BigTV English

5G Mobile Offers Under 12000: కిర్రాక్ 5జీ ఫోన్లు.. కేవలం రూ.12 వేల లోపే కొనేయొచ్చు.. ఫొటోలైతే ఓ రేంజ్‌లో వస్తాయ్..!

5G Mobile Offers Under 12000: కిర్రాక్ 5జీ ఫోన్లు.. కేవలం రూ.12 వేల లోపే కొనేయొచ్చు.. ఫొటోలైతే ఓ రేంజ్‌లో వస్తాయ్..!

5G Mobile Offers: ప్రస్తుత మార్కెట్‌లో 5జీ ఫోన్లకు మంచి గిరాకీ పెరిగింది. అందువల్ల ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను మార్కెట్‌లో పరిచయం చేస్తున్నాయి. అయితే వాటి రేట్లు కూడా అధిక ధరలో ఉంటున్నాయి. కానీ కొన్ని మోడళ్లు మాత్రం సామాన్యులను అందుబాటు ధరలో చాలా తక్కువకే లభిస్తున్నాయి. అందువల్ల మీరు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. మీ పాత 4G ఫోన్ నుండి 5G ఫోన్‌కు మారాలనుకుంటే Amazon మంచి ఎంపిక. మంచి డిస్కౌంట్లతో పాటు బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు పొందొచ్చు. కొన్ని మోడల్స్ కూపన్ ఆఫర్‌తో కూడా వస్తాయి. మీరు రూ. 12,000లోపు కొనుగోలు చేయగల కొన్ని బడా స్మార్ట్‌ఫోన్ల గురించి తెలుసుకుందాం.


Realme Narzo N65 5G

అమెజాన్‌లో Realme Narzo N65 5G స్మార్ట్‌ఫోన్ చాలా తక్కువకే రిలీజ్ అయింది. ఇది FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. వెనుకవైపు 50MP సింగిల్ కెమెరా, 8MP సెల్ఫీ స్నాపర్‌ని కలిగి ఉంది. ఈ ఫోన్ MediaTek Dimensity 6300 చిప్‌సెట్‌తో ఆధారితమైనది. ఇది 3 వేరియంట్లలో అందు బాటులో ఉంది.


అందులో దీని బేస్ వేరియంట్ 4GB RAM + 128GB స్టోరేజ్ తక్కువకే లిస్ట్ అయింది. దీని అసలు ధర రూ.13,999 ఉండగా ఇప్పుడు రూ.11,499కే లిస్ట్ అయింది. అయితే కొనుగోలుదారులు రూ. 1000 కూపన్ తగ్గింపు కూడా పొందొచ్చు. ఈ తగ్గింపుతో ఈ 5జీ ఫోన్‌ను కేవలం రూ. 10,499 సొంతం చేసుకోవచ్చు. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌తో రన్ అవుతుంది. రియల్‌మీ యూఐ 5.0 అవుట్ ది బాక్స్‌ను కలిగి ఉంది.

Also Read: కెవ్ కేక.. రూ.7వేల లోపు 50MP కెమెరా స్మార్ట్‌ఫోన్లు.. మనందరి కోసమే!

iQOO Z9x 5G

అమెజాన్‌లో iQOO Z9x 5G పై కూడా మంచి ఆఫర్ ఉంది. ఇది FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 50MP డ్యూయల్-రియర్ కెమెరా సిస్టమ్, 8MP సెల్ఫీ స్నాపర్‌ని కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 6 Gen 2 చిప్‌సెట్ దీనికి శక్తినిస్తుంది. ఇది కూడా మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అందులో దీని బేస్ వేరియంట్ 4GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.17,999గా ఉంది. అయితే ఇప్పుడు కేవలం రూ.12,999లకే కొనుక్కోవచ్చు. అలాగే ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై రూ.1,299 వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. అప్పుడు మరింత తక్కువకే ఇది లభిస్తుంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. Android 14 OSలో నడుస్తుంది. Funtouch OS 14ని కలిగి ఉంది.

Poco M6 Pro 5G

Poco M6 Pro అనేది అమెజాన్‌లో చాలా తక్కువ ధరకే లభిస్తుంది. ఇది FHD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.79-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 50MP డ్యూయల్-రియర్ కెమెరా సిస్టమ్, 8MP సెల్ఫీ స్నాపర్‌ని కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 చిప్‌సెట్ దీనికి శక్తినిస్తుంది. దీని బేస్ వేరియంట్ 4GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.15,999 ఉండగా ఇప్పుడు కేవలం రూ.9,499లకే సొంతం చేసుకోవచ్చు. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 OSలో నడుస్తుంది. MIUI 14 అవుట్ ది బాక్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు మరెన్నో 5జీ స్మార్ట్‌ఫోన్లను అమెజాన్ ద్వారా కేవలం రూ.12వేల కంటే తక్కువ ధరలోనే కొనుక్కోవచ్చు.

Related News

Pixel 9 Discount: పిక్సెల్ 9పై భారీ తగ్గింపు.. రూ.27000 డిస్కౌంట్ త్వరపడండి

ChatGPT Chess Grok: గ్రోక్ ఏఐని ఓడించిన చాట్‌జీపీటీ.. చెస్ పోటీల్లో అద్భుత గెలుపు

iQOO Z10R vs Moto G96 vs Galaxy F36: మిడ్ రేంజ్‌లో విన్నర్ ఎవరు?

Chat GPT: సజేషన్ కోసం చాట్ జీపీటీని అడిగాడు.. చివరకు సీన్ కట్ చేస్తే..?

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

GPT-5 Backlash: జిపిటి-5 వద్దు రా బాబు.. చాట్ జిపిటి కొత్త వెర్షన్‌పై యూజర్ల అసంతృప్తి

Big Stories

×