BigTV English

HYDRA: పాతబస్తీ కట్టడాలపై హైడ్రా చర్యలేవీ?: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

HYDRA: పాతబస్తీ కట్టడాలపై హైడ్రా చర్యలేవీ?: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

కోరల్లేని పాము.. హైడ్రా


– ఒవైసీ బ్రదర్స్ బెదిరిపులతో భయపడిన సీఎం
– పాతబస్తీ కట్టడాలపై హైడ్రా చర్యలేవీ?
– ఫిరాయింపు ఎమ్మెల్యేకి పీఏసీ ఛైర్మన్ పదవా?
– కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల దారి ఒక్కటే..
– అధిష్టానం ఆదేశాలకు భిన్నంగా సీఎం నిర్ణయాలు
– తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
– బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

BJP: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పును బీజేపీ స్వాగతిస్తుందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఫిరాయింపులతో ప్రజాస్వామ్యం కూనీ అవుతోందని, హైకోర్టు ఆదేశించిన ఎమ్మెల్యేలతో బాటు పార్టీ మారిన మిగిలిన ఎమ్మెల్యేల మీదా చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


దొందూ దొందే..
గతంలో తమ ఎమ్మెల్యేలను గులాబీ పార్టీ లాక్కుపోయినప్పుడు కాంగ్రెస్ నేతలంతా పెడబొబ్బలు పెట్టారని, నేడు అదే పార్టీ నేతలు బీఆర్ఎస్ బాటలో పయనిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇళ్లముందు ప్రజలు చావుడప్పు కొట్టాలని గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడారని, తీరా సీఎం కాగానే తానూ ఆ బాటలోనే సాగటం బాధాకరం అన్నారు. ఫిరాయింపులు ప్రొత్సహించబోమని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొందని, కానీ, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలోని ఏఐసీసీ నిర్ణయాలకు విరుద్ధంగా పొరుగు పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుందని, ఇక ఈ రెండు పార్టీలకు తేడా ఏముందని ప్రశ్నించారు. ఫిరాయింపులకు తమ పార్టీ వ్యతిరేకమని, ఎవరైనా ప్రజా ప్రతినిధులు బీజేపీలోకి రావాలంటే ఆ పార్టీ సభ్యత్వానికి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన అన్ని పదవులు వదులుకుని రావాల్సిందేనని స్పష్టం చేశారు.

అదేం పద్ధతి
విపక్ష పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి, అధికార పార్టీలోకి ఫిరాయించిన అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవిని ఇవ్వటం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించిందన్నారు. అసెంబ్లీ సంప్రదాయాల ప్రకారం పీఏసీ చైర్మన్ పదవి విపక్షానికి ఇవ్వాల్సి ఉంటుందని, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పంపిన జాబితాలో సూచించిన వారికి గాక.. వేరొకరికి ఆ పదవిని గాంధీకి కట్టబెట్టటంలో ఆంతర్యమేమిటో అర్థం కావటం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా హైకోర్టు తీర్పును స్వాగతించారని గుర్తుచేశారు.

Also Read: MB University: కలెక్షన్ కింగ్.. ఫీజులేమైనా కలెక్షన్లా? మోహన్‌ బాబు బాగోతం బట్టబయలు!

ముందే చెప్పా
హైడ్రా కూల్చివేతలు మొదలైనప్పుడే ఇది హైడ్రామా కోసమేనని తాను ముందే చెప్పానని మహేశ్వర్ రెడ్డి కామెంట్ చేశారు. ఓవైసీ బ్రదర్స్ పాతబస్తీలో చెరువులు ఆక్రమించి కట్టిన భవనాలను హైడ్రా కూల్చివేయటంలో తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. ఎంఐఎం నేతల బెదిరింపులకు భయపడిన రేవంత్ రెడ్డి.. హైడ్రా కోరలు పీకేశారని, ఆయనదంతా ఆరంభశూరత్వమని విమర్శించారు. హైడ్రా పేరుతో వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని, మొత్తం హైడ్రాను సీఎం డమ్మీగా మార్చారని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులు ఆ పార్టీ సీనియర్లకు ఇష్టం లేదని, అందుకే చేరికల సమయంలో ఏ ఒక్క సీనియర్ లీడర్ కూడా రేవంత్ వెంట లేడని అన్నారు. సీఎంకు, సీనియర్ మంత్రులకూ గ్యాప్ ఉందని, అందుకే ముఖ్యమంత్రి నిర్ణయాల్లో తడబాటు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.

అదంతా మీడియా సృష్టే..
తెలంగాణ బీజేపీ నేతల మధ్య సమన్వయం కొరవడిందని, వారి మధ్య అంతర్యుద్ధం సాగుతోందని వస్తున్న వార్తలన్నీ నిరాధారాలని, అవన్నీ మీడియా స‌ృష్టేనని మహేశ్వర్ రెడ్డి కొట్టిపారేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రబల శక్తిగా మారనుందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ పార్టీ ఫిరాయింపులపై బీజేపీ రిట్ పిటిషన్‌కు అనుగుణంగా హైకోర్టు తీర్పు వచ్చిందని అన్నారు.

Related News

Telangana: వీరు పిల్లలు కాదు.. పిడుగుల.. సైకిల్ కోసం లోన్ కావాలని బ్యాంకుకు వెళ్లిన చిన్నారులు..

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్.. రేపోమాపో కాంగ్రెస్-బీజేపీ అభ్యర్థుల ప్రకటన, నవీన్‌పై క్రిమినల్ కేసు

Heavy Rains: బీ అలర్ట్..! ఏపీ, తెలంగాణలో మరో వారం రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..

Heavy Rains: రాష్ట్రంలో మళ్లీ కుండపోత వానలు.. రెండ్రోజులు ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, భారీ పిడుగులు..?

Harish Rao: తెలంగాణ బీజేపీ ఎంపీలకు హరీష్ రావు సవాల్.. ఆ విషయంలో కేంద్రాన్ని అడిగే దమ్ముందా..?

Telangana Jagruthi: కవిత సమక్షంలో.. బీఆర్ఎస్ నుంచి జాగృతిలో చేరికలు

Hyderabad Real Estate: MSN రియాల్టీ సంస్థ సరికొత్త రికార్డ్.. ఎకరా స్థలం రూ.177 కోట్లకు కొనుగోలు

Telangana Pharma Hub: ఫార్మా ఇండస్ట్రీలో మరో మైలురాయి.. హైదరాబాద్ నుంచే ప్రపంచ స్థాయి ఔషదాల తయారీ

Big Stories

×