iPhone 16 Series Price: ఐఫోన్ 16 సిరీస్ కోసం ఎంతో ఎదురుచూసిన ప్రియులకు గుడ్ న్యూస్. రీసెంట్‌గా ఈ సిరీస్ దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేయబడింది. ఇందులో భాగంగానే ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారతదేశంలో కూడా ప్రారంభించబడ్డాయి. ఈ సిరీస్‌లో iPhone 16 మోడల్‌లతో పాటు iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max వంటి మోడల్స్ ఉన్నాయి. ఈ సిరీస్‌లోని వనిల్లా, ప్లస్ మోడల్‌లు కొత్త Apple A18 చిప్‌తో లాంచ్ చేయబడ్డాయి. అంతేకాకుండా ప్రో మోడల్‌లు ఫ్లాగ్‌షిప్ A18 ప్రో చిప్‌తో శక్తిని పొందుతాయి.
వీటిలో iOS 18 అవుట్-ఆఫ్-ది-బాక్స్ ఉన్నాయి. కొత్త ఫోన్‌లు IP68 రేటెడ్ బిల్డ్‌తో వస్తాయి. అలాగే Apple ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు మద్దతు ఇస్తాయి. అన్ని మోడల్స్ XDR OLED డిస్ప్లేతో వస్తాయి. ఈ సంవత్సరం వనిల్లా, ప్లస్ మోడల్‌లు యాక్షన్ బటన్‌తో వస్తాయి. అదే సమయంలో ప్రో మోడల్‌లు కొత్త క్యాప్చర్ బటన్‌ను పొందుతాయి.
iPhone 16 Series Price In India
యాపిల్ కంపెనీ భారతదేశంలో 128GB స్టోరేజ్ గల బేస్ ఐఫోన్ 16 ను రూ.79,900కి విడుదల చేసింది. అదే సమయంలో దీని 256GB స్టోరేజ్ ధర రూ. 89,900, 512GB స్టోరేజ్ వేరియంట్ రూ. 1,09,900 ధరలో అందుబాటులోకి వచ్చాయి.
అలాగే iPhone 16 Plus 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ. 89,900 నుండి ప్రారంభమవుతుంది. దీని 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.99,900గా ఉంది. అలాగే 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,19,900గా నిర్ణయిబడింది. ఈ రెండూ అల్ట్రామెరైన్, టీల్, పింక్, వైట్, బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేయబడ్డాయి.
Also Read: ఐక్యూ నుంచి తోపు ఫోన్.. 80W ఛార్జింగ్ సపోర్ట్ సహా అధునాతన ఫీచర్లతో వచ్చేస్తుంది!
ఇక iPhone 16 Pro 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర భారతదేశంలో రూ. 1,19,900గా ఉంది. అదే సమయంలో దీని 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,29,900గా ఉంది. అలాగే 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,49,900గా నిర్ణయించబడింది. అదే సమయంలో టాప్ 1TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,69,900గా ఉంది.
అదే సమయంలో iPhone 16 Pro Max 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,44,900 గా ఉంది. అలాగే 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,64,900గా నిర్ణయించబడింది. దీని టాప్ 1TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,84,900గా కంపెనీ నిర్ణయించింది. ఈ రెండు మోడల్‌లు వైట్ టైటానియం, బ్లాక్ టైటానియం, నేచురల్ టైటానియం, డెజర్ట్ టైటానియం కలర్ ఆప్షన్‌లలో లాంచ్ అయ్యాయి.
ఈ ఐఫోన్ 16 సిరీస్ మోడల్ కొనుగోలుపై పలు బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. అందులో యాపిల్ యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంక్ కార్డ్‌లపై రూ.5000 తక్షణ తగ్గింపును పొందొచ్చు. ఇది కాకుండా కస్టమర్లు ఈ మోడల్‌లను 3 లేదా 6 నెలల్లో నో కాస్ట్ EMIలో కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద పాత ఐఫోన్ మోడల్‌ను మార్చుకోవడంపై రూ.67,500 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ కొత్త మోడళ్లను సెప్టెంబర్ 13 నుండి ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. వాటి సేల్స్ సెప్టెంబర్ 20 నుండి ప్రారంభమవుతుంది.