 
					Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో.. జనంబాట కార్యక్రమం రెండో రోజు నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతోంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినవని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆమె చేపట్టిన జనం బాటపై వస్తున్న విమర్శలకు ఆమె కౌంటర్ ఇచ్చారు.
ప్రజల సమస్యలే మా సమస్యలు. వాటి కోసమే ప్రభుత్వంతో. కేంద్రంతో కూడా కొట్లాడుతున్నాం అని కవిత స్పష్టం చేశారు. ఆమె నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తూ పలు గ్రామాల్లో ప్రజలను కలుసుకున్నారు. ముఖ్యంగా పోడు భూముల సమస్యలు, రైతుల నష్టాలు, బీసీ రిజర్వేషన్లు వంటి అంశాలపై కవిత మాట్లాడారు. మా వెనుక చాలా మంది మొరుగుతుంటారు. కానీ నేను ఒక్కసారి కమిట్ అయితే, నా మాట నేనే వినను అని ఘాటుగా వ్యాఖ్యానించారు. తాను ఎవరికీ భయపడనని, ప్రజల కోసం మాట్లాడటం తన కర్తవ్యమని తెలిపారు.
తనపై ప్రచారం జరుగుతున్న విషయాలపై కవిత స్పష్టత ఇచ్చారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ నాకు సహకరించలేదని నేను ఎప్పుడూ చెప్పలేదు అని తెలిపారు. అయితే ఆమె తన నియోజకవర్గంలోని నవీపేట్ రైతుల నష్టంపై షకీల్ నిర్లక్ష్యాన్ని ప్రస్తావించారు.
ఈ సందర్భంగా ఆమె మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలోని.. పోడు భూముల బాధిత రైతు ప్రకాష్ కుటుంబాన్ని స్వయంగా పరామర్శించారు. పంట నష్టం వివరాలను ఆరా తీశారు. అటవీశాఖ అధికారులు ప్రకాష్ పంటకు గడ్డి మందు చల్లి పంటను ధ్వంసం చేసిన ఘటనపై కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతు కుటుంబానికి పంట నష్టం మొత్తాన్ని వెంటనే పరిహారం రూపంలో చెల్లించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.
Also Read: చాధర్ఘాట్ విక్టోరియా గ్రౌండ్ కాల్పుల కేసు ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు..
కవిత తన ప్రసంగంలో కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. “బీసీ రిజర్వేషన్లు సాధించాలంటే మొదట నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో సహా రాష్ట్రంలోని ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రాజీనామాలు చేయాలి. అప్పుడే కేంద్రం స్పందిస్తుంది అని వ్యాఖ్యానించారు.