా తగ్గించబడ్డాయి. ఈ తగ్గింపుల కోసం యావత్ ఐఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ అవుతుందా? అని కొందరు వెయిట్ చేస్తుంటే.. మరి కొందరేమో ఐఫోన్ 16 సిరీస్‌కి ముందు మోడళ్లు ఎంతమేర డిస్కౌంట్‌తో లభిస్తాయి అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. 16 సిరీస్ లాంచ్ కావడంతో ఐఫోన్ 14, ఐఫోన్ 15 సిరీస్‌లపై భారీ తగ్గింపు అందుబాటులోకి వచ్చింది.
ఈ మోడళ్లపై ఎవరూ ఊహించనంత డిస్కౌంట్ లభిస్తుంది. దాదాపు రూ.10,000 నుండి రూ.20,000 వరకు పొందొచ్చు. ఇప్పుడు ఈ తగ్గింపులతో ఐఫోన్ 14, ఐఫోన్ 15లు ఎంత ధరకు కొనుక్కోవచ్చో తెలుసుకుందాం. ఐఫోన్ 14, ఐఫోన్ 15 ఇప్పుడు యాపిల్ స్టోర్, ఆన్‌లైన్‌లలో భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. ఇప్పుడు మోడల్ బట్టి చూద్దాం.
iPhone 15
iPhone 15 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర Rs .79,900 ఉండగా ఇప్పుడు రూ.10 వేల డిస్కౌంట్‌తో Rs 69,900కి లభిస్తుంది.
అదే సమయంలో మిడ్ రేంజ్ 256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర Rs. 89,900 ఉండగా.. రూ.10 వేల తగ్గింపుతో Rs.79,900కి పొందొచ్చు.
దీని టాప్ రేంజ్ 512GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర Rs. 109,900 ఉండగా.. ఇప్పుడు రూ.10 వేల తగ్గింపుతో Rs.99,900లకే సొంతం చేసుకోవచ్చు.
iPhone 15 Plus
Also Read: ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ దేశీయ ధరలు.. ఫస్ట్ సేల్‌లో రూ.5000 భారీ తగ్గింపు!
iPhone 15 Plus 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర Rs.89,900 ఉండగా ఇప్పుడు రూ.10 వేల తగ్గింపుతో Rs.79,900లకే పొందొచ్చు.
256GB స్టోరేజ్ వేరియంట్ Rs.99,900 ఉండగా.. ఇప్పుడు Rs. 89,900కి పొందొచ్చు.
అలాగే టాప్ రేంజ్ 512GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర Rs.1,19,900 ఉండగా ఇప్పుడు Rs.109,900కి సొంతం చేసుకోవచ్చు.
iPhone 14
iPhone 14 బేస్ 128GB స్టోరేజ్ వేరియంట్ Rs.79,900 ఉండగా ఇప్పుడు రూ. 20 వేల తగ్గింపుతో Rs.59,900కి కొనుక్కోవచ్చు.
మిడ్ రేంజ్ 256GB స్టోరేజ్ వేరియంట్ Rs.89,900 ఉండగా ఇప్పుడు రూ. 20 వేల తగ్గింపుతో Rs.69,900కి లభిస్తుంది.
టాప్ రేంజ్ 512GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర Rs.1,09,900 ఉండగా ఇప్పుడు రూ. 20 వేల తగ్గింపుతో Rs.89,900
iPhone 14 Plus
iPhone 14 Plus 128GB స్టోరేజ్ వేరియంట్ ధర Rs.89,990 ఉండగా.. ఇప్పుడు రూ. 20 వేల తగ్గింపుతో Rs.69,900కి లభిస్తుంది.
మిడ్ రేంజ్ 256GB స్టోరేజ్ వేరియంట్ Rs.99,900 ఉండగా ఇప్పుడు రూ. 20 వేల తగ్గింపుతో Rs.79,900కి లభిస్తుంది.
టాప్ 512GB స్టోరేజ్ వేరియంట్ Rs.1,19,900 ఉండగా రూ. 20 వేల తగ్గింపుతో Rs.99,900కి సొంతం చేసుకోవచ్చు.